Canada: కెనడాలో భారత విద్యార్థులకు ఆహారం కొరత?
ABN , Publish Date - Oct 31 , 2024 | 05:33 AM
కెనడాలో అంతర్జాతీయ విద్యార్థులకు ఉచిత ఆహార సదుపాయాన్ని నిరాకరించాలని గ్రేటర్ వాంకోవర్ ఫుడ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ, అక్టోబరు 30: కెనడాలో అంతర్జాతీయ విద్యార్థులకు ఉచిత ఆహార సదుపాయాన్ని నిరాకరించాలని గ్రేటర్ వాంకోవర్ ఫుడ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆహారం ధరలు, నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ బ్యాంకులపై ఆధారపడేవారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. కెనడాలో జీవన వ్యయం భారీగా పెరగడంతో అంతర్జాతీయ విద్యార్థులు ఎక్కువగా ఫుడ్ బ్యాంకులపైనే ఆధారపడుతున్నారు. ఈ ఏడాది మార్చిలో దాదాపు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫుడ్ బ్యాంక్‌లను ఆశ్రయించారు.