Winter Health: వాతావరణం చల్లగా ఉందని నీళ్లు తాగడం లేదా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..
ABN , Publish Date - Jan 07 , 2024 | 04:03 PM
రోజురోజుకు చలి పంజా విసురుతోంది. ఉదయం 10 గంటలైనా పొగమంచు వీడటం లేదు. స్వెట్టర్లు, మఫ్లర్లు లేనిదే
రోజురోజుకు చలి పంజా విసురుతోంది. ఉదయం 10 గంటలైనా పొగమంచు వీడటం లేదు. స్వెట్టర్లు, మఫ్లర్లు లేనిదే బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ సమయంలోనే ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డీ-హైడ్రేషన్ గురించి. బయట వాతావరణం చల్లగా ఉంది కదా అని చాలా మంది వాటర్ తాగరు. కానీ.. మన శరీరానికి అవసరమైన నీటిని అందించడం మన బాధ్యత. లేకుంటే జీర్ణక్రియ మందగించడం, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కోల్పోవడం, రోగనిరోధక వ్యవస్థ డీలా పడటం, ఎముకలు పెళుసు బారిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి వేసవికాలంలోనే డీ హైడ్రేషన్ సమస్య ఉంటుందనే అపోహ నుంచి బయటపడి.. వింటర్ లోనూ అవసరమైనంత నీటిని తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.
లంచ్, డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ చేసే సమయంలో ఆహారంతో పాటు.. తగిన మోతాదులో నీటినీ కచ్చితంగా తీసుకోవాలి. అవసరమైతే లెమన్ వాటర్ తాగడం ఉత్తమం. నారింజ, కీరా ముక్కలు తీసుకోవడం వల్ల నీటి సమస్యను అధిగమించవచ్చు. టీ, కాఫీల ప్లేస్ లో వేడి వేడి సూప్ లు తీసుకోవచ్చు. అవకాడోలు, బెర్రీలు, టొమాటోలను డైట్ లో భాగంగా చేసుకోవాలి. వాటర్ పర్సంటేజ్ అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే పానీయాలను తాగడం ద్వారా డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. కొబ్బరి నీళ్లు, గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసుకుని తాగడం వంటివి చేయాలి.
చిలగడదుంపలు డీహైడ్రేటింగ్ నుంచి కాపాడుతుంది. ఫైబర్ నిండిన కూరగాయలను డైట్ లో చేర్చాలి. చర్మ సంరక్షణ కోసం రసాయనాలు లేని మాయిశ్చరైజర్లను వాడాలి. చర్మం ద్వారా అధిక మొత్తంలో నీరు బయటకు పోతుంది కాబట్టి.. ఆ స్థానాన్ని ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి.
ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే..
మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.