-
-
Home » Mukhyaamshalu » Breaking News July 15 Today Latest Telugu News Live Updates, Siva
-
Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Jul 15 , 2024 | 11:17 AM
Telugu Latest News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మినిట్ టు మినిట్ తాజా వార్తలను ఇక సులభంగా తెలుసుకోవచ్చు. మీకోసమేు ప్రత్యేకంగా లైవ్ అప్‌డేట్స్ ప్లాట్‌ఫామ్.. సమస్త సమాచారం ఇక్కడే చూసేయండి.
Live News & Update
-
2024-07-15T21:24:57+05:30
వీళ్లు.. మాములు కేటుగాళ్లు కాదు..
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరులో పీఏం విశ్వ కర్మ యోజన పథకం ఆన్‌లైన్ పేరుతో దందా
కుట్టు మిషన్లు, వాషింగ్ మిషన్లు ఇస్తామని విజయవాడ ముఠా సభ్యుల టోకరా
రాజుపేట కేంద్రంగా 400 మంది డ్వాక్రా సభ్యులు నుంచి రూ.150 వసూలు చొప్పున వసూల్
మెప్మా అధికారి సాక్షిగా జరిగిన అవినీతి దందా
డీఆర్డీఏ అధికారుల ఆదేశాల మేరకు విజయవాడ భవానిపురం సీఎస్జీ ఆధార్ సెంటర్ నుంచి డేటా సేకరించేందుకు వచ్చామన్న కేటుగాళ్లు
బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, డ్వాక్రా సభ్యులు రావడంతో బయటపడ్డ దందా
నిలదీయడంతో తీసుకున్న నగదు ఇచ్చేసిన వైనం.
పోలీస్ స్టేషన్‌కు ముఠా సభ్యులు
-
2024-07-15T21:00:25+05:30
రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై ఆగ్రహం
వరంగల్: రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందన
రైతులను మోసం చేసే మార్గదర్శకాలు తీసుకొచ్చారు
రైతు రుణమాఫీ ఎగ్గొట్టేలా మార్గదర్శకాలు
రేవంత్ ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికావడం ఖాయం
రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదికగా తీసుకోవడం కరెక్ట్ కాదు.
కుటుంబం ప్రాతిపదికగా చూపడం సరికాదు
రేషన్ కార్డు లేని వారు రుణం తీసుకుంటే అర్హులు కారా..?
-
2024-07-15T20:47:20+05:30
సీఎం చంద్రబాబుతో జిందాల్ సమావేశం
అమరావతి: సీఎం చంద్రబాబుతో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ జిందాల్ భేటీ
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సంబంధించి చర్చ
రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయి
పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలతో రావాలని సీఎం చంద్రబాబు పిలుపు
ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని చంద్రబాబు భరోసా
-
2024-07-15T20:42:34+05:30
ప్రజల అభీష్టం మేరకే పార్టీ మార్పు..
హైదరాబాద్: ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరా:పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారా
పటాన్ చెరువు ప్రజలు మూడోసారి గెలిపించారు
ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నా
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ధన్యవాదాలు: మహిపాల్ రెడ్డి
-
2024-07-15T20:35:51+05:30
సీఎం చంద్రబాబుకు ఏపీటీఎఫ్ కృతజ్ఞతలు
అమరావతి: జీపీఎస్ గెజిట్ నిలిపివేత
సీఎం చంద్రబాబుకు ఏపీటీఎఫ్ కృతజ్ఞతలు
జూలై 16, 17 తేదీల్లో జిల్లాల్లో నిరసనలకు పిలుపు
గెజిట్ విడుదలతో వెనక్కి తగ్గిన ఏపీటీఎఫ్
నిరసన కార్యక్రమాలు వాయిదా
-
2024-07-15T20:22:10+05:30
కేంద్రమంత్రి చొరవ
గుంటూరు జిల్లా: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ జోక్యం
కేంద్రమంత్రి జోక్యంతో రెండు రైళ్లు పునరుద్దరణ
నూతన రైల్వే లైన్ నిర్మాణం, సిగ్నలింగ్ ఆధునికరణలో భాగంగా రైళ్లు రద్దు
గూడూరు-విజయవాడ, విజయవాడ-గూడూరు రైళ్ళను పునరుద్ధరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌కు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లేఖ.
సాయంత్రాని వరకు రైళ్ళను పునరుద్దరిస్తున్నామని రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రకటన
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ప్రయాణికులు.
-
2024-07-15T20:12:40+05:30
బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన అంశాలను తెలియజేయాలని ఆదేశాలు.
గత పంచాయతీ ఎన్నికల అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తీరును సీఎం రేవంత్‌కు వివరించిన అధికారులు
పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి వీ శేషాద్రి, సీఎం కార్యదర్శి డాక్టర్ జీ చంద్ర శేఖర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి డీ ఎస్ లోకేష్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
-
2024-07-15T20:02:53+05:30
బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఫైర్
ప్రకాశం: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఫైర్
కౌంటింగ్ రోజు కొడుకుతో సహా పారిపోయిన బాలినేని శ్రీనివాస రెడ్డి ఇప్పుడు ఒంగోలు వచ్చారు.
మానసికంగా బాలినేని శ్రీనివాస రెడ్డి బ్యాలెన్స్ తప్పారు.
బాలినేని, ఆయన కొడుకు చేసిన అరాచకాలను ప్రజలు గుర్తించారు.
నిజాయితీ పరుడిగా బాలినేని బిల్డప్ ఇస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మహిళా కార్యకర్తని బాలినేని దగ్గరుండి కొట్టించాడు.
ఎన్నికల సమయంలో బాలినేని కోడలు దాడులు చేసింది.
బాలినేని చేసిన పాపాలకి ప్రజలు బుద్ధి చెప్పారు.
బాలినేని వియ్యంకుడు విల్లాల నిర్మాణంలో అవినీతి జరిగింది.
అధికారులతో కమిటీ వేసి విల్లాల నిర్మాణంలో అవినీతి తేలుస్తాం.
విల్లాలు నిర్మాణం కోసం బలవంతంగా భూములు రాయించుకున్నాడు.
కార్యకర్తల్ని వదిలేసి బాలినేని ఆడుకోవడానికి హైదరాబాద్ వెళ్తున్నాడు.
బాలినేని పని అయిపోయిందని ఆరు నెలల క్రితమే చెప్పా.
ఎన్నికల సమయంలో బాలినేని టీడీపీలోకి వస్తానని అడిగితే... చంద్రబాబు తిరస్కరించారు.
రెండు రోజుల క్రితం జనసేనలో చేరేందుకు బాలినేని చర్చలు జరిపారు.
-
2024-07-15T19:54:10+05:30
కాంగ్రెస్‌లో చేరిన మహిపాల్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి
మహిపాల్ రెడ్డితోపాటు కాంగ్రెస్‌లో చేరిన గాలి అనిల్ ఇతర నేతలు
కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సభలో 75కి చేరిన కాంగ్రెస్ సభ్యుల సంఖ్యా బలం
-
2024-07-15T19:47:43+05:30
జీవో విడుదలపై సీఎం చంద్రబాబు ఆరా
అమరావతి: ఏపీజీపీఎఫ్‌పై గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు ఆరా
గత ప్రభుత్వ ప్రతిపాదనలతో అధికారులు ఉత్తర్వులు ఇవ్వడంపై అభ్యంతరం
ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజిట్ ఎలా వచ్చిందనే అంశంపై విచారణ చేయాలని అధికారులకు ఆదేశం
జీవో నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం
-
2024-07-15T18:34:10+05:30
ఓ శాంతి కథ..!!
శాంతి జన్మనిచ్చిన బాబుకు తండ్రి విజయసాయిరెడ్డి: మదన్
ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెంట్ అని శాంతి డ్రామా ఆడింది. ఆస్పత్రి పేరు చెప్పమంటే చెప్పలేదు
విజయసాయిరెడ్డికి పిల్లలు లేరు అని, కనిచ్చాను అని తనతో చెప్పింది.
సాయిరెడ్డి ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారని తనతో చెప్పింది.
ఐవీఎఫ్ డ్రామా అని తేలింది.
సాయిరెడ్డి- తనకు బాబు జన్మించాడని శాంతి తనతో చెప్పింది: శాంతి భర్త మదన్
-
2024-07-15T18:30:09+05:30
కోచింగ్ సెంటర్లలో కేసీఆర్ కుటుంబానికి వాటా
హైదరాబాద్: ఉద్యోగం కోసం పరీక్ష రాసే వారు ఎవరు వాయిదా వేయాలనారు.
పరీక్ష వాయిదా వేయడం వల్ల రూ.100 కోట్ల వ్యాపారం
కోచింగ్ సెంటర్లలో కేసీఆర్ కుటుంబానికి వాటా
అందుకే పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు
నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో హరీశ్ రావు, కవితకు 17 శాతం వాటా
గీత కార్మికులకు సేఫ్టీ కిట్లతో మేలు
-
2024-07-15T17:06:05+05:30
ఇప్పట్లో ఆగేలా లేదే..!
ఇవాళ ఉదయమే ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్.
కౌంటర్‌గా మీడియా మీట్ పెట్టిన శాంతి భర్త మదన్.
విజయసాయిరెడ్డిని నేను చాలా నమ్మాను.
సాయిరెడ్డి నా తండ్రి వయస్సు కావడం నాకు ఎలాంటి అనుమానం రాలేదు.
విల్లా కొనేందుకు ఆయన డబ్బులు ఇచ్చారు.
సాయిరెడ్డి పంపిన డబ్బు బ్యాగ్ ఫొటోలు ఇదిగో అంటూ బయటపెట్టిన మదన్.
2020 సెప్టెంబర్‌లో విజయసాయిరెడ్డి కోటి రూపాయిలు ఇచ్చారు.
నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను.
-
2024-07-15T16:55:39+05:30
నంద్యాల: నందికొట్కూరులో శివయ్య లీల
పాతాళ గంగమ్మ వెంట తరలివచ్చిన మహా శివుని ప్రతిరూపమైన శునకం.
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా శ్రీశైలం గంగాజలంతో వర్షాలు బాగా రావాలని నందికొట్కూరు శివాలయంలో జలాభిషేకం.
గంగాజలం కోసం పాదయాత్రగా శ్రీశైలం వెళ్ళిన వెళ్లిన భక్తుల వెంట శ్రీశైలం నుంచి నందికొట్కూరుకు తరలివచ్చిన ముక్కంటిశ్వరుని ప్రతిరూపం.
తమ వెంట నడుచుకుంటూ వచ్చి నందికొట్కూరు శివాలయంలో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో శునకాన్ని శివయ్య ప్రతిరూపంగా కొలుస్తున్న నందికొట్కూరు భక్తులు.
-
2024-07-15T16:53:50+05:30
చిన్నారులపై అఘాయిత్యాలు.. సీఎం సీరియస్ వార్నింగ్..
అమరావతి: చిన్నారుపై అఘాయిత్యాలపై సీఎం చంద్రబాబు గట్టి వార్నింగ్
రాష్ట్రంలో ఎవరైనా ఇంకా మత్తులో ఉంటే వారికి గట్టి హెచ్చరికలు చేస్తున్నాం.
ఇంకా నా ఓపికను యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పరీక్షిస్తున్నారు.
ఇలాంటి వారికి ఎలాంటి షాక్ ట్రీట్మెంట్ ఇస్తానో చూస్తారు.
-
2024-07-15T16:50:21+05:30
జగన్ నిర్వాకానికి ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది: కేంద్ర మంత్రి
విశాఖ: కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ కామెంట్స్..
జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వలన ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది.
వైసీపీ హయంలో భారీగా కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించారు.
ఆ నిధులను ఖర్చు చేయకపోగా, అసలు ఏ ఖాతాలోకి మళ్ళించారో కేంద్రానికి సమాచారం ఇవ్వలేదు.
ఆ వివరాలు అందిస్తే గాని మళ్ళీ నిధులు విడుదల చెయ్యని స్థితి వైసిపి తెచ్చింది.
అందుకే నిధులు ఇవ్వడానికి ఇబ్బందివస్తోందని కేంద్ర అధికారులు చెప్తున్నారు.
ఖచ్చితంగా ఏపీ అభివృద్ధిలో మా పాత్ర ఉంటుందని సీఎం చంద్రబాబుకు కేంద్రం హామీ ఇచ్చింది.
అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య మీద ఇప్పటికే సమీక్ష జరిపాను.
తరచూ విశాఖ వస్తూ ఉంటాను ఇక్కడ సమస్యలు పరిష్కార దిశగా అడుగులు వేస్తాను.
-
2024-07-15T16:29:44+05:30
గుంటూరు: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు నిందితులకు షాక్
టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసు నిందితులకు బెయిల్ నిరాకరణ.
జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రిమాండ్‌లో ఉన్న ఏడుగురు.
ఆరుగురుకి బెయిల్ నిరాకరించిన జిల్లా జడ్జి పార్దసారధి.
అనారోగ్య కారణాల రీత్యా గిరి రాంబాబుకు బెయిల్ మంజూరు.
-
2024-07-15T16:28:27+05:30
జగన్ పాలనలో పోలవరం విధ్వంసం: మంత్రి నిమ్మల
విజయవాడ: గత ప్రభుత్వ పాలనలో పోలవరం విధ్వంసం.
గత ఐదేళ్ల హయాంలో నీటిపారుదల శాఖ 20 ఏళ్లు వెనక్కి.
2019లో ప్రభుత్వం మారడమే పోలవరం ప్రాజెక్టుకు శాపం.
సాగు, తాగునీటి రంగాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.
పోలవరం పర్యటన, వరుస సమీక్షలు చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం.
నదుల అనుసంధానానికి, రైతాంగ సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎనలేని కృషి.
ఇకపై ఏటా పద్మభూషణ్ డా.కె.ఎల్.రావు, సర్ ఆర్థర్ కాటన్, మోక్షగుండం, శ్రీరామకృష్ణయ్య జయంతోత్సవాలు.
-
2024-07-15T16:26:38+05:30
కాళేశ్వరంపై కొనసాగుతున్న పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ విచారణ
కాళేశ్వరంపై కొనసాగుతున్న పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ విచారణ.
నేడు దాదాపు 10 మంది ఐఏఎస్ మాజీ ఐ ఏఎస్ లను విచారణకు పిలిచిన కమిషన్.
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వివిధ హోదాల్లో సెక్రెటరీగా పనిచేసిన అధికారులకు సమన్స్.
కీలక నిర్ణయాలు, అమలు చేసిన విధానం, కారణాలపై విచారణ.
ఈ రోజు కమిషన్ ముందు విచారణకు హాజరైన స్మితా సబర్వాల్, రజత్ కుమార్, వికాస్ రాజ్, రామకృష్ణా రావు, రాహుల్ బొజ్జా.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన ఎస్ కె జోషి.
కమిషన్ ముందు హాజరైన విద్యుత్ జెఎసి నేత కంచర్ల రఘు.
కమిషన్ విచారణకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పిన ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లు.
కమిషన్‌కి చెప్పిన వివరాలు అఫిడవిట్ రూపంలో వారం రోజుల్లో సమర్పించాలని కమిషన్ ఆదేశం.
బడ్జెట్ సెషన్స్ కారణంగా మరింత గడువు కోరిన ప్రస్తుత ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు.
ఆగస్టు 5 వరకు అఫిడవిట్ సమర్పించడానికి గడువిచ్చిన కమిషన్.
మరికాసేపట్లో కమిషన్ ముందుకు మాజీ సీఎస్ సోమేష్ కుమార్.
-
2024-07-15T16:23:14+05:30
కేసీఆర్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా..
Delhi: సుప్రీంకోర్టులో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కేసు విచారణను రేపు చేపడతామని సీజేఐ ప్రకటించారు.
దీంతో విచారణ రేపటికి వాయిదా పడింది.
-
2024-07-15T15:56:23+05:30
కోడికత్తి కేసులో సుప్రీం కీలక నిర్ణయం..
కోడికత్తి కేసులో సుప్రీం కీలక నిర్ణయం ప్రకటించింది.
కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ రద్దుకు సుప్రీం కోర్ట్ నిరాకరించింది.
ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని సుప్రీంని ఆశ్రయించిన NIA (జాతీయ దర్యాప్తు సంస్థ).
NIA అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు.
2019 ఎన్నికల ముందు, విశాఖపట్నం విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై కోడికత్తితో శ్రీనివాసరావు దాడి.
దాదాపు ఐదేళ్లపాటు జైల్లో మగ్గిన శ్రీనివాసరావు.
-
2024-07-15T15:50:45+05:30
తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్..
రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
తెలంగాణలో భూమి కలిగివున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2.00 లక్షల వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుంది.
ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరయిన లేక రెన్యూవల్ అయిన రుణాలకు మరియు 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంటరుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
ఈ పథకం కింద ప్రతి రైతుకుటుంబం, 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు.
09-12-2023 తేదీ నాటికి బకాయి వున్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి వుంటుంది.
రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌరసరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు (పిడిఎస్) డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది.
-
2024-07-15T15:36:12+05:30
సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత.
రాజేంద్రనగర్ డివిజన్‌లో ఐదుగురు నైజీరియన్లు అరెస్ట్.
నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఐదుగురు అరెస్ట్.
సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు అరెస్ట్.
పట్టుబడ్డ వారిలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌సింగ్ అరెస్ట్.
గతంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రకుల్ ప్రీత్ సింగ్.
నార్కోటిక్ బ్యూరో, SOT, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్.
200 గ్రాములకుపైగా కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.
పలువురు వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానం.
-
2024-07-15T15:34:21+05:30
అమరావతి: అంబానీ పెళ్లిలోనూ జనసేన విజయం గురించే: పవన్
జనసేన పోటీ చేసిన ప్రతి సీటును గెలిచింది.
ముంబైలో ఓ పెళ్లికి వెళ్తే.. అందరూ ఇదే విషయాన్ని అడిగారు.
జనసేన 100 శాతం స్ట్రయిక్ రేట్ అనేది దేశంలో ఓ కేస్ స్టడీ అయింది.
జనసేన విజయం గొప్ప విజయం.
జనసేన తిన్నన్ని దెబ్బలు మరెవరికైనా తగిలి ఉంటే వేరే వాళ్లు తట్టుకోలేకపోయేవారు.
ఓటమి తర్వాత మాజీ సీఎం సభలో ఉండలేక వెళ్లిపోయారు.
ఒక్క స్థానం లేకున్నా.. పట్టుదలతో పని చేశాం.
175లో 21 పెద్ద సంఖ్య కాకపోవచ్చు.. కానీ 164 రావడానికి జనసేన వెన్నెముకగా మారింది.
గతంలో రోడ్డు మీదకు రావాలంటే భయపడే పరిస్థితి.
వైసీపీ నేతలు పచ్చి బూతులు తిట్టేవారు.
గతంలో సాక్షాత్తూ ఓ ఎంపీనే సీఐడీ కార్యాలయంలో కొట్టారు.
అడ్డగోలు దోపిడీ గత ప్రభుత్వం హయాంలో జరిగింది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అందరికీ ధైర్యం ఇచ్చాం.
జనసేన పోటీ చేయని చోట్ల కూడా జనసేన మిత్రపక్ష అభ్యర్థులకు అండగా నిలిచారు.
జనసేన రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే పని చేశారు.
పొట్టి శ్రీరాములు, డొక్కా సీతమ్మ ప్రేరణతో పని చేస్తున్నాం.
పదవులతో సంబంధం లేకుండా ప్రజల కోసం పని చేస్తున్నాం.
ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాం.
కీలక శాఖలు తీసుకున్నాం.
సరైన సమయంలో అందరికీ బాధ్యతలు అప్పగిస్తా.
140 కోట్ల ప్రజల భారాన్ని మోసే ప్రధానికి సాయంగా నిలవాలి.
పోటీ చేయని నేతలూ పార్టీ కోసం పని చేశారు.
ఎంత సాధించినా ఒదిగి ఉండడం మంచిది.
ఎన్ని స్థానాలు మనకున్నాయని కాదు.. ఎంత బలంగా చేశామనేది ముఖ్యం.
తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించిన తర్వాత జరిగిన సభలో జోష్ తగ్గిందన్నారు.
కానీ ఫలితాలు అద్భుతంగా వచ్చాయి.
7 శాతం నుంచి 20 శాతం ఓటింగ్ పెరిగింది.
ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సందర్భంలో కూడా ఈ స్థాయిలో గెలుపు.. మెజార్టీలు రాలేదని అయ్యన్న అన్నారు.
వైసీపీ నేతలు మనకు శత్రువులు కాదు.. ప్రత్యర్థులు మాత్రమే.
కక్ష సాధింపులు వద్దు.. వ్యక్తిగత దూషణలు వద్దు.
అలాగని మనమేం వెనక్కు తగ్గినట్టు కాదు.
యుద్దం అనివార్యమే అయితే సిద్ధమే.
వైసీపీ చేసిన తప్పులు మనం చేయొద్దు.
ప్రజల కోసం పదవులు పక్కన పెట్టి పని చేయడానికి సిద్ధం.
వివిధ శాఖల రివ్యూలు చేస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది.
ఏ శాఖలోనూ డబ్బుల్లేవు.
ప్రజాధనంతో రిషికొండ ప్యాలెస్ కట్టారు.
ఫర్నిచర్ కోసం.. ఆడంబరాల కోసం పెద్దగా ఖర్చేం పెట్టొద్దని చెప్పాను.
ప్రతి రోజూ ఒక్క ప్రజా ప్రతినిధి అయినా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలి.
అధికారంలోకి వచ్చామని దుర్వినియోగం చేయొద్దు.
రౌడీయిజాన్ని నమ్మొద్దు.
దురుసుగా మాట్లాడ్డం.. బెదిరింపు ధోరణితో వెళ్లడం కరెక్ట్ కాదు.
ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే.. వారిని నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను.
మహిళా నేతలను ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో విమర్శించినా సీరియస్ యాక్షన్ ఉంటుంది.
సంస్కరించాల్సిన మనమే.. తప్పులు చేయకూడదు.
ఎప్పుడూ ఓటేయని వాళ్లు వచ్చి మరీ ఓటేశారు.
మన మీద ప్రజలు చాలా నమ్మకంతో ఉన్నారు.
నేను లేకపోతే పార్టీ ఏదో అయిపోతుందని.. రాజకీయం ఉండదని నేను అనుకోవడం లేదు.
జనసేన లేకుంటే ఏపీ రాజకీయాలు ఉండవనే భ్రమలోనూ లేను.
జనసేన నేతలు.. కార్యకర్తలు కూడా నా తరహాలోనే ఆలోచించాలని కోరుకుంటున్నాను.
విర్రవీగినందుకు వైసీపీ లాంటి పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
జనం కోసం నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను.
దెబ్బతినడానికి సిద్ధంగా ఉన్నాను కానీ.. ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో రాజీ పడను.
తమ బిడ్డలే తమ రాజకీయ వారసులనే విధంగా వ్యవహరించ వద్దు.
బిడ్డల కోసం ఏదైనా చేయొచ్చు కానీ.. రాజకీయ వారసులు కూడా వాళ్లేననే దిశగా ఆలోచన చేయొద్దు.
టీడీపీ, బీజేపీ నేతలను కించపరచొద్దు.
ఎవరైనా కామెంట్లు చేసినా దాన్ని వ్యక్తిగతంగానే చూడాలి.. పార్టీలకు ఆపాదించొద్దు.
-
2024-07-15T14:05:33+05:30
నామినేటెడ్ పోస్టుల విషయంలో పవన్ కీలక కామెంట్లు..
అమరావతి: కష్టపడిన వారిని మరిచిపోం.
హరిప్రసాద్‌కు గుర్తింపు లభించినట్టే అందరికీ గుర్తింపు ఉంటుంది.
నామినేటెడ్ పోస్టులు ఉంటాయి.
కానీ ప్రతి ఒక్కరూ ఛైర్మన్ పదవులు ఆశిస్తే కష్టం.
కొందరు టీటీడీ ఛైర్మన్ సహా ఇంకొన్ని ఛైర్మన్ల పదవులు అడగుతున్నారు.
ఒక్క టీటీడీ ఛైర్మన్ పదవి కోసమే 50 మంది అడిగారు. కానీ ఆ పదవి ఒక్కరికే ఇవ్వగలరు.
నా కుటుంబ సభ్యులెవరు టీటీడీ ఛైర్మన్ పదవి అడగలేదు.
కానీ నా కుటుంబ సభ్యులు టీటీడీ ఛైర్మన్ పదవి అడిగారని ప్రచారంలో పెట్టారు. అది కరెక్ట్ కాదు.
ఈ పదవుల కోసం చంద్రబాబుని ఎలా అడగాలో తెలియడం లేదు.
మీకిది చేశాం కాబట్టి.. మాకు ఈ పదవి ఇవ్వండి అని అడగలేం.
అందరికీ న్యాయం చేసేలా నా వంతు ప్రయత్నం చేస్తా.
కానీ ఎవరికైనా పదవి ఇవ్వలేకుంటే పెద్ద మనస్సుతో ఆలోచించండి.
ప్రధానిని నేనూ కెబినెట్ పదవి అడగగలను.. కానీ నేను అడగలేదు.
పదవుల కోసం మనం పని చేయడం లేదు.
ఎవరైనా ఏమైనా పదవి కావాలంటే అడగండి.
కమిటీలో చర్చించి పదవులిచ్చే ప్రయత్నం చేస్తాం.
పదవులు అడిగే వాళ్లు.. వాళ్ల అనుభవాలను.. వారి అర్హతలకు దగ్గరగా ఉండే పదవులు అడగండి.
లా అండ్ ఆర్డర్ విషయంలో అందరూ ఆలోచన చేయాలి.
నంద్యాల ఘటనల్లాంటివి జరగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.
మనోహర్ సివిల్ సప్లైస్ శాఖను సమర్ధవంతంగా పని చేస్తున్నారు.
అక్రమంగా రేషన్ బియ్యం కట్టడికి నాదెండ్ల చర్యలు తీసుకుంటున్నారు.
కెబినెట్‌లో రేషన్ అక్రమాలు సహా.. రాష్ట్రాభివృద్ధి కోసం చర్చిస్తాం.
-
2024-07-15T13:40:45+05:30
డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశంసలు..
పార్టీని అంచెలంచెలుగా పెరిగేలా చేయడంలో పవన్ చాలా ఓపికతో, వ్యూహంతో వ్యవహరించారు.
కూటమి ప్రభుత్వంలో ఉన్నాం.
మిత్రపక్షాలతో సమన్వయంతో వెళ్లాలి.
క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బంది.. మచ్చ రాకుండా అందరూ పని చేయాలి.
పదవులు మనకొచ్చాయి.. కానీ మన కోసం పని చేసిన జనసైనికులు, వీర మహిళలను మరువద్దు.
క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి.
పార్టీ మీద, ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలు పెడతారు.. తిప్పి కొట్టాలి.
కూటమి ప్రభుత్వం అమలు చేసే పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలి.
నిజాయితీగా పని చేయాలి.
గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో దోపిడీ చేసింది.
త్వరలో క్రియాశీల సభ్యత్వాన్ని ప్రారంభించనున్నాం.
గతంలో తక్కువ సంఖ్యలోనే క్రియాశీలక సభ్యులను చేర్పించాం.
ఇప్పటి వరకు సుమారు కార్యకర్తలకు ఆర్థిక సాయం కింద రూ. 18 కోట్లు అందించాం.
ప్రభుత్వంలో ప్రతి జనసైనికుడూ భాగస్వామే.
ప్రభుత్వం విడుదల చేసే శ్వేత పత్రాలపై అవగాహన పెంచుకోవాలి.. ప్రజలకు వివరించాలి.
మన ప్రభుత్వం.. పార్టీకి.. పవన్‌కు మంచి పేరు వచ్చే విధంగా పని చేయాలి.
పవన్ కళ్యాణ్ టీమ్ అంటే ఇదీ అని అందరూ గొప్పగా చెప్పుకునేలా పని చేయాలి.
గత ఎన్నికల్లో ప్రజలు సైలెంటుగా ఓటేశారు.
ఎన్నికల ముందు వరకు ఏ మాత్రం బయటపడని ప్రజలు.. ఎన్నికల్లో తామేంటో చూపించారు.
-
2024-07-15T13:36:54+05:30
ప్రాణాలు తీసిన ఫేక్ చాటింగ్..
పల్నాడు: సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో ప్రాణాలు తీసిన ఇంస్టాగ్రామ్ నకిలీ ఖాతా.
ఇంస్టాగ్రామ్‌లో యువతిలా చాటింగ్ చేసిన యువకుడు.
ఇంస్టాగ్రామ్‌లో నకిలీ అకౌంట్‌తో చాట్ చేసి రూ.30 వేలు నగదు కాజేసిన 19 ఏళ్ల దాసరి భాను ప్రకాష్.
తన తోటి స్నేహితుడి దగ్గర నగదు కాజేసిన యువకుడు.
కూలి పనుల కోసం తెనాలి నుండి రెంటపాళ్ల గ్రామానికి వచ్చిన భాను ప్రకాష్ కుటుంబం.
స్నేహితుడే సోషల్ మీడియాలో మాయ చేసి నగదు కాజేశాడని తెలిసి నిలదీసిన యువకుడు.
స్నేహితుడు నిలదీయడంతో మనస్తాపంతో పురుగు మందు తాగిన భాను ప్రకాష్.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.
కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు.
యువకుడు, అతని బంధువుల బెదిరింపుల వల్లే పురుగు మందు తాగాడన్న బాను ప్రకాష్ బంధువులు.
-
2024-07-15T13:23:51+05:30
జగన్ నిర్ణయంపై బాలినేని సీరియస్..!
ప్రకాశం: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవిపై బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందన.
ప్రకాశం జిల్లాలో నాయకులకు కొదవ లేదు.
నేతలకు జిల్లా గొడ్డు పోలేదు.
అధ్యక్ష పదవి జిల్లాకు సంబంధించిన వ్యక్తులకే ఇవ్వాలి.
చెవిరెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి విషయాన్ని వ్యతిరేకిస్తున్నా.
జిల్లా నేతలకే అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలి.
-
2024-07-15T13:20:14+05:30
మీడియాపై ఎంపీ విజయసాయిరెడ్డి చిందులు..
శాంతిని ఉద్దేశించి మదన్ మోహన్ రాసిన లేఖకు మీడియాలో ప్రాధాన్యత ఇవ్వడంపై అక్కసు.
వార్తలను ప్రసారం చేసిన సంస్థలను, ఆయా సంస్థల ప్రతినిధులను దిగజారి విమర్శలు చేసిన విజయ్ సాయి రెడ్డి.
ఈ వార్తలతో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిందంటూ మీడియాపై తీవ్ర ఆగ్రహం.
తనపై వార్తలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్స్‌ని కూడా వదలను హెచ్చరికలు.
తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఎవరు వ్యవహరించిన ఆఖరికి తమ పార్టీ వారు అయినా వదలను అని వార్నింగ్స్.
రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. వ్యక్తిగత దూషణలకు దిగిన విజయ సాయి రెడ్డి.
మీడియా సంస్థలు, జర్నలిస్టులపై విజయ సాయి రెడ్డి అసభ్య పదజాలంతో దూషించడంపై తీవ్ర విమర్శలు.
-
2024-07-15T13:17:52+05:30
వ్యవసాయం చేసే వాళ్లకే లబ్ధి: మంత్రి సీతక్క
వ్యవసాయం చేసే వాళ్లే రైతు భరోసా లబ్ది పొందేలా చర్యలు తీసుకుంటున్నాం.
అర్హులైన నిజమైన రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం.
రైతుల అభిప్రాయం మేరకే నిర్ణయాలు ఉంటాయి.
-
2024-07-15T13:08:44+05:30
వారికి ఇవ్వాలో వద్దో మీరే చెప్పండి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
7లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
అప్పుల సాకు చూపి వెనకడుగు వేసే ఉద్దేశ్యం మాకు లేదు.
క్యాబినెట్ స్థాయిలో నిర్ణయాలు తీసుకోకుండా రైతుల వద్దకు వచ్చాము.
నిరుద్యోగులను రెచ్చగొట్టే కుట్రలు బీఆర్ఎస్ చేస్తోంది.
వ్యవసాయం ఆదాయంపై ఇన్‌కామ్ టాక్స్ కట్టే పరిస్థితిలో రైతు లేడు.
అలాగే ఇతర విదేశాలకు పోవడం కోసం.. కారణలతో ఇన్ కామ్ టాక్స్ కట్టే వారికీ..
వందల ఎకరాలు కలిగి... వందల కోట్లు ఆదాయం చూపే వారికి ఇవ్వాలో వద్దో మీరే చెప్పండి.
-
2024-07-15T13:04:22+05:30
రైతు డిక్లరేషన్ మేరకు రుణమాఫీ, రైతు భరోసా..
హనుమకొండ కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ.
హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు.
రైతు భరోసా విధివిధానాలపై చర్చ.
భారీ సంఖ్యలో హాజరైన రైతులు.
రైతు డిక్లరేషన్ మేరకు రుణమాఫీ, రైతు భరోసా: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
గతంలో జరిగిన పొరపాట్లు కాంగ్రెస్ పాలనలో చోటు ఉండొద్దని రైతుల అభిప్రాయ సేకరణ చేస్తున్నాం.
గత అప్పులు తీర్చుకుంటూనే.. రైతు సంక్షేమo కోసం పాటు పడుతున్నాం.
-
2024-07-15T13:01:21+05:30
Weather: మరో ఐదు రోజులు జోరు వానలు..
నైరుతి రుతుపవనాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్.
ఇప్పటి వర్షాలు పడుతుండగా.. మరో ఐదు రోజులు విస్తారంగా వానలు పడనున్నాయి.
అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో అధిక వర్షం కురవనుండగా.. మిగతా జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని చెబుతున్నారు.
భారీగా ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
-
2024-07-15T12:51:05+05:30
ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ షాక్..!
ఎస్‌బిఐ నుంచి లోన్ తీసుకునే కస్టమర్లకు బిగ్ షాక్.
మార్చినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్(MCLR)ని 10 బేసిస్ పాయింట్స్ పెంచింది.
ఈ కొత్త రేట్లు 15 జులై, 2024 నుంచి అమల్లోకి వస్తాయి.
గృహ, వ్యక్తిగత, వాహన రుణాలు సహా అన్ని రకాల లోన్స్‌కి ఇది వర్తిస్తుంది.
ఫలితంగా లోన్ తీసుకునే కస్టమర్లపై వడ్డీ భారం పడనుంది.
అయితే, రెపో రేటు ప్రభావితమైన హోమ్ లోన్స్ ఈఎంఐలు మాత్రం మారవని బ్యాంకర్లు చెబుతున్నారు.
-
2024-07-15T12:40:29+05:30
వికారాబాద్‌లో పర్యాటకుల కష్టాలు..
ఎంజాయ్ చేద్దాం అని వెళ్లారు.. మట్టిలో ఇరుక్కుపోయారు.
ధారూర్ మండలం కోట్‌పల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కాలువలో ఇరుక్కుపోయిన వాహనాలు.
రాత్రంతా బురదలో నుంచి తీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వాహనాలను అక్కడే వదిలేసిన వాహనదారులు.
హైదరాబాద్ నుంచి వికారాబాద్ ప్రాంతంలో కోట్‌పల్లి ప్రాజెక్టు ప్రాంతంలో ఎంజాయ్ చేయడానికి వచ్చిన యువత.
నిన్న సాయంత్రం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కాలువ దాటివెళ్లిన వాహనదారులు.
రాత్రి భారీ వర్షం పడడంతో నల్ల మట్టిలో ఇరుక్కుపోయారు.
వాహనాలను తీయడానికి యత్నించినా ఫలితం లేకపోవడంతో అక్కడే వదిలేశారు.
తెల్లారే సరికి వాహనాలు నీట మునిగాయి.
ఎంజాయ్ చేద్దాం అని వస్తే వాహనాలు నీటిలో మునడంతో యువత కంగుతిన్నారు.
మూడు మహేంద్ర తార్ తోపాటు ఓ ట్రాక్టర్ నీటిలో మునిగింది.
ట్రాక్టర్‌ను గ్రామస్తులు తాడుతో ఒడ్డుకు తీయగా.. బురదలోనే తార్ వాహనాలు.
-
2024-07-15T12:37:13+05:30
సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేసిన కేసీఆర్.
కేసు విచారణను పాస్ ఓవర్ కోరిన న్యాయవాది.
సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో పాస్ ఓవర్ కోరిన న్యాయవాది మోహిత్ రావు.
ఇతర కేసులు ముగిసిన తర్వాత కేసీఆర్ కేసు విచారణ.
-
2024-07-15T12:32:51+05:30
తెలంగాణ సెక్రటేరియట్ వద్ద హై అలర్ట్..
హైదరాబాద్: చలో సెక్రటేరియట్‌కు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో ముట్టడికి పిలుపు.
నిరుద్యోగులకు మద్దతుగా సెక్రటేరియట్ ముట్టడికి బిసి జనసభ పిలుపు.
సెక్రటరియట్ వద్ద భారీగా మోహరించిన పోలీసు బలగాలు.
మూడు విభాగాల పోలీసులతో సెక్రటేరియట్‌కు భద్రత.
నాలుగు గేట్ల వైపు పోలీసుల పహారా.
సౌత్ ఈస్ట్ గెట్, మింట్ కాంపౌండ్ వైపు పూర్తిగా పోలీసుల అధీనంలో రోడ్లు.
కాసేపట్లో సెక్రటేరియట్‌కి రానున్న సీఎం.
మరో వైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం సెక్రటేరియట్ ముట్టడికి AISF పిలుపు.
-
2024-07-15T12:28:10+05:30
అల్లూరి జిల్లా: గండి పోచమ్మ ఆలయానికి పొటేత్తిన వరద నీరు
దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయానికి పొటేత్తిన వరద నీరు.
ఎగువన కురిసిన భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్ట్ వద్దకు భారిగా చేరుకుంటున్న వరద నీరు.
వరద ఉదృతి వల్ల పాపికొండల విహారయాత్ర కు సంభందించిన 15 బోట్ లను నిలిపివేసిన అధికారులు.
పోచమ్మ గండి వైపుగా వెళ్లే రంపచోడవరం, గోకవరం వైపు పూర్తిగా నీటమునిగిపోయిన రహదారులు.
గండి పోచమ్మ ఆలయం వైపుగా దండంగి వద్ద రహదారులు జలదిగ్బబంధం.
-
2024-07-15T12:26:28+05:30
ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం.
విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం.
పశ్చిమ కృష్ణాలో పొంగుతున్న వాగులు వంకలు.
కట్లేరులో భారీగా ప్రవహిస్తున్న వరద నీరు.
ఎగువ ప్రాంతం మైన ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో కట్టలేరు భారీగా చేరుతున్న వరద నీరు.
దాములూరు వద్ద రాకపోకలకు అంతరాయం.
మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారులు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు.
-
2024-07-15T12:08:53+05:30
విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం..
నేను సొంతంగా చానల్ పెడతానని గతంలో అన్నాను.
మనకు ఛానెల్ ఉంది కదా జగన్ వద్దని అన్నారు.
అప్పుడు నేను విరమించుకున్నాను.
ఈ సారి ఛానెల్ తప్పకుండా ప్రారంభిస్తాను.
ఎవరి వద్దని వారించినా స్టార్ట్ చేస్తా.
నా ఛానల్ న్యూట్రల్‌గా ఉంటుంది.. నిజాలు మాత్రమే చెబుతాను.
2029 ఎన్నికల్లో వైసిపిదే విజయం.
సాయి రెడ్డి భూములు అక్రమిస్తే.. వాటిని తీసుకోండి.. నాకేమీ అభ్యంతరం లేదు.
స్కాలర్షిప్ విషయంలో మదన్ మోహన్ నన్ను రెండు సార్లు కలిసారు.
వాడికి నాకు ఏ మాత్రం సంబంధం లేదు.
-
2024-07-15T11:51:19+05:30
కరీంనగర్: బండి సంజయ్‌పై పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో బీజేపీ ఎన్ని ప్రభుత్వాలు కూల్చింది.
బండి సంజయ్ దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉంది.
బీజేపీ కూల్చిన ప్రభుత్వాల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
ప్రభుత్వాన్ని కూల్చుతామంటే.. చూస్తూ ఊరుకోవాలా.
మేం ధర్మం తప్పలేదు.
మా పార్టీలో చేరుతున్న వారికి మేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.
డిసెంబర్ 3 వరకు మాకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచనే లేదు.
ప్రభుత్వాన్ని కూల్చుతామని మీరంటే.. నిలబెట్టడానికి వారు వస్తున్నారు.
ప్రభుత్వ సుస్థిరత కోసమే చేరికలు.
కుల గణన పై రెండు రోజుల్లో నిర్ణయం.
-
2024-07-15T11:40:57+05:30
ఎవరిని వదలను.. విజయసాయి రెడ్డి వార్నింగ్..
మా పార్టీ ఓటమిపై మేము సమీక్షించుకుంటున్నాం.
175 స్థానాలకు..11 స్థానాలు మాకు వచ్చాయి. ప్రజల తీర్పు ను గౌరవిస్తాం.
సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం ఇచ్చింది.
హామీలు అమలు చేయలేకపోతున్నారు.
నా పేరు ప్రతిష్టలు దెబ్బ తీసిన వారైనా.. ఆఖరికి మా పార్టీలో ఉన్న వారైనా వదేలే ప్రసక్తి లేదు.
విజయవాడలో మా ఇంటికి.. వచ్చి నేను ఎక్కడ ఉన్నానో విచారణ చేసారు.
ఆ వ్యక్తి ఎక్కడకు రమ్మంటే.. నేను అక్కడకు వస్తాను.. నాకు భయం లేదు.
మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం.
మధ్యతంతర ఎన్నికలు వచ్చినా మాదే గెలుపు.
అప్పుడు అందరి తోకలు కట్ చేస్తాం.
ఆధారాలు లేని ఆదివాసీ మహిళలకు అన్యాయం చేస్తున్నారు.
అవాస్తవాలు ప్రసారం చేసిన మీడియాతో ఎలా క్షమాణాలు చెప్పించాలో నాకు తెలుసు.
బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి కాదు.
తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తారు.
ఈ కుట్ర, కుతంత్రాలు వెనుక ఎవరు ఉన్నారో తెలుస్తా.
ప్రతి పక్షంలో ఉన్నా ఎవరిని వదలను బుద్ధి చెప్తా.
యూట్యూబ్ చానల్స్‌పై చర్యలు కూడా ఉంటాయి.
-
2024-07-15T11:21:46+05:30
కర్నూలు: శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..
శ్రీశైలం వెళ్లే భక్తులు నల్లమల అడవుల్లోకి వెళ్లేందుకు ప్రవేశం నిషిద్ధం.
జులై నుంచి సెప్టెంబర్ వరకు పులుల ఏకాంత వేళ.
సంతానోత్పత్తి సమయం కావడంతో ఎన్టీసీఏ ఆదేశాల మేరకు ఆగస్టు నుంచి నల్లమల అడవుల్లోకి ప్రజలకు ప్రవేశం పూర్తి నిషేధం.
మరోవైపు.. కొద్దిరోజులుగా మహానందిలో పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత పులిని బంధించేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు.
అడ్డంకిగా మారిన ఎడతెరిపిలేని వర్షం.
-
2024-07-15T11:17:41+05:30
New Delhi: మనీష్ సిసోడియా రిమాండ్ పొడిగింపు..
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు.
రిమాండ్ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపర్చిన అధికారులు.
జులై 22 వరకు రిమాండ్ పొడిగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు.
తదుపరి విచారణ జులై 22కు వాయిదా.