Share News

Hyderabad: న్యుమోనియాతో జర భద్రం..

ABN , Publish Date - Nov 12 , 2024 | 01:18 PM

న్యూమోనియా(Pneumonia)తో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చలికాలంలో వైద్యుల సలహాలు పాటించాలని మెడికవర్‌ ఆస్పత్రి పల్మనాలజిస్టు డాక్టర్‌ రాజమనోహర్‌ ఆచార్యులు(Dr. Rajamanohar Acharya) తెలిపారు. ప్రపంచ న్యుమోనియా డే సందర్భంగా ప్రతి ఏడాది కొత్త నినాదంతో కార్యక్రమాలు చేపుడుతన్నామని మాదాపూర్‌(Madapur)లోని మెడికవర్‌ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయ న వివరించారు.

Hyderabad: న్యుమోనియాతో జర భద్రం..

- పల్మనాలజిస్టు డాక్టర్‌ రాజమనోహర్‌ ఆచార్యులు

హైదరాబాద్‌ సిటీ: న్యూమోనియా(Pneumonia)తో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చలికాలంలో వైద్యుల సలహాలు పాటించాలని మెడికవర్‌ ఆస్పత్రి పల్మనాలజిస్టు డాక్టర్‌ రాజమనోహర్‌ ఆచార్యులు(Dr. Rajamanohar Acharya) తెలిపారు. ప్రపంచ న్యుమోనియా డే సందర్భంగా ప్రతి ఏడాది కొత్త నినాదంతో కార్యక్రమాలు చేపుడుతన్నామని మాదాపూర్‌(Madapur)లోని మెడికవర్‌ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయ న వివరించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మైనర్‌ను పెళ్లి చేసుకున్న నిందితుడికి యావజ్జీవ శిక్ష


city10.2.jpg

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యుమోనియా అనేది బ్యాక్టీరియా, వైర్‌సలు లేదా ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఏర్పడే ఒక ఇన్ఫ మేటరీ రెస్పిరేటరీ డిజార్డర్‌గా పేర్కొన్నారు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తికి, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో ప్రాణాంతకం కావచ్చునన్నారు. న్యుమోనియాను చికిత్సతో నియంత్రించవచ్చునన్నారు.


గత సంవత్సరాల్లో న్యుమోనియా మరియు ఇతర శ్వాసకోశ అంటువ్యాధుల కారణంగా మరణాల సంఖ్య బాగా పెరిగిందిదన్నారు. ఆస్తమా, దీర్ఘకాలికి సీఓపీడీ, గుండె వ్యాధులు, స్మోకింగ్‌ అధికంగా చేసేవారు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిఉన్నవారు, కొన్ని రసాయనాలు, కాలుష్య కారకాలకు, విషపూరిత పొగలకు గురైనవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. దగ్గు, రక్తంతో కూడిన కఫం, చలి జ్వరం, శ్వాస కోశాల్లో నొప్పి, ఛాతీ భాగంలో నొప్పి, తలనొప్పి, ఆక్సిజన్‌ స్థాయిల్లో హెచ్చుతగ్గులు వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఈ వ్యాధి సోకడం వల్ల కిడ్నీ, గుండె, కాలేయం లాంటి శరీరంలో ఉన్న ఇతర అవయవలు కూడా దెబ్బ తింటాయి అని అన్నారు.

(గమనిక: ఇది కేవలం నిపుణులు నుంచి సేకరించిన సమాచారం కోసం మాత్రమే… ABN ఆంధ్రజ్యోతి నిర్ధారించలేదు)


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు... ఏం జరిగిందంటే..

ఈవార్తను కూడా చదవండి: IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...

ఈవార్తను కూడా చదవండి: Khammam: బోనకల్‌లో యాచకుడికి ఐపీ నోటీసు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 12 , 2024 | 01:43 PM