Share News

Vladimir Putin: శాంతి చర్చలకు సిద్ధం.. రష్యా అధ్యక్షుడి కీలక ప్రకటన

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:27 PM

ఉక్రెయిన్, రష్యా యుద్ధం విరమించుకునే విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించగలవని ఆయన అన్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Vladimir Putin: శాంతి చర్చలకు సిద్ధం.. రష్యా అధ్యక్షుడి కీలక ప్రకటన
Putin announcement

గత రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి(russia ukraine war) తెరపడే అవకాశం కనిపిస్తోంది. గత నెలలో ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా శాంతి కోసం(peace talks) ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో శాంతి చర్చలు చేసేందుకు భారతదేశం సిద్ధంగా ఉందన్నారు. ఆ క్రమంలో ఉక్రెయిన్‌ శాంతి చర్చలకు అంగీకరించింది. ఇప్పుడు తాజాగా రష్యా కూడా తొలిసారిగా చర్చలకు ఓకే చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటివల రష్యా, ఉక్రెయిన్‌లను సందర్శించిన తర్వాత రెండు దేశాల నుంచి శాంతి చర్చల కోసం ప్రకటన రావడం విశేషం. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో శాంతి చర్చల్లో భాగంగా భారతదేశం, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించగలవని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(vladimir putin) గురువారం ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో తెలిపారు.


గతంలో చర్చలు

అయితే ఉక్రెయిన్‌(Ukraine)లోని డాన్‌బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడమే మా ప్రధాన లక్ష్యమని పుతిన్ అన్నారు. ఈ క్రమంలోనే రష్యా సైన్యం క్రమంగా ఉక్రేనియన్ సైన్యాన్ని కుర్స్క్ నుంచి వెనక్కి పంపుతోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన వారం రోజులకే ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చల్లో యుద్ధానికి సంబంధించి ప్రాథమిక ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం ఎప్పుడూ అమలు కాలేదని పుతిన్ చెప్పారు. ఇప్పుడు మధ్యవర్తిత్వ చర్చలు మళ్లీ ప్రారంభమైతే ఇస్తాంబుల్‌లో కుదిరిన ప్రాథమిక ఒప్పందం ఈ చర్చలకు ఆధారం కావచ్చు.


మధ్యవర్తిత్వం

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం రెండు సంవత్సరాలకు పైగా కొనసాగుతుంది. ఈ క్రమంలో రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ శాంతి చర్చలలో రష్యా పాల్గొనకపోవడం వల్ల ఈ సమావేశాలు ఎటువంటి సానుకూల ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పుడు పుతిన్ స్వయంగా చర్చలకు సిద్ధమని సూచించడం విశేషం.


పుతిన్ షరతులు

కానీ యుద్ధాన్ని ఆపేందుకు రష్యా విధించిన షరతుల(conditions) ప్రకారం డొనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజియా ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి. అలాగే ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో భాగంగా ఉండకూడదు. అయితే ఈ ఉక్రెయిన్ నిబంధనలను అంగీకరించడానికి నిరాకరించింది. ఉక్రెయిన్ నుంచి రష్యా తన దళాలన్నింటినీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.


ఇవి కూడా చదవండి:

Delhi High Court: వికీపీడియాను మందలించిన ఢిల్లీ హైకోర్టు.. కారణమిదే..


Bangalore: చార్జ్‌షీట్‌లో.. ఏ2గా స్టార్‌ హీరో దర్శన్


Minister: ఇలాంటి నటులు దేశాన్ని కాపాడగలరా?


Read More International News and Latest Telugu News

Updated Date - Sep 05 , 2024 | 03:30 PM