Health News: బిర్యానీ ప్రియులూ.. ఈ విషయాలు తెలుసుకోండి..
ABN , Publish Date - Jul 30 , 2024 | 07:48 AM
భారతీయులు ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ ఆహార ప్రియులు. పూర్వకాలం నుంచే రకరకాల వంటలు రుచి చూసే సంప్రదాయం మనది. రోజులు మారాయి.. ఆధునిక ప్రపంచంలో ఫాస్ట్ ఫుడ్‌లు, బర్యానీ సెంటర్లదే హవా. ప్రజలు సైతం ఎక్కువగా బయట తినేందుకు ఇష్టపడుతుంటారు.
భారతీయులు ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ ఆహార ప్రియులు. పూర్వకాలం నుంచే రకరకాల వంటలు రుచి చూసే సంప్రదాయం మనది. రోజులు మారాయి.. ఆధునిక ప్రపంచంలో ఫాస్ట్ ఫుడ్‌లు, బర్యానీ సెంటర్లదే హవా. ప్రజలు సైతం ఎక్కువగా బయట తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఈరోజుల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడేది బిర్యాని. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వీకెండ్ వచ్చిందంటూ చాలు అందరూ బిర్యానీ సెంటర్లకు క్యూ కడతారు. కొందరైతే వారంలో నాలుగైదు సార్లు తినాల్సిందే.
అయితే బయట దొరికే ఆహార పదార్థాలు ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు సూచిస్తున్నారు. వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్తున్నారు. ముఖ్యంగా చికెన్ ముక్కలు, బిర్యానీ రైస్ కోసం వాడే రంగులు, టేస్ట్ కోసం వాడే పదార్థాలు చాలా ప్రమాదకరమని ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే చాలా హోటళ్లు ఆహార భద్రతా నియమాలు పాటించడం లేదని పలు సర్వేల్లో తేలింది. అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేస్తున్నారంటూ పలు హోటళ్లను సైతం అధికారులు మూసివేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
బిర్యానీ అతిగా తింటే ఏమవుతుంది?
బిర్యానీ తరచూ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా హోటళ్లలో బిర్యానీ విరివిరిగా దొరుకుతోంది. దీంతో మాంసాహార ప్రియులు తెగ తినేస్తున్నారు. దీంతో చిన్నారులు, యువత ఊబకాయం బారిన పడుతున్నారు. ఊబకాయం వల్ల వారికి మరికొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇంట్లో వంట కోసం వాడే నూనె కన్నా అధికంగా హోటళ్లు బిర్యానీ తయారీకి వాడతారు. దీని వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. చికెన్, మటన్ అధికంగా తినడం వల్ల శరీరంలో కొవ్వు శాతం అధికంగా చేరి అనేక అనారోగ్యాలకు గురి చేస్తాయి. అలాగే రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ పెరిగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
బిర్యానీ చాలా రుచిగా ఉండడంతో విపరీతంగా తింటుంటారు. దీన్ని వల్ల గుండెకు ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణలు హెచ్చిరిస్తున్నారు. హోటళ్లలో దీని తయారీకి ఉపయోగించే నూనెలు మంచి కావని చెప్తున్నారు. బయట తినడం వల్ల గుండె సంబంధిత జబ్బులను కొని తెచ్చుకోవడమే అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
బిర్యానీ ఎక్కువ తినడం వల్ల ఊబకాయంతోపాటు అల్సర్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. దీని తయారీలో మసాలాలు అధికంగా వాడతారు. ఇంటి వంట కంటే కూడా రెండు మూడు రెట్లు అధికంగా వినియోగిస్తారు. అప్పుడే దానికి టేస్ట్ వస్తుంది. రెగ్యులర్‌గా ఆ స్థాయిలో మసాలాలు తింటే అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు తీవ్రంగా వేధించే అవకాశం ఉంది.