Share News

T20 World Cup 2024: నేడు ఇండియా vs బంగ్లాదేశ్ మ్యాచ్.. పిచ్, విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Jun 22 , 2024 | 08:11 AM

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌(T20 World Cup 2024)లో నేడు 47వ మ్యాచ్ టీమిండియా, బంగ్లాదేశ్(India vs Bangladesh) జట్ల మధ్య జరగనుంది. గ్రూప్ ఏలోని సూపర్ 8లో ఇది రెండో మ్యాచ్ కాగా మొదటి ఆటలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించింది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న మ్యాచులో ఏ జట్టు గెలుస్తుంది, గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

T20 World Cup 2024: నేడు ఇండియా vs బంగ్లాదేశ్ మ్యాచ్.. పిచ్, విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే..
India vs Bangladesh 47th match Pitch

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌(T20 World Cup 2024)లో నేడు 47వ మ్యాచ్ టీమిండియా, బంగ్లాదేశ్(India vs Bangladesh) జట్ల మధ్య జరగనుంది. గ్రూప్ ఏలోని సూపర్ 8లో ఇది రెండో మ్యాచ్ కాగా మొదటి ఆటలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించింది. కరేబియన్ గడ్డపై ఈ మ్యాచ్ జరగడంతో ఇప్పుడు టీమ్ ఇండియా ఫేవరెట్ జట్టుగా మారింది. మరోవైపు ఈ మ్యాచులో బంగ్లాదేశ్(Bangladesh) కూడా ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తోంది. టీమిండియా జట్టును కట్టడి చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్‌(team india) సెమీఫైనల్‌కు మరింత బలం చేకూరుతుంది.


పిచ్ ఎలా..

వెస్టిండీస్‌ ఆంటిగ్వా(Antigua)లోని సర్ వివియన్ రిచర్డ్ స్టేడియంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు జరగనుంది. భారత్, బంగ్లాదేశ్‌ల కంటే ముందు ఈ పిచ్‌(pitch)పైనే దక్షిణాఫ్రికా, అమెరికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. అమెరికా జట్టు ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఈ పిచ్‌పై శుక్రవారం ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ల మధ్య మ్యాచ్‌ జరగనుండగా, ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పెద్దగా కష్టంగా అనిపించదు. ఇక్కడి పిచ్ బ్యాట్స్‌మెన్‌కు సహాయపడుతుంది. కానీ కాలక్రమేణా ఈ పిచ్ కొద్దిగా నెమ్మదిగా మారుతుంది. ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ రెండో ఇన్నింగ్స్‌లో ఛేజింగ్ కష్టం అవుతుందని నిపుణులు పేర్కొన్నారు.


వాతావరణం ఎలా ?

ఈ మ్యాచ్ ఆంటిగ్వా(Antigua) కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. అక్యూ వెదర్(weather) నివేదిక ప్రకారం ఈ సమయంలో ఉష్ణోగ్రత 30 డిగ్రీల వరకు ఉంటుంది. ఆ సమయంలో వర్షం కురిసే అవకాశం 18 నుంచి 24 శాతంగా అంచనా వేయబడింది. అంటే మ్యాచ్‌కు అంతరాయం కలగవచ్చు కానీ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశం లేదు.

వర్షం కారణంగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ పూర్తి కాకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు. ఈ మ్యాచులో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే టీమిండియాకు 88 శాతం అవకాశం ఉండగా, బంగ్లాదేశ్ జట్టుకు 12 శాతం ఛాన్స్ ఉంది.


ప్లేయింగ్ 11

భారత జట్టు(team india)లో ప్రాబబుల్ ప్లేయింగ్ 11లో రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ మరియు అక్షర్ పటేల్ ఉన్నారు.

బంగ్లాదేశ్(Bangladesh) జట్టు ప్రాబబుల్ ప్లేయింగ్ 11లో లిటన్ దాస్ (వికెట్ కీపర్), తంజీద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, తౌహీద్ హృదయ్, మహ్మదుల్లా, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, రిషాద్ హుస్సేన్, తంజీమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్ కలరు.


ఇవి కూడా చదవండి..

‘టాప్‌’ లేపాలి


Surya Kumar Yadav: కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్.. కోహ్లీ రికార్డు సమం..!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 22 , 2024 | 08:15 AM