Taiwan : భార్యపై అనుమానంతో ఇంట్లో సీక్రెట్ కెమెరాలు!
ABN , Publish Date - Aug 24 , 2024 | 03:53 AM
భార్య వివాహేతర సంబంధాన్ని బయటపెట్టేందుకు ఓ భర్త చేసిన పని.. చివరికి అతడినే దోషిని చేసింది. ఇంట్లో రహస్య కెమెరాలు అమర్చినందుకు అతడికి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది.
భర్తకు 3 నెలల జైలు.. తైవాన్‌లో ఘటన
తైవాన్, ఆగస్టు 23: భార్య వివాహేతర సంబంధాన్ని బయటపెట్టేందుకు ఓ భర్త చేసిన పని.. చివరికి అతడినే దోషిని చేసింది. ఇంట్లో రహస్య కెమెరాలు అమర్చినందుకు అతడికి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది.
తైవాన్‌కు చెందిన ఫాన్‌కుఉ భార్య, ఇద్దరు పిల్లలున్నారు. చాన్నాళ్లు సాఫీగానే సాగిన ఫాన్ సంసారంలో 2022లో గొడవలు మొదలయ్యాయి. భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో ఫాన్‌కు ఆమెపై అనుమానం కలిగింది.
దీంతో తన ఇంటిలోని హాల్, బెడ్రూంలో రహస్యంగా కెమెరాలు అమర్చాడు. 2 వారాల తర్వాత అతడి అనుమానమే నిజమని తేలింది. అతడి భార్య మరో వ్యక్తితో ఏకాంతంగా కలిసున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ఫాన్ ఆ వీడియోలు చూపి భార్యతో గొడవపడ్డాడు. విడాకులు కావాలంటూ కోర్టుకెక్కాడు.
అయితే, అతని భార్య.. భర్త తన అనుమతి లేకుండా ఇంట్లో రహస్య కెమెరాలు అమర్చి గోప్యతకు భంగం కలిగించాడని కేసు పెట్టింది. న్యాయమూర్తి ఫాన్‌నే తప్పుబట్టారు. ఇతరుల ప్రైవేటు కార్యకలపాలను చిత్రీకరించడం నేరమని పేర్కొంటూ ఫాన్‌కు 3 నెలల జైలు శిక్ష విధించారు.