-
-
Home » Mukhyaamshalu » Breaking News November 04th Monday Latest Telugu News Live Updates Siva
-
Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Nov 04 , 2024 | 10:21 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-11-04T13:13:24+05:30
వైసీపీకి మరో బిగ్ షాక్.. మాజీ మంత్రి జంప్..!
వైసీపీ ముఖ్యనేత, మాజీ మంత్రి జోగి రమేష్ పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే చెబుతున్నారు ఆయన సన్నిహితులు. తెలుగుదేశం పార్టీ లేదా జనసేనలోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నారట. ఇదే అంశంపై ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. కృష్ణా జిల్లా వైసీపీ కీలక నేతల సమావేశానికి జోగి రమేష్ హాజరు కాకపోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఆయన పార్టీ మార్పు కన్ఫామ్ అని వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
-
2024-11-04T11:39:45+05:30
ఏపీ టెట్ ఫలితాలు విడుదల
టెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్
టెట్ ఫలితాల్లో 50.79 శాతం మంది అర్హత
టెట్ ఫలితాల్లో 1,87,256 మంది అర్హత
త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల: మంత్రి లోకేష్
ఫలితాలను (https://cse.ap.gov.in) ద్వారా తెలుసుకోవచ్చు.
-
2024-11-04T11:31:09+05:30
హమ్మయ్య.. మెట్రో సమస్య క్లియర్ అయ్యింది..
మెట్రో ట్రైన్ సేవలను పునరుద్ధరించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
దాదాపు 15 నిమిషాల పాటు మెట్రో రైళ్ళ రాకపోకలు నిలిచిపోయాయి.
రైళ్ళ ఫ్రీక్వెన్సీ పునరుద్ధరించాం.
బేగంపేట రాయదుర్గం మధ్య సాంకేతిక సమస్య తలెత్తింది.
ప్రస్తుతం రైళ్ళ రాకపోకలు యదావిధిగా నడుస్తున్నాయి.
ప్రస్తుతం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేదు.
బేగంపేట రాయదుర్గం మధ్య సమస్య తలెత్తడంతో అమీర్‌పేట్, మియాపూర్, నాగోల్ రూట్‌లో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి.
మెట్రో రైళ్ళను రిస్టోర్ చేశాం.
-
2024-11-04T11:19:25+05:30
ఉత్తరాఖండ్ ఘోర బస్సు ప్రమాదం..
అల్మోరా సరిహద్దు వద్ద రామ్‌నగర్‌లోని కుపి సమీపంలో బస్సు ప్రమాదం.
అదుపుతప్పి లోయలో పడిపోయిన బస్సు.
గర్వాల్ మోటార్ చెందిన బస్సుగా తేల్చిన అధికారులు.
ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు.
ఘటనలో స్థలంలో ఏడుగురు మృతి.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం.
సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన ఎస్‌డిఆర్ఎఫ్, పోలీసులు.
-
2024-11-04T11:03:23+05:30
తెలంగాణకు రాహుల్ గాంధీ..
రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు.
ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం గాంధీ భవన్‌లో సమీక్ష.
పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన సమీక్ష సమావేశం.
సమావేశంలో పాల్గొననున్న హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి.
మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ తదితరులు.
-
2024-11-04T10:21:31+05:30
హైదరాబాద్ : మెట్రో రైల్ లో సాంకేతిక లోపం.
ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్ళు.
30 నిమిషాలుగా నిలిచిపోయిన మెట్రో సేవలు.
నాగోల్ -రాయదుర్గం, LB నగర్ - మియాపూర్ రూట్ లో నిలిచిపోయిన మెట్రో రైళ్ళు.
ఆఫీస్ లకు వెళ్ళే సమయం కావడం తో తీవ్ర ఇబ్బందులు ప్రయాణికులు.