Migrants: ఇంగ్లీష్ ఛానల్ దాటి UKకి వెళ్తున్న ఐదుగురు వలసదారులు మృతి
ABN , Publish Date - Apr 24 , 2024 | 07:20 AM
ఉత్తర ఫ్రాన్స్(France) నుంచి ప్రమాదకరమైన ఇంగ్లిష్ ఛానల్(English Channel)ను దాటేందుకు ప్రయత్నించిన ఓ చిన్నారి సహా ఐదుగురు వలసదారులు(migrants) చనిపోయారు. ఈ మేరకు ఫ్రెంచ్ మీడియా సమాచారం ఇచ్చింది. ఈ ఘటనపై UN శరణార్థుల ఏజెన్సీ, కౌన్సిల్ ఆఫ్ యూరప్ సహా పలు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఉత్తర ఫ్రాన్స్(France) నుంచి ప్రమాదకరమైన UK ఇంగ్లిష్ ఛానల్(English Channel)ను దాటేందుకు ప్రయత్నించిన ఓ చిన్నారి సహా ఐదుగురు వలసదారులు(migrants) చనిపోయారు. ఈ మేరకు ఫ్రెంచ్ మీడియా సమాచారం ఇచ్చింది. ఉత్తర ఫ్రాన్స్‌లోని Vimeraux బీచ్‌లో మంగళవారం ఐదుగురు వలసదారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో సుమారు 100 మందికిపైగా వలసదారులు సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించింది. అయితే 112 మంది వ్యక్తులతో కూడిన చిన్న పడవలో ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ లేన్ దాటడానికి ప్రయత్నించిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొంది.
అయితే రువాండాకు వలసదారులను పంపాలన్న బ్రిటన్(britain) ప్రధాని రిషి సునాక్(rishi sunak) నిర్ణయాన్ని బ్రిటిష్ పార్లమెంట్(british parliament) ఆమోదించిన కొద్ది గంటలకే ఈ ఘటన చోటు చేసుకుంది. మానవ హక్కుల సంఘాలు ఈ చట్టాన్ని అమానవీయం, క్రూరమైనదిగా అభివర్ణించాయి. UN శరణార్థుల ఏజెన్సీ, కౌన్సిల్ ఆఫ్ యూరప్ రెండూ మంగళవారం నాడు UK ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసిందిగా కోరాయి. ఎందుకంటే ప్రపంచ వలసల సంక్షోభాన్ని పరిష్కరించడంలో అంతర్జాతీయ సహకారానికి ఆటంకం కలుగుతుందని వారు భావిస్తున్నారు.
రువాండాకు శరణార్థులను పంపే చట్టం ఆమోదం కోసం UK ప్రభుత్వం రెండేళ్లుగా ప్రయత్నిస్తోంది. చివరకు మంగళవారం UK పార్లమెంట్ రాత్రిపూట చట్టాన్ని ఆమోదించింది. ప్రభుత్వం కనికరంతో వ్యవహరిస్తోందని, ప్రజలు, స్మగ్లర్లు సహా హాని కలిగించే వారిని సముద్రంలో ఇబ్బందులకు గురికాకుండా నిరోధించాలని కోరుకుంటున్నామని UK ప్రధాని రిషి సునాక్(rishi sunak) అన్నారు. వలసదారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అక్రమంగా బ్రిటన్‌కు వస్తున్నారని వెల్లడించారు. UK ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2023లో దాదాపు 30,000 మంది ప్రజలు ఇంగ్లీష్ ఛానల్‌ను దాటేందుకు ప్రయత్నించారని ఓ నివేదిక చెబుతోంది.
ఇది కూడా చదవండి:
Gold and Silver Rates: బంగారం, వెండి మళ్లీ తగ్గిందోచ్..ఎంత ఉన్నాయంటే
CIBIL Score: ఈ తప్పులు చేస్తున్నారా.. మీ సిబిల్ స్కోర్ ఖతం
Read Latest International News and Telugu News