PM Modi: అమెరికాలో ఎన్ఆర్ఐల ప్రచారం.. మూడోసారి మోదీ ప్రధాని కావాలని నినాదాలు
ABN , Publish Date - Apr 08 , 2024 | 05:14 PM
దేశవ్యాప్తంగా ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది. ఓటర్లను ఆకట్టుకునే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రచార హోరు కొనసాగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఎన్ఆర్ఐలో జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఎన్ఆర్ఐలు ప్రచారం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది. ఓటర్లను ఆకట్టుకునే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రచార హోరు కొనసాగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఎన్ఆర్ఐలో జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఎన్ఆర్ఐలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలో బీజేపీ మూడోసారి విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
వాషింగ్టన్ డీసీ వద్ద గల క్యాపిటల్ హిల్ రిఫ్లెక్షన్ పాండ్ వద్ద మోదీ కా పరివార్ టీ షర్టులు ధరించారు. అమెరికా, భారతదేశం, బీజేపీ జెండాలను పట్టుకొని ఊపారు. క్యాపిటల్ హిల్ రిఫ్లెక్షన్ పాండ్ వద్ద నుంచి అబ్ కీ బార్ 400, మోదీ 3.o, మోదీ కోసం సిక్కు అమెరికన్లు, మోదీ హామీ- భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వంటి నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. మరికొందరు శాన్ ఫ్రాన్సిస్కోలో ఐకానిక్ గోల్డెన్ గేట్ బ్రిడ్జీ వద్ద గుమికూడారు.
ఇది కూడా చదవండి:
Israel vs Hamas: విజయానికి ఒక్క అడుగు దూరంలోనే.. అప్పటిదాకా తగ్గేదేలేదన్న ఇజ్రాయెల్ ప్రధాని
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.