Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Jul 14 , 2024 | 11:16 AM

Telugu Latest News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మినిట్ టు మినిట్ తాజా వార్తలను ఇక సులభంగా తెలుసుకోవచ్చు. మీకోసమేు ప్రత్యేకంగా లైవ్ అప్‌డేట్స్ ప్లాట్‌ఫామ్.. సమస్త సమాచారం ఇక్కడే చూసేయండి.

Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-07-14T16:45:09+05:30

    ఎక్కడ చూసినా జగన్ విధ్వంసమే కనిపిస్తోంది: మంత్రి

    • జగన్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో విధ్వంసమే తప్ప ఏమీ లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

    • రాష్ట్రంలో ఎక్కడకి వెళ్ళినా ఏ ప్రాజెక్టుకు వెళ్ళినా జగన్ మోహన్ రెడ్డి విధ్వంసం కనపడుతుంది.

    • గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సోమశిల ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

    • రాష్ట్ర విభజన జరిగినప్పుడు జరిగిన నష్టం కన్నా గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువగా ఉంది.

    • సోమశిల ప్రాజెక్టుకు అప్రాన్ రిపేర్లు కూడా చేయకుండా గత ప్రభుత్వంలో పాలన చేశారు.

    • ప్రాజెక్టుకు సంబంధించి కనీసం రోప్ లా కు గ్రీసు పెట్టలేని వాళ్ళు పోలవరం డ్యాం కడతారా..?

    • రెండవ కృష్ణుడు ఇన్చార్జి మంత్రిగా కూడా ఈ జిల్లాలో ఉన్నాడు.

    • అయినా కూడా ఆయన ఈజిల్లాకు చేసింది సున్నా.

    • హై లెవల్ కెనాల్‌కి సంబంధించి టిడిపి ప్రభుత్వం చేసిన పనులు తప్ప వైసిపి ప్రభుత్వం చేసినది సున్నా అని చెప్పొచ్చు.

    • గత 5 సంవత్సరాల పాలనలో ఇరిగేషన్‌కు సంబంధించి 20 సంవత్సరాలు వెనక్కు నెట్టేశారు.

    • గతంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ ముందుకుపోయే బాధ్యత మా మీద ఉంది.

    • ఈ జిల్లాలో గత వైసిపి పాలనలో పనులు చేయకుండా బిల్లులు చేసుకున్నట్టు ఫిర్యాదులు అందాయి.

    • యుద్ధ ప్రాతిపదికన రాబోయే 60 రోజుల్లో పనులు ప్రారంభించి అప్రాన్ పనులు పూర్తి చేస్తాం.

  • 2024-07-14T16:33:10+05:30

    బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగింపు.. ఎప్పటి వరకంటే..

    భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను కొనసాగిస్తూ ఆ పార్టీ తీర్మానం చేసింది. డిసెంబర్ వరకే ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతారని.. ఆ తరువాత కొత్త అధ్యక్షుడిని నియమించడం జరుగుతుందని ప్రకటించింది బీజేపీ.

  • 2024-07-14T16:20:25+05:30

    తిరుమల: క్యూ లైన్ వద్ద భక్తులు ఆందోళన..

    Tirumala.jpg

    • తిరుమలలో భక్తులు ఆందోళనకు దిగారు.

    • గంటల తరబడి క్యూ లైన్లలో వేచి వున్నా టీటీడీ పట్టించుకోవడం లేదంటూ భక్తులు ఆగ్రహం.

    • క్యూ లైన్ల నుంచి బయటకు వచ్చి ఆందోళన చేసేందుకు యత్నించిన భక్తులు.

    • భక్తులకు సర్ది చెప్పి అన్న ప్రసాదాలను పంపిణీ చేసి తిరిగి క్యూ లైన్లలోకి పంపించిన భద్రతా సిబ్బంది.

  • 2024-07-14T16:18:17+05:30

    అది వైసీపీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం: ఎమ్మెల్యే

    • భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వైసీపీ ప్రభుత్వం అరాచకాలపై ఫైర్ అయ్యారు.

    • రాష్ట్రాన్ని గత వైసీపీ ప్రభుత్వం ఏ పరిస్థితికి తీసుకు వచ్చింది అంటే ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీని కూడా తాకట్టు పెట్టారు.

    • అది వైసీపీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం.

    • సంక్షేమం ఏదో చేశామని చెప్పుకుంటున్నారు.

    • ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ గతంలో చంద్రబాబు చేసినవే.

    • జగన్మోహన్ రెడ్డి కొత్తగా చేసింది ఏమీ లేదు.

    • చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.

    • పేరుపాలెం బీచ్ నుంచి తాడేపల్లిగూడెం వరకు ఫోర్ లైన్స్ వెయ్యటానికి ఆలోచన చేస్తున్నాం.

    • మేము ఎమ్మెల్యేలుగా వచ్చింది మీ మీద పెత్తనం చేయడానికి కాదు.. మీకు సేవ చెయ్యడానికే.

  • 2024-07-14T16:05:15+05:30

    రత్న భాండాగారం సమీపంలో ఎస్పీకి అస్వస్థత

    ratna.jpg

    • రత్న భాండాగారం లోపల శుభ్రం చేసిన సిబ్బంది

    • రత్న భాండాగారం సమీపంలో అస్వస్థతకు గురైన ఎస్పీ

    • ఎస్పీ పినాక్ మిశ్రాకు వైద్యుల చికిత్స

    • 46 ఏళ్ల తర్వాత భాండాగారం గది తెరిచిన అధికారులు

    • జస్టిస్ బిశ్వనాథ్‌ రథ్‌ కమిటీ సిఫార్సులతో తెరిచిన అధికారులు

    • నిధిని తరలించేందుకు చెక్క పెట్టెలు సిద్ధం

    • 1978లో చివరిసారిగా భాండాగారం తెరిచిన అధికారులు

  • 2024-07-14T15:03:21+05:30

    విజయవాడ దుర్గమ్మకు హైదరాబాద్‌ నుంచి బంగారు బోనం

    • విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారికి హైదరాబాద్ భాగ్యనగర్ మహంకాళి అమ్మవారి ఉమ్మడి దేవాలయాల కమిటీ తరపున బంగారు బోనం సమర్పణ.

    • మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఛైర్మన్ రాకేష్ తివారి ఆధ్వర్యంలో బోనం సమర్పణ.

    • ప్రతి ఏడాది అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ అంటున జోగిని విశా క్రాంతి.

    • జమ్మిదొడ్డిలోని బ్రాహ్మణ వీధి వద్ద నుండి భారీ ఊరేగింపుతో బయలుదేరిన బంగారు బోనం.

    • 1000 మందిల కళాకారులతో, మేళ తాళాల నడుమ, మంగళ వాయిద్యాలతో, బేతాళ వేషాలతో భారీ ఊరేగింపు.

    • జమ్మిదొడ్డి నుండి ఇంద్రకీలాద్రి వరకు కాలి నడకన అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్న జోగిని విశా క్రాంతి.

  • 2024-07-14T15:00:39+05:30

    సోమశిల జలాశయ అభివృద్ధి పనులపై సమీక్ష

    • నెల్లూరు: సోమశిల జలాశయ అతిథి గృహంలో ఇంజనీరింగ్ అధికారులతో సోమశిల జలాశయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి.

    • ఆనం సంజీవరెడ్డి హై లెవెల్ కెనాల్‌ను పరిశీలించిన మంత్రులు, ఎంపీ వేమిరెడ్డి.

    • సోమశిల జలాశయ ఆఫ్రాన్‌ను పరిశీలించిన మంత్రులు, ఎంపీ.

    • సోమశిల జలాశయ స్థితిగతులను, పెండింగ్ పనులను మంత్రులకు వివరించిన అధికారులు.

    • సోమేశ్వరాలయాన్ని సందర్శించిన ప్రజాప్రతినిధులు.

  • 2024-07-14T14:25:51+05:30

    ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షకు సిద్ధం: ఏనుగుల రాకేష్ రెడ్డి

    Rakesh-Reddy.jpg

    • నిరుద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి

    • మీరు ఏ పరీక్ష రాశారని నిరుద్యోగుల గురించి మాట్లాడారు.

    • నీట్ గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ నీట్ పరీక్ష రాశారా?

    • నిరుద్యోగులు తిన్నది అరగక దీక్షలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు.

    • నిరుద్యోగులకు మద్దతుగా బిఆర్ఎస్ కచ్చితంగా ఉంటుంది.

    • ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు కవాతు చేస్తున్నారు.

    • బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కొట్లాడే బాధ్యతను ఇచ్చారు

    • కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల కోసం మాట్లాడితే ఉద్యమం.

    • ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడితే కుట్రనా..?

    • డీఎస్సీని వాయిదా వేయాలని కోరితే వాళ్ళు అజ్ఞానులు అవుతారా..?

    • నిరుద్యోగులు ఢీల్లి జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్ధంగా వున్నారు.

  • 2024-07-14T14:23:10+05:30

    Odisha: తెరుచుకున్న పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం

    పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం 46 ఏళ్ల తరువాత మళ్లీ తెరుచుకుంది. భారీ బందోబస్తు నడుమ ఆదివారం నాడు రత్న భాండాగారాన్ని ఓపెన్ చేశారు ఆలయ అధికారులు. ఇందుకు సంబంధించిన విజువల్స్‌ని కింద చూడొచ్చు.

  • 2024-07-14T14:18:36+05:30

    క్యాన్సర్ భారిన పడిన మాజీ క్రికెటర్.. 1 కోటి ఆర్థిక సాయం..

    anshuman-gaekwad.jpgక్యాన్సర్ భారిన పడిన భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్‌కు బీసీసీఐ అండగా నిలిచింది. ఆయనకు రూ. 1 కోటి సాయం ప్రకటించింది. విషయం తెలిసిన వెంటనే బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు. రూ. 1 కోటి వెంటనే అన్షుమన్ గైక్వాడ్‌కు అందజేయాలని సూచించారు. దీంతో బీసీసీఐ అపెక్స్ ప్యానెల్ ఆయన కుటుంబాన్ని కలిసి ఆర్థిక సాయాన్ని అందించింది.

  • 2024-07-14T14:14:48+05:30

    కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న డీజీపీ

    DGP-Tirumala-Rao.jpg

    • చిత్తూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నా రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమలరావు.

    • రాష్ట్రంలో ఎవరైనా దాడులకు పడితే ఏ పార్టీ అయినా సరే తప్పులు చేసిన వారిని వదిలిపెట్టి ప్రసక్తే లేదు.

    • రాష్ట్ర ప్రజలు అనుకున్నది నెరవేరాలి.. ఎలాంటి ఆటంకాలు కలగకుండా విజ్ఞాలు తొలగిపోవాలని కాణిపాకం వినాయక స్వామిని పూజించడం జరిగింది.

    • తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి నేర పరిశోధన, శాంతి భద్రతలు, ఆలయాలకు భద్రత, ప్రజలకు భద్రత కల్పించే విషయంలో చర్యలు తీసుకునేందుకు ఎస్పీలతో సమీక్షించడం జరిగింది.

    • దిశా చట్టం ఇంకా పార్లమెంట్‌లో రూపకల్పన దాల్చలేదు. కావున రాష్ట్రంలో కొత్తగా నామకరణం చేసి చట్టాన్ని కొనసాగిస్తాం.

    • రాష్ట్రంలో ఎర్రచందనం, గంజాయి మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ పోర్స్ ఎల్లవేళలా పనిచేస్తుంది.

  • 2024-07-14T14:10:15+05:30

    దానం నాగేందర్‌పై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు..

    Padi-Kaushik-reddy.jpg

    • కేటీఆర్‌పై ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నా.

    • దానం నాగేందర్ స్థాయి మర్చి మాట్లాడుతున్నారు.

    • ఇది మంచి పద్ధతి కాదు.

    • 2018 జూన్ 22నాడు బీఆర్ఎస్‌లో చేరినప్పుడు మీరు చెప్పిన మాటలు ఏంటీ?

    • కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది అని బీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్ దయ వల్ల రెండు సార్లు ఎంఎల్ఏ‌గా గెలిచిన వ్యక్తి నువ్వు.

    • దానం నాగేందర్ నీకు సిగ్గు శరం లజ్జ ఉందా?

    • బీడీలు అమ్ముకునే వ్యక్తి దానం నాగేందర్‌కు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి?

    • నీ ఇంటి చుట్టూ, హైదరాబాద్‌లో చేసిన కబ్జాలు అన్ని మా దృష్టికి వచ్చాయి.

    • అన్ని బయటికి తీస్తాం.

    • పార్టీ మారిన నేతలందరూ రాజీనామా చేసి మళ్ళీ గెలవండి.

    • అమ్ముడు పోయిన వ్యక్తి నువ్వు నీతులు చెప్తున్నావా దానం నాగేందర్.

  • 2024-07-14T14:05:31+05:30

    గంజాయి మత్తులో వ్యక్తి హల్ చల్..

    Ganja-Victim.jpg

    • హైదరాబాద్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో వ్యక్తి హల్ చల్.

    • అంబేద్కర్ నగర్, రాయన్న కాలనీలో గంజాయి మత్తులో రాంబాబు అనే వ్యక్తిని శివ ఇనుపరాడుతో దాడి.

    • చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు.. రాంబాబు పరిస్థితి విషమం.

    • కెమెరాలో రికార్డు అయిన దాడి చేసిన దృశ్యాలు.

    • అంబేద్కర్ నగర్ చౌరస్తా వద్ద గంజాయ్ సేవించే వారిని అరెస్టు చేయాలంటూ ధర్నా.

    • ఘటన స్థలనికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • 2024-07-14T14:02:30+05:30

    పూరీలో ప్రారంభమైన రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ..

    పూరి, ఒడిశా: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ని అనుసరించి శ్రీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం తెరిచే కార్యక్రమం ప్రారంభమైంది. పూరి ఎస్పీ పినాక్ మిశ్రా మాట్లాడుతూ.. ‘అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత భద్రతా ఏర్పాట్లు చేశాము. ముఖ్యమైన అన్ని ప్రదేశాలలో క్యూఆర్‌టిని మోహరించారు. ఆలయంలో నిర్వహించే పూజలు యథావిధిగా జరుగుతాయి. ఈరోజు విధులు నిర్వహిస్తున్న, గుర్తించిన సేవకులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తారు.’ అని చెప్పారు.

  • 2024-07-14T13:59:06+05:30

    సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్..

    ktr-twitter.jpg

    • నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా ముఖ్యమంత్రి తన స్థాయికి దిగజారి, అత్యంత దివాళకోరుతనంతో మాట్లాడారు.

    • నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న మోతీలాల్ ని అవమానించేలా మాట్లాడారు

    • అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి అదే కోచింగ్ సెంటర్లను, వారిని అవమానించేలా మాట్లాడుతున్నారు.

    • అందుకే ఈరోజు తెలంగాణ యువత భగ్గుమంటుంది.

    • మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిన అదే యువత ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది.

    • 8 నెలల్లో ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ ఇయ్యని మీరు, మిగిలిన నాలుగు నెలల్లో ఏవిధంగా రెండు లక్షల నోటిఫికేషన్లు ఇస్తారో చెప్పాలి.

    • మిమ్మల్ని వదిలిపెట్టము.. క్షేత్రంలో నిలదీస్తాం విద్యార్థులతో నిరుద్యోగులతో కలిసి కొట్లాడుతాం.

    • కండకావరంతో మాట్లాడడం రేవంత్ రెడ్డి ఆపాలి.

    • రేవంత్ రెడ్డి నిరుద్యోగులు విద్యార్థులపై చేసిన తన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలి.

    • రాజకీయ నిరుద్యోగులుగా యువతను రెచ్చగొట్టిన రాజకీయ శక్తులు ముమ్మాటికే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలే.

    • గతంలో ఏ పరీక్ష రాస్తుండని రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో దీక్ష చేసిండో చెప్పాలి.

    • అశోక్ నగర్‌లోని విద్యార్థులను సన్నాసులు అంటున్న రేవంత్ రెడ్డి.. మీరు సన్నాసులా... రాహుల్ గాంధీ సన్నాసులు అనే విషయం చెప్పాలి.

    • రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాల పైన, నోటిఫికేషన్ల పైన, జాబ్ క్యాలెండర్ పైన శ్వేత పత్రం ప్రకటించాలి.

    • నిరుద్యోగులు అడుగుతున్న డిమాండ్లను వెంటనే సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి.

  • 2024-07-14T13:50:40+05:30

    నన్ను చంపేందుకు ప్లాన్ చేశారు.

    tdp.jpg

    • కర్నూలు: నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ సంచలన ఆరోపణలు.

    • పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, లోటర్ భాష, మరికొందరితో కలిసి నన్ను చంపేందుకు ప్లాన్ చేశారు.

    • ఆ విషయాన్ని లోటర్ భాష నాకు చెప్పడంతో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాను.

    • నా హత్యకు కుట్ర పన్నిన వారిపై త్వరలో వారిపై చర్యలు తీసుకోవాలి.

  • 2024-07-14T13:48:31+05:30

    ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

    ఢిల్లీ: వాతావరణ పరిస్థితులపై IMD శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు నుంచి రుతుపవనాలు దిశ మార్చుకుంటున్నాయి. కోస్టల్ కర్ణాటక, కేరళ, కొంకణ్ గోవాలలో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నాం. అక్కడ 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. రాబోయే రోజుల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో తేలికపాటి వర్షం కురుస్తుంది.’ అని చెప్పారు.

  • 2024-07-14T13:44:53+05:30

    మెరుగైన ఉపాధి కోసం వలసలు సాగుతూనే ఉంటాయి: కేటీఆర్

    • హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో మేక బతుకు పుస్తకావిష్కరణ కార్యక్రమం

    • హాజరైన బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

    • పుస్తకాలు గతంలో బాగా చదువే వాణ్ణి..

    • వలసలు మానవ జీవితంలో నిజం.

    • ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాల మధ్య వలసలు ఉంటాయి.

    • మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ప్రయాణాలు, వలసలు సాగుతూనే ఉంటాయి.

    • హైదరాబాద్‌లో అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వచ్చి పనులు చేసుకుంటున్నారు.

    • పాలమూరు జిల్లాకు వలసల జిల్లా అనే పేరు పోయింది.

    • కరోనా టైంలో వలస కార్మికులను ఆపడానికి యెన్నో ప్రయత్నాలు చేశాను.

    • కరోనా సమయంలో కొంత సమయం దొరికింది.

    • అప్పుడు కార్మికులతో పెండింగ్ పనులు పూర్తి చేయాలని ప్రయత్నాలు చేశాం.

    • గల్ఫ్‌లో ఉండే వాళ్ళు సంపాదించేది, ఇక్కడ హైదరాబాద్‌లో సంపాదించేది ఒక్కటే.

    • ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నో చేశాం.

    • గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేశాం.

  • 2024-07-14T13:11:50+05:30

    అంబానీ కుటుంబంతో ప్రధాని మోదీ..

    అనంత్ అంబానీ-రాధిక వివాహ వేడుకకు హాజరుకాలేకపోయిన ప్రధాని మోదీ.. ఇవాళ ముఖేష్ అంబానీ ఇంటికి వెళ్లారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. వారితో కలిసి ఫోటో దిగారు.

  • 2024-07-14T13:07:53+05:30

    లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్.

    • ఢిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్.

    • చీఫ్ విప్‌గా కొడిక్కినల్ సురేష్.

    • విప్‌గా మాణిక్కం ఠాగూర్, జావేద్.

    • లోక్ సభ స్పీకర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ.

  • 2024-07-14T13:04:56+05:30

    తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చెయ్యాలి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

    • తిరుమల: టీటీడీలో ఇంకా పాత ప్రభుత్వ ఛాయలు కనపడుతున్నాయి.

    • గత ఐదేళల్లో తిరుమల్ని అవినీతి మయంగా మార్చారు.

    • తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చెయ్యాలి.

    • తిరుమల్లో భక్తులకు పంపిణీ చేసే అన్నప్రసాదాలు బాగోలేదు.

    • అన్నప్రసాదాల నాణ్యతని వెంటనే పెంచాలి.

    • ప్రజాప్రతినిధుల మాట విన్నే పరిస్థితి కూడా టీటీడీ అధికారుల్లో కనపడడం లేదు.

    • అధికారులు టీటీడీలో ప్రక్షాళనని ప్రారంభించి భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి.

    • ఐదు సంవత్సరాల అంధకారం తరువాత నేడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

    • ప్రజల ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది.

  • 2024-07-14T12:53:01+05:30

    రమణ దీక్షితులు సంచలన ట్వీట్..

    • తిరుమల: తమకు న్యాయం చెయ్యాలంటూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు.

    • గత ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులు నుంచి నేడు ఎంతో మందికి విముక్తి లభించింది.

    • అక్రమ కేసుల కారణంగా తిరుమల ఆలయంలో పని చేసిన ఇద్దరు ప్రధాన అర్చకులు.. గత ఐదేళ్లు నుంచి నేటి వరకు కోర్టులు చుట్టూ తిరుగుతున్నాం.

    • సీఎం గారు మాపై దయ చూపి తిరిగి స్వామి వారీ కైంకర్యాలు చేసుకున్నే అవకాశం కల్పించాలి.

    • మాకు స్వామి వారీ సేవ చేసుకున్నే భాగ్యం కల్పిస్తే సీఎంకి రుణపడి వుంటాం.

    • ఎక్స్ లో సీఎంని ట్యాగ్ చేసిన రమణదీక్షితులు.

  • 2024-07-14T12:51:57+05:30

    విజయనగరం: పసిపాప అత్యాచార ఘటనపై హోమ్ మంత్రి దిగ్భ్రాంతి.

    • 6 నెలల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటనపై హోమ్ మంత్రి వంగలపూడి అనిత ఆరా.

    • ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మిగజపతి, మంత్రి కొండపల్లి తో ఫోన్లో మాట్లాడిన హోం మంత్రి.

    • నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని హోం మంత్రి పోలీసులకు ఆదేశం.

  • 2024-07-14T12:40:06+05:30

    కఠిన చర్యలు తీసుకుంటాం..!

    • విజయనగరం అత్యాచార ఘటనపై..

    • మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితీ గజపతిరాజ్ స్పందన

    • అత్యాచారానికి గురైన పసి పాప బంధువులను ఓదార్చిన నేతలు

    • హేయమైన ఘటన జరగటం అత్యంత దురదృష్టకరం

    • మంచితనానికి మారు పేరైన విజయనగరం జిల్లాలో ఈ ఘటన జరగటం బాధాకరం

    • పాప ఆరోగ్యం నిలకడగా ఉంది..

    • నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం : మంత్రి కొండపల్లి

    minister-kondapalli-Sriniva.jpg

  • 2024-07-14T12:30:33+05:30

    ఏపీలో ఆరునెలల చిన్నారిపై అత్యాచారం!

    • విజయనగరం జిల్లా రామభద్రాపురంలో దారుణం

    • ఆరునెలల చిన్నారిపై అత్యాచారం

    • అత్యాచారానికి పాల్పడిన వరుసకు తాత అయ్యే వ్యక్తి

    • ఊయలలో ఉండగానే అఘాయిత్యం

    • చిన్నారిని ఊయలలో వేసి కిరాణా దుకాణానికి వెళ్లిన తల్లి

    • ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో వచ్చిన ఎరకన్న దొర.. చిన్నారిపై అత్యాచారం

    • గట్టిగా ఏడ్వడంతో విషయం తల్లికి చెప్పిన చిన్నారి అక్క

    • నిందితుడిని పట్టుకునేందుకు యత్నించిన తల్లి, గ్రామస్థులు

    • పరారీలో బోయిన ఎరకన్న దొర

    • ప్రాథమిక చికిత్స నిమిత్తం చిన్నారిని బాడంగి ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

    • చిన్నారి ఆరోగ్యంగానే ఉందని చెప్పిన వైద్యులు

    • గ్రామానికి వచ్చి విచారణ చేపట్టిన డీఎస్పీ శ్రీనివాసరావు

    • ఫోక్సో చట్టం కింద కేసు నమోదు.. గంటల వ్యవధిలోనే నిందితుడు అరెస్ట్

    KID.jpg

  • 2024-07-14T11:32:28+05:30

    విజయసాయిపై బుద్ధా వెంకన్న సంచలన ట్వీట్..

    అమరావతి: విజయసాయి రెడ్డిపై.. టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్ చేశారు.

    సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో విజయసాయిపై షాకింగ్ సెటైర్లు వేశారు.

    ‘ సై (రూమ్ కి)రా.. సాయి రెడ్డి!

    ముసలోడే కానీ మహానుభావుడు🙏.....!

    అధికారం అంటే అధికారులను వాడుకోవడమేగా... వీసా తాత?’

    అని పోస్ట్ చేశారు.

  • 2024-07-14T11:26:31+05:30

    విజయవాడ: డాక్టర్లపై దాడి.. కేసు నమోదు..

    • గవర్నమెంట్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్లపై దాడిపై కేసు నమోదు.

    • రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న డాక్టర్లు.

    • ఈరోజు డాక్టర్లపై దాడి చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన మాచవరం పోలీసులు.

    • గోపి, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, హరికృష్ణలను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన మాచవరం సీఐ గుణరాం.

  • 2024-07-14T11:25:10+05:30

    గుడివాడ: వైకాపా నేత బంకులో కల్తీ పెట్రోల్..

    • గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని షా గులాబ్ చంద్ పెట్రోల్ బంకు వద్ద వాహనదారుల ఆందోళన.

    • బంక్ లో పెట్రోల్ కోట్టించుకోగా.. పెట్రోల్ బదులు నీళ్లు వచ్చిన వైనం.

    • బంకు వద్ద ఆందోళన చేస్తున్న వాహనదారులు.

    • వారం రోజుల క్రితం కూడా ఇదే విధంగా పెట్రోల్ కొట్టించుకుంటే నీళ్లు వచ్చాయని ఆరోపిస్తున్న వాహనదారులు.

    • గత వైకాపా ప్రభుత్వంలో అనేకసార్లు ఇదేవిధంగా జరిగిన చర్యలు చేపట్టని అధికారులు.

    • కల్తీ పెట్రోల్ తో తమ వాహనాలు పాడవుతున్నాయని... బంక్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న వాహనదారులు.

  • 2024-07-14T11:21:39+05:30

    జగన్‌పై మాజీ మంత్రి యనమల సెటైర్లు..

    • ఏపీ అసెంబ్లీ చరిత్రలో జగన్ రెడ్డి పాలనలో సభా విధానాలు, కార్యక్రమాలను నిర్వీర్యం చేసి నవ్వులు పూయించారు.

    • ప్రధాన ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయకుండా ఒక్కరోజు కూడా మిగిలిపోయింది.

    • ప్రజా ప్రయోజనాల కోసం తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించారు.

    • పోలీసు బలగాలను క్రూరంగా ప్రయోగించారు.

    • 15వ అసెంబ్లీ సమావేశాల పని వివరాలను చూస్తే, ఐదేళ్ల వ్యవధిలో, ఈశాన్య రాష్ట్రాల కంటే 78 రోజుల సమావేశాలు (అంటే సంవత్సరానికి 15.6 రోజులు 365 రోజులు) తక్కువగా ఉన్నాయి.

    • ప్రతిపక్ష భాగస్వామ్యం లేకుండా 193 బిల్లులను ఆమోదించాయి.

    • కౌన్సిల్ 74 రోజులు కూర్చుంది. బిల్లులు 183 ఆమోదించారు.

    • అమరావతి రాజధానికి సంబంధించిన బిల్లులను తిరస్కరించడం ఐదేళ్ల కాలంలో కౌన్సిల్‌లో అరుదైన దృగ్విషయం.

    • సభ (అసెంబ్లీ) "సెషన్" అనేది ప్రారంభ సమావేశానికి, దాని ప్రోరోగ్‌కు మధ్య సమయం.

    • ఇప్పుడు అక్షరాలా చెప్పాలంటే AP అసెంబ్లీ దాని సభ్యుల ప్రమాణ స్వీకార ప్రక్రియ పూర్తయిన తర్వాత, రాజ్యాంగంలోని 174 ఆర్టికల్ ప్రకారం ఇంకా ప్రోరోగ్ చేయబడలేదు.

    • ఇక్కడ మనం ఆర్టికల్ 176(1) ప్రకారం, అసెంబ్లీకి ప్రతి సాధారణ ఎన్నికల తర్వాత, అటువంటి రాష్ట్ర గవర్నర్ ప్రతి సంవత్సరం మొదటి సెషన్, తరువాత మొదటి సెషన్‌లో ప్రసంగిస్తారు.

    • ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన సంగతి తెలిసిందే.

    • మా అసెంబ్లీ మొదటి సెషన్ సభ్యులు ప్రమాణ స్వీకారం కోసం ప్రారంభమైంది, పక్కనే ఉన్న సైన్ డై.

    • ఆర్టికల్ 174 ప్రకారం ప్రొరోగ్ చేయబడే వరకు సభ్యులను సమావేశపరచమని అసెంబ్లీ స్పీకర్ నోటిఫికేషన్ ద్వారా ఎప్పుడైనా సమావేశపరచవచ్చు.

    • గవర్నర్‌కు ప్రోరోగ్ చేసే అధికారం ఉంది. అందువల్ల AP అసెంబ్లీ ప్రస్తుతం సెషన్‌లో ఉంది.

    • ఈ సమయంలో కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ ద్వారా ఓట్స్-ఆన్-అకౌంట్ కోసం ఆర్డినెన్స్ జారీ చేయబడదు.

    • ప్రభుత్వానికి ఒక ఎంపిక ఉంది. ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలనుకుంటే ఆర్టికల్ 174 ప్రకారం ముందుగా గవర్నర్ సభను ప్రోరోగ్ చేయాల్సి ఉంటుంది.

    • అయితే మరో సమస్య ఏమిటంటే, సాధారణ ఎన్నికల తర్వాత మొదటి సెషన్ ఆర్టికల్ 176(1) ప్రకారం గవర్నర్ ప్రత్యేక ప్రసంగం లేకుండానే ముగిసినట్లు భావించడం. భారత రాజ్యాంగం అంటే రాజ్యాంగంలోని తప్పనిసరి నిబంధనకు విరుద్ధం.

    • గత ప్రభుత్వం ఆమోదించిన ఓట్ ఆన్ అకౌంట్ గడువు ఈ నెలాఖరుతో ముగిసే అవకాశం ఉంది.

    • ప్రస్తుత ప్రభుత్వానికి రెండు ఎంపికలు ఉన్నాయి, ముందుగా, పూర్తి బడ్జెట్ (వార్షిక ఆర్థిక నివేదిక) లేదా ఓట్-ఆన్-అకౌంటు 176 (1) కింద గవర్నర్ ప్రసంగించే ముందు అసెంబ్లీ ఆమోదించడానికి ముందు మరో 3 నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్‌ను తీసుకురావాలి.

    • ఆర్డినెన్స్ మార్గాన్ని నివారించడానికి. ఇది అనుకూలమైన మార్గం.

    • రెండవది, ఈ మొదటి సెషన్‌లో ఆర్టికల్ 176(1) కింద గవర్నర్ ప్రసంగాన్ని పూర్తి చేయాలి. ఓట్లు-ఆన్-అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేయడానికి ప్రభుత్వానికి సౌకర్యాన్ని కల్పించడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం గవర్నర్ వెంటనే సైన్ డైని వాయిదా వేయాలి, ప్రోరోగ్ చేయాలి.

    • కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి.

    • ప్రస్తుత ప్రభుత్వం ఈ చట్టపరమైన చిక్కును అధిగమించగలదని ఆశిస్తున్నాను.

  • 2024-07-14T11:10:47+05:30

    విజయవాడ: జూనియర్ డాక్టర్లు కీలక నిర్ణయం.. రేపటి నుంచి..

    • జూనియర్ డాక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.

    • రేపటి నుంచి సమ్మె బాట పట్టనున్న జూనియర్ డాక్టర్‌లు.

    • వైద్యులపై దాడులకు వ్యతిరేకంగా సమ్మెలోకి.

    • తమకు రక్షణ కల్పించాలని, ఆసుపత్రి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్.

    • విధుల్లో ఉన్న డాక్టర్‌లపై దాడులు చేసే వారికి కఠిన శిక్షలు ఉండేలా‌ చూడాలి.

    • వీటిపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మెలో‌ ఉండాలని జుడాల నిర్ణయం.

  • 2024-07-14T11:00:04+05:30

    ఆసుపత్రిలో మగ శిశువును ఎత్తుకెళ్లిన మహిళ..

    • మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశువును ఎత్తుకెళ్లిన మహిళ.

    • సకాలంలో స్పందించి బిడ్డని‌ కన్న తల్లికి అప్పగించిన పోలీసులు.

    • కృష్ణాజిల్లా శ్రీకాకుళానికి చెందిన స్వరూప రాణి కాన్పు‌ కోసం మచిలీపట్నం ఆసుపత్రిలో చేరిక.

    • మూడు రోజుల‌క్రితం మగ శిశువుకు జన్మనిచ్చిన స్వరూప.

    • గైనిక్ వార్డులో రాత్రి 1:30 నిమిషాలకు నర్స్ వేషంలో మగ శిశువు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని మహిళ.

    • వెంటనే స్పందించిన రంగంలోకి దిగిన పోలీసులు.

    • మగ శిశువు తీసుకెళ్లిన మహిళను గుర్తించి సురక్షితంగా తల్లి వద్దకు చేర్చిన పోలీసులు.

    • కృష్ణా జిల్లా పోలీసులను అభినందిస్తున్న ప్రజలు.