Share News

Weight loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ జ్యూస్‌లు ట్రై చేయండి..

ABN , Publish Date - Sep 06 , 2024 | 07:52 AM

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఇష్టపడతారు. అందుకే నేటి తరంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెరిగింది. వ్యాయామం, మంచి ఆహారం తీసుకుంటూ ఎప్పటికప్పుడు హెల్తీగా ఉంటున్నారు. అయితే మరోపక్క చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యమైనది ఊబకాయం.

Weight loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ జ్యూస్‌లు ట్రై చేయండి..

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఇష్టపడతారు. అందుకే నేటి తరంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెరిగింది. వ్యాయామం, మంచి ఆహారం తీసుకుంటూ ఎప్పటికప్పుడు హెల్తీగా ఉంటున్నారు. అయితే మరోపక్క చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యమైనది ఊబకాయం. చిన్న వయసులోనూ చాలా మంది అధిక బరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని బారి నుంచి తప్పించుకునేందుకు వెయిట్ లాస్ ట్రీట్మెంట్ల వైపు మెుగ్గు చూపుతున్నారు. అయితే అలాంటి వారు వ్యాయామంతోపాటు ఇంట్లో తయారు చేసుకునే జ్యూస్‌లు తాగి ఒబెసిటీ సమస్య నుంచి బయటపడొచ్చు. ఆ జ్యూస్‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం..


* బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ జ్యూస్ మంచి ఔషధంగా పని చేస్తుంది. సొరకాయలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఉదయాన్నే మంచి వ్యాయామంతోపాటు పరిగడుపున ఒక గ్లాసు సొరకాయ జ్యూస్ తాగాలి. ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గించి వెయిట్ లాస్ అయ్యేందుకు ఎంతో దోహదపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా బరువు తగ్గే వరకూ కొనసాగించాలి.


* ప్రతి రోజూ ఉదయం గోరువెచ్చని గ్లాసు నీటిలో టేబుల్ స్పూన్ తేనె, నిమ్మకాయ సగం ముక్క రసం పిండి తాగాలి. బరువు తగ్గేందుకు ఇది మంచి చిట్కా. అయితే దీన్ని పరిగడుపున తాగాల్సి ఉంటుంది. నిమ్మరసంలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు, తేనెలో ఉండే మంచి గుణాలు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో అధిక బరువు సమస్య నుంచి దూరం కావొచ్చు.


*అంతేకాదు బరువు తగ్గేందుకు క్యారెట్ జ్యూస్ తాగటం ఉత్తమం. తరిగిన క్యారెట్ ముక్కలలో గ్లాస్ వాటర్ పోసి జ్యూస్ తయారు చేసుకోవాలి. క్యారెట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది తాగగానే పొట్ట ఫుల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఇదే ఫీలింగ్ చాలా సేపు ఉంటుంది. దీంతో ఆహారాన్ని మితంగా తినే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువు తగ్గే అవకాశాలూ ఎక్కువే.


* ఊబకాయం నుంచి బయటపడేందుకు ఉసిరి జ్యూస్ సైతం మంచి ఔషధంగా పని చేస్తుంది. ఒక గ్లాసు మంచినీటిలో తగినని ఊసిరి ముక్కలు, చిన్న అల్లం ముక్క, కొంచెం పుదీనా వేసి మిక్సీ పట్టాలి. అలా చేసిన ద్రావణాన్ని ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తీ పెరుగుతుంది.


* బీట్ రూట్ ముక్కలుగా చేసి గ్లాసు వాటర్‌లో వాటిని వేసి జ్యూస్ చేసుకుని తాగాలి. ఈ బీట్ రూట్ జ్యూస్ పరిగడుపున తాగడం ద్వారా ఒబెసిటీ నుంచి బయటపడొచ్చు. ఇలా చేయడం ద్వారా ఆకలి తగ్గుతుంది. అలాగే జీవక్రియ మెరుగుపడుతుంది. దీని ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అయితే బరువు తగ్గాలనుకుంటే జ్యూస్‌లు తాగడం ఒక్కటే కాదు. మంచి వ్యాయామం, మితంగా తినడం, ఆహారంపై అదుపు వంటి పలు అంశాలనూ పరిగణలోకి తీసుకోవాలి.

Updated Date - Sep 06 , 2024 | 07:52 AM