Hinduja Family: భారతీయ సిబ్బందికి శునకాల కంటే తక్కువ జీతం.. హిందుజా ఫ్యామిలీలో నలుగురికి జైలుశిక్ష
ABN , Publish Date - Jun 22 , 2024 | 10:08 AM
స్విట్జర్లాండ్‌లో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకరైన భారతీయ సంతతి హిందుజా కుటుంబానికి(Hinduja family) చెందిన నలుగురికి జైలు శిక్ష పడింది. అయితే అసలేం జరిగింది. వారికి ఎందుకు శిక్ష పడిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్విట్జర్లాండ్(switzerland)లో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకరైన భారత సంతతి హిందుజా కుటుంబానికి(Hinduja family) చెందిన నలుగురికి జైలు శిక్ష పడింది. అయితే అసలేం జరిగింది. వారికి ఎందుకు శిక్ష పడిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం నుంచి తీసుకువచ్చిన గృహ సహాయకులను వేధింపులకు గురి చేసి, దోపిడీ చేసినందుకు స్విట్జర్లాండ్‌లోని కోర్టు(Swiss court) వారిని దోషులుగా నిర్ధారించింది. ఆ క్రమంలో హిందుజా కుటుంబానికి చెందిన నలుగురికి కోర్టు శుక్రవారం నాలుగున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.
ఎక్కువ మంది భారతీయులు
పనిచేసే వారిలో ఎక్కువ మంది భారతీయులు(indians) ఉన్నారని, వారు జెనీవా(Geneva)లోని ఈ బిలియనీర్ కుటుంబానికి చెందిన విల్లాలో పనిచేశారని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఆ సమయంలో హిందుజా ఫ్యామిలీ భారతీయ పనివారికి వారి శునకాల కంటే తక్కువగా వేతనాలు చేల్లించారని వెలుగులోకి వచ్చిందన్నారు. అయితే మానవ అక్రమ రవాణా ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త ప్రకాష్ హిందుజా, అతని భార్య, కొడుకు, కోడలు వారి సేవకులను వినియోగించారని ప్రాసిక్యూషన్ వెల్లడించింది. వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులైన భారతీయులు ఉన్నారని చెప్పింది.
నిందితులు..
ఈ కేసులో నలుగురు నిందితులు కోర్టుకు(Swiss court) హాజరుకాలేదు. కానీ వారి కుటుంబ వ్యాపార నిర్వాహకుడు, ఐదో నిందితుడు నజీబ్ జియాజీ కోర్టుకు హాజరయ్యారు. ఉద్యోగులను దోపిడీ చేయడం, అనధికారికంగా ఉపాధి కల్పించడం వంటి నేరాలకు నలుగురు వ్యక్తులు దోషులని స్విస్ కోర్టు స్పష్టం చేసింది. హిందూజా కుటుంబం భారతీయ సిబ్బంది పాస్‌పోర్ట్‌లను జప్తు చేసి, స్విస్ ఫ్రాంక్‌లకు బదులుగా భారతీయ కరెన్సీలో చెల్లిస్తున్నారని ఆరోపించారు. వారు విల్లా వదిలి వెళ్ళకుండా నిరోధించి, స్విట్జర్లాండ్‌లో చాలా తక్కువ డబ్బుతో ఎక్కువసేపు పని చేయించారని వెల్లడించారు.
హిందూజా గ్రూప్ ఆస్తి
స్విస్ చట్టం ప్రకారం వారికి చాలా తక్కువ జీతం ఇచ్చారు. అంతేకాకుండా 18 గంటల పాటు(working hours) పని చేసేలా చేశారు. ఓ మహిళకు కేవలం 7 స్విస్ ఫ్రాంక్‌లు (అంటే రూ. 654) ఇచ్చారని, హిందుజా ఫ్యామిలీ వారి శునకాల కోసం చేసే ఖర్చు కంటే చాలా తక్కువ డబ్బు వారికి ఇచ్చారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. హిందూజా ఫ్యామిలీ వారి పెంపుడు శునకం(dog) కోసం ఏటా 8584 స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 8 లక్షలకు పైగా) ఖర్చు చేస్తుందని సేవకుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
భారతదేశ మూలాలను కలిగి ఉన్న హిందూజా కుటుంబం 1980ల చివరలో స్విట్జర్లాండ్‌లో స్థిరపడింది. హిందూజా గ్రూప్‌కు ఐటీ, మీడియా, విద్యుత్, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో వ్యాపారం ఉంది. ఫోర్బ్స్ ప్రకారం హిందూజా కుటుంబం మొత్తం సంపద దాదాపు 20 బిలియన్ డాలర్లు.
ఇది కూడా చదవండి:
యులిప్స్ ప్రచారంపై జర జాగ్రత్త
రూ.35 కోట్ల బుగాటీ టూర్‌బిల్లాన్
Read Latest International News and Telugu News