-
-
Home » International » Pakistan Ships Docking at Chittagong: A Strategic Threat to India? Mouni
-
Bangladesh: పాక్ నుంచి బంగ్లాకు అనుమానాస్పద నౌక.... భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..!
ABN , First Publish Date - Dec 24 , 2024 | 04:08 PM
పొరుగుదేశం బంగ్లాలో తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టాక పరిస్థితులు తారుమారయ్యాయి. పాకిస్థాన్‌తో సత్సంబంధాలు ఏర్పరచుకుంటూ ముందుకెళ్తోంది ఆ దేశం. ఈ క్రమంలో యధేచ్చగా నౌకారవాణా సాగిస్తున్నాయి ఇరుదేశాలు. ఇటీవల ఓ అనుమానాస్పద నౌక పాక్ నుంచి బంగ్లాకు చేరటం భారత్‌ను తీవ్రంగా కలవరపెడుతోంది..
Live News & Update
-
2024-12-24T16:08:31+05:30
ఓడలో ఏముందంటే..
బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ కంటైనర్ల ద్వారా ఏం పంపిస్తుందని తేల్చుకోలేకపోతున్నారు భారత రక్షణాధికారులు. చిట్టగాంగ్ పోర్ట్ అథారిటీ డేటా ప్రకారం, ఓడలో 1000 కంటే ఎక్కువ సింగిల్ కంటైనర్లు ఉన్నాయి. కంటైనర్లలో గుడ్లు, చక్కెర వంటివి సరఫరా చేస్తున్నామని చిట్టగాంగ్ అధికారులు చెబుతున్నా, ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులకు సహరికరించేందుకు రక్షణ పరికరాలు పంపుతున్నట్లు అనుమానిస్తున్నారు నిపుణులు. కాబట్టి పాకిస్థాన్ నుంచి బంగ్లా చేరే నౌకలపై ఓ కన్నేసి ఉంచకపోతే భవిష్యత్‌లో భారత్‌కు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.
-
2024-12-24T16:08:30+05:30
ఈ నేపథ్యంలోనే షేక్‌హసీనా ప్రభుత్వ హయాం వరకూ మూసుకుపోయిన నౌకామార్గాలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో నిత్యం పాకిస్థాన్ నుంచి బంగ్లాకు ఓడలు యదేచ్ఛగా రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఇటీవల ఓ అనుమాస్పద కంటైనర్ షిప్ పాక్ నుంచి నేరుగా బంగ్లాకు చేరడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ సారథి యూనస్ కైరోలో పాకిస్థాన్ ప్రధానిని కలిశాక చిట్టగాంగ్ చేరుకున్న రెండో కంటైనర్ షిప్ ఇది. గత 50 ఏళ్లలో పాక్ కంటైనర్లు బంగ్లాకు చేరుకోవడం ఇది రెండోసారి మాత్రమే. మొదటి కంటైనర్ షిప్ నవంబర్ మధ్యలో చేరుకుంది. బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడిగా యూనస్ బాధ్యతలు చేపట్టాకే ఈ రెండు ఘటనలు జరగడం విశేషం.
-
2024-12-24T16:08:29+05:30
బంగ్లాదేశ్: షేక్‌హసీనా ప్రభుత్వం కూలిపోక ముందు వరకూ ఇండియాకు నమ్మకమైన మిత్రదేశాల్లో ఒకటిగా ఉండేది బంగ్లాదేశ్. తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టాక పరిస్థితులు తారుమారయ్యాయి. వరసగా షేక్‌హసీనా హయంలో విధించిన ఆంక్షలు ఎత్తివేస్తోంది. దాయాది దేశం పాకిస్థాన్‌తో సత్సంబంధాలు ఏర్పరచుకునే దిశగా నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల మహమ్మద్ యూనస్ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కైరోలో ప్రత్యక్షంగా కలిశాక మరింత దగ్గరయ్యాయి ఇరు దేశాలు. పాక్ ప్రధానితో భేటీ తర్వాతే పలు విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది బంగ్లా ప్రభుత్వం.
-
2024-12-24T16:08:28+05:30
షేక్‌హసీనా ప్రభుత్వం కూలిపోక ముందు వరకూ ఇండియాకు నమ్మకమైన మిత్రదేశాల్లో ఒకటిగా ఉండేది బంగ్లాదేశ్. తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టాక పరిస్థితులు తారుమారయ్యాయి. పాకిస్థాన్‌తో సత్సంబంధాలు ఏర్పరచుకుంటూ ముందుకెళ్తోంది ఆ దేశం. ఈ క్రమంలో యధేచ్చగా నౌకారవాణా సాగిస్తున్నాయి ఇరుదేశాలు. ఇటీవల ఓ అనుమానాస్పద నౌక పాక్ నుంచి బంగ్లాకు చేరటం భారత్‌ను తీవ్రంగా కలవరపెడుతోంది.