Human Brain: జ్ఞాపకశక్తి మెదడు సొత్తే కాదు.. సైంటిస్టుల పరిశోధనలో సంచలన విషయాలు
ABN , Publish Date - Nov 10 , 2024 | 02:50 PM
సాధారణంగా ప్రతి ఒక్కరూ మెదడు మాత్రమే జ్ఞాపకశక్తిని కలిగి ఉంటుందని అనుకుంటారు. కానీ సైంటిస్టులు మాత్రం సంచలన విషయాలు వెల్లడించారు.
మానవ మెదడు అత్యంత శక్తిమంతమైనది. అందులో ఎలక్ట్రాన్లు, న్యూరాన్లు కలగలిపి ఉంటాయి. వాటి సమన్వయంతో ఆధునిక కంప్యూటర్ మాదిరిగా శరీరాన్ని నడిపిస్తుంది. శరీరంలోని ప్రతి కదలికకు మెదడే కారణం. అందులో జరిగే రసాయన చర్యతోనే మన భావాలు ముడిపడి ఉంటాయి. మన జీవితానికి సంబంధించిన ప్రతి ఆలోచన, పని, విషయం మెదడులోనే నిక్షిప్తమవుతుంది. మెదడు ఎంత చురుగ్గా ఉంటే మనం అంత యాక్టివ్‌గా ఉంటాం. మెదడు పనిచేసే విధానాన్ని బట్టే జ్ఞాపకశక్తి కూడా ఆధారపడుతుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ మెదడు మాత్రమే జ్ఞాపకశక్తిని కలిగి ఉంటుందని అనుకుంటారు. కానీ సైంటిస్టులు మాత్రం సంచలన విషయాలు వెల్లడించారు.
మెదడు సొత్తే కాదు
జ్ఞాపకశక్తి ఒక్క మెదడు సొత్తే కాదని సైంటిస్టులు అంటున్నారు. శరీరంలోని అన్ని అవయవాలకూ విషయాలను గుర్తుపెట్టుకునే సామర్థ్యం ఉంటుందని చెబుతున్నారు. అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన నికోలాయ్, వీ కుకుష్కిన్ మానవ శరీరంపై ప్రయోగం చేశారు. ఈ అధ్యయనానికి సంబంధించిన విషయాలను ఓ జర్నల్‌లో వెల్లడించారు. మెదడు మాత్రమే కాదు.. మనిషి శరీరంలోని ఇతర కణాలు కూడా జ్ఞాపకశక్తిని కలిగి ఉంటాయని ఆ జర్నల్‌లో తెలిపారు. ఏదైనా కొత్త సమాచారం వచ్చినప్పుడు మెదడు కణాలతో పాటు శరీరంలోని ఇతర అవయవాలకు చెందిన కణాలు కూడా వాటిని స్పందిస్తాయని చెప్పారు.
ఒకేలా పనితీరు..
శరీరంలోని ఇతర కణాలు మెదడులాగే ఏదైనా కొత్త సమాచారం వచ్చినప్పుడు స్పందించడమే గాక దాన్ని గుర్తుపెట్టుకోవడం లాంటివి కూడా చేస్తుంటాయని సైంటిస్ట్ కుకుష్కిన్ వెల్లడించారు. ఏదైనా విషయాన్ని భద్రపర్చాలంటే మెదడులోని న్యూరాన్లు బాగా పని చేయాల్సి ఉంటుంది. అయితే న్యూరాన్లు ఎలాగైతే సమాచారాన్ని రిజిస్టర్ చేస్తాయో అదే విధంగా శరీరంలోని ఇతర కణాలు కూడా డేటాను తీసుకొని స్టోరేజ్ చేస్తుంటాయని కుకుష్కిన్ తెలిపారు. సమాచారాన్ని సేకరించడం, భద్రపర్చడం, విషయాలను నేర్చుకోవడం అనేది మెదడు కణాలకు మాత్రమే సాధ్యమని అనుకోవద్దని.. శరీరంలోని ఇతర కణాలు కూడా ఈ పనులు సమర్థంగా చేయగలవని పేర్కొన్నారు.
Also Read:
మధ్యాహ్నం ఓ కునుకు తీస్తే కలిగే ప్రయోజనాలు ఇవే!
ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటున్నారా.. సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు
చలికాలంలో బొంతలు, దుప్పట్ల వాసన.. ఇలా చేస్తే మాయం..
For More Health And Telugu News