One-Pot-Stew: ఈ కేరళ వంటకం రుచికే కాదండోయ్.. అమితమైన బలాన్నిచ్చి జబ్బులనూ తరిమికొడుతుంది.. దీన్నెలా చేయాలంటే..
ABN , Publish Date - Jan 25 , 2024 | 02:03 PM
ఈ కేరళ వంటకాన్ని తయారుచేసుకుని తినడం వల్ల శరీరానికి అమితమైన బలం చేకూరుతుంది.
భారతదేశమంతటా బోలెడు ఆహారాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు కొన్ని ఫేమస్ ఆహారాలకు ప్రసిద్ది చెంది ఉంటాయి. ప్రాంతీయత ఒక కారణం అయితే దాని తయారీవిధానం, ఉపయోగించే దినుసులు, దాని చరిత్ర కూడా ఆహారం ఫేమస్ కావడానికి కారణం అవుతుంది. కేరళకు చెందిన ఎన్నో వంటకాలను చాలామంది ఇష్టపడతారు. అయితే కేరళ ప్రజలు ఇష్టంగా తయారుచేసుకునే వన్-పాట్-స్టూ మాత్రం కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చక్కని విందు అవుతుంది. అసలే చలికాలం కనుక ఈ కేరళ వంటకాన్ని తయారుచేసుకుని తినడం వల్ల శరీరానికి అమితమైన బలం చేకూరి సీజనల్ సమస్యలు అయిన జలుబు, దగ్గు, జ్వరం వంటివి మంత్రించినట్టు మాయమవుతాయి. ఈ వన్-పాట్-స్టూ ఎలా వండాలంటే..
కావలసిన పదార్థాలు..
200 గ్రాముల చికెన్.
1 1/2 కప్పు మిక్స్డ్ కూరగాయలు.
1 పెద్ద ఉల్లిపాయ
1 అంగుళం అల్లం
5 వెల్లుల్లి
2-3 పచ్చిమిర్చి
1 కప్పు లేత కొబ్బరి పాలు
7-8 కరివేపాకులు
1 టీస్పూన్ మిర్చి పౌడర్
2 ఎండు మిర్చి
1/2 కప్పు చిక్కటి కొబ్బరి పాలు
1/4 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి
1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి
2-3 కరివేపాకు రెమ్మలు
2 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె
ఉప్పు, మిరియాల పొడి రుచికి తగినంత
ఇది కూడా చదవండి: అల్పాహారంలో ఇవి తీసుకుంటే చాలు.. రోజంతా రేసుగుర్రం లెక్క చురుగ్గా ఉంటారు!
తయారీవిధానం..
మొదట చికెన్ ను కడిగి శుభ్రం చేయాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కూరగాయలను కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఉల్లిపాయలు, క్యారెట్లు, బీన్స్, బంగాళాదుంపలు, బఠానీలు వంటి కూరగాయలను కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి
ప్రెజర్ కుక్కర్ తీసుకొని కొబ్బరి నూనె వేసి, ఆపై ఎండుమిర్చి, కరివేపాకు, తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కుల, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయలను జోడించాలి. ఉల్లిపాయ వేగాక తరిగిన కూరగాయలు, చికెన్ ముక్కలను వేయాలి. కూరగాయలు, చికెన్ కొద్దిగా బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించాలి
ఇప్పుడు మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి, మిర్చి పౌడర్, ఉప్పు వేసి కొంచెం నీళ్లు కొబ్బరి పాలు వేసి 5 నిమిషాలు ఉడికించి, కుక్కర్ మూత పెట్టాలి. దీన్ని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి
మూత తీసివేసి ఉప్పు, మసాలా నరిచూసుకోవాలి. మిశ్రమం నీళ్ళగా ఉంటే కొద్దిసేపు మంటమీద ఉడికించి చిక్కగా అయ్యేలా చేయాలి. అంతే వన్-పాట్-స్టూ సిద్దమైనట్టే.. కొబ్బరి పాలు, చికెన్, కూరగాయల కలయికతో ఇది చాలా బలవర్థకమైన ఆహారం జాబితాలో ఉంది. దీన్ని కేరళీయులు ఇష్టంగా తినే అప్పం లేదా అన్నంతో కూడా తినవచ్చు.
ఇది కూడా చదవండి: Home Cleaning: వ్యాధులనేవి ఇంటి దరిదాపుల్లో ఉండకూడదంటే.. ఇంటిని ఈ టిప్స్ తో శుభ్రం చెయ్యాల్సిందే..!
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.