-
-
Home » Mukhyaamshalu » Breaking News Of 10th September 2024 Today Latest Telugu News Live Updates Siva
-
Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Sep 10 , 2024 | 08:54 AM
Breaking News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
2024-09-10T21:00:29+05:30
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త..
తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు చెప్పిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణాలో నాలుగు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు..
ఆంధ్రప్రదేశ్‌లో రెండు కొత్త ప్రభుత్వ కాలేజీలకు అనుమతి
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
తెలంగాణాలోని యాదాద్రి భువనగిరి, మెదక్, మహేశ్వరం..
కుత్బుల్లాపూర్‌లోని మెడికల్ కళాశాలలకు అనుమతి
ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభానికి అనుమతినిచ్చిన కేంద్రం
నాలుగు కాలేజీల్లో 2024- 25 సంవత్సరానికి గాను ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు
కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీల అనుమతుల కోసం..
చాలా కాలంగా తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు
గతంలో ఎనిమిది వైద్య కళాశాలలకు అనుమతికి నిరాకరించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్
నూతన వైద్య కళాశాలల కు అనుమతి కోసం గత కొంత కాలంగా రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలు
ఎనిమిదింటిలో నాలుగు కళాశాలలకు అనుమతి ఇచ్చిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌లో కడప, పాడేరులో ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి
-
2024-09-10T20:30:15+05:30
చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన వారినే పట్టుకోలేరా?
ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఉండి ఎమ్మెల్యే కన్నెర్ర
సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన వారినే పట్టుకోలేరా?
ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయే ప్రమాదం ఉందన్న RRR
అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా..? అనే అనుమానం రావడం ఖాయం
ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత ఇంటిపై..
టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారంతా రాష్ట్రం విడిచి పారిపోయారా?
కోర్టు నుంచి ఎటువంటి అడ్డంకులు లేకపోయినా..
పోలీసులు అరెస్టు చేయాలనుకుంటే చేయలేరా?
కాదాంబరీ జత్వాని కేసులో నిందితులైన పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలి
నా కేసులో నిందితులుగా పేర్కొన్న డీజీ ర్యాంక్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి
వరద ప్రమాదం నుంచి ప్రజల్ని కాపాడిన తర్వాత ముఖ్యమంత్రి..
చంద్రబాబు నాయుడు వారిపై చర్యలు తీసుకుంటారనే ఆశిస్తున్నా
కొల్లేరు సరస్సును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది
పది రోజులపాటు అవిశ్రాంతంగా ప్రజల మధ్యనే ఉన్న సీఎం చంద్రబాబు : రఘురామకృష్ణంరాజు
-
2024-09-10T19:45:44+05:30
ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన
రేపు ఉత్తరాంధ్రలో సీఎం చంద్రబాబు పర్యటన
అధిక వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించున్న సీఎం
విశాఖ, ఏలేరు ప్రాజెక్టు ప్రాంతాల్లో తిరిగి..
ఎల్లుండి నందివాడ, కొల్లేరుల్లో తిరిగి బాధితుల్ని పరామర్శించనున్న చంద్రబాబు
బుడమేరు పనులను పరిశీలించిన తర్వాత మీడియాకు వెల్లడించిన ముఖ్యమంత్రి
-
2024-09-10T19:30:16+05:30
వాళ్ల ముసుగు తొలగిస్తా.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
బుడమేరు పనులను పరిశీలించిన తర్వాత మీడియాతో ముఖ్యమంత్రి
రాజకీయ ముసుగులో మాట్లాడుతున్న నేరస్థుల ముసుగు తొలగిస్తాన్న చంద్రబాబు
నేరస్తుల్ని నేరస్థులుగానే ప్రజల ముందు నిలపెడతానని హెచ్చరిక
నేర సామ్రాజ్యం విస్తరణకు రాజకీయ ముసుగు తొడిగితే ఊరుకునేది లేదు
వరదలపై యుద్ధంలో గెలిచినా, జరిగిన నష్టాన్ని మాత్రం పూడ్చలేకపోయాం
సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చేయకూడదనే నియమాలుంటాయి..
కానీ వరదలపై యుద్ధంలో ఆ అవకాశం కూడా లేదు
రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నా
అంతిమంగా ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసి, అంతా నిలదొక్కుకునే విధంగా చర్యలు తీసుకుంటాం
వాహనాల స్పేర్ పార్ట్స్ కూడా 100శాతం సబ్సిడీ ఇచ్చేలా కంపెనీలతో మాట్లాడతాను : చంద్రబాబు
-
2024-09-10T19:25:11+05:30
జనసేనలో భగ్గుమన్న వర్గ విభేదాలు
మచిలీపట్నం జనసేనలో భగ్గుమన్న వర్గ విభేదాలు
బ్యానర్ విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం
తన బావపై దాడి చేసిన జనసేన కార్యకర్త యర్రంశెట్టి నాని
దాడిలో గాయపడ్డ శ్రీనివాసరావు
అపార్ట్మెంట్ లోని ఇంట్లోకి చొరబడి..
రెండు ఎల్‌సీడీ టీవీలు, ఫ్రిజ్, గ్రైండర్, ఫర్నిచర్ ధ్వంసం చేసిన నాని
తీవ్రంగా కొట్టిన అనంతరం కాళ్ళు పట్టించి వీడియోలు వైరల్
బాధితుడు శ్రీనివాసరావును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు
-
2024-09-10T19:15:28+05:30
బొప్పాయిలో బొజ్జ గణపయ్య..
కాకినాడ జిల్లాలో అద్భుతం జరిగింది. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట సగరపేటలో గణపతి మండపం దగ్గర ఒక భక్తుడు వాళ్ల ఇంట్లో కాసిన మొదటి బొప్పాయి కాయను స్వామివారికి దగ్గర తీసుకుని వచ్చి కోసి నైవేద్యం పెట్టారు. అయితే.. అందులో గణపతి రూపం కనిపించడంతో ఆ రూపాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు.
-
2024-09-10T18:30:44+05:30
అంతా ఆ దుర్మార్గుడే చేశాడు.. చంద్రబాబు ఫైర్
బుడమేరు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై తీవ్ర విమర్శలు
ప్రజలపై విద్వేషంతో జగన్ చేసిన జాతి ద్రోహం..
ఫలితమే బెజవాడ ముంపునకు కారణం
వరదలపై 10 రోజుల పాటు అహర్నిశలూ శ్రమించి ఓపెద్ద యుద్ధమే చూసాం
ఓ దుర్మార్గుడు నిర్లక్ష్యం ఎంతమంది పాలిట శాపమో బుడమేరు ఉగ్రరూపమే ఓ పాఠం
బుడమేరకు విజయవాడ నగరం వైపు పడిన 3 గండ్లను గత ప్రభుత్వం పూడ్చలేదు
బుడమేరు దాల్చిన ఉగ్రరూపంతో ఈ నీరు నగరాన్ని ముంచెత్తటంతో..
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తలెత్తింది
మరోవైపు పులివాగు కూడా వచ్చి ఇక్కడే కలిసింది
ఆర్మీ కూడా చేతులెత్తేసే పరిస్థితుల్లో మంత్రి రామానాయుడు..
నేతృత్వంలో ని బృందం అహర్నిశలు పనిచేసి గండ్లు పూడ్చారు
మరో మంత్రి లోకేష్ వివిధ శాఖల్ని సమన్వయం చేస్తూ తెరవెనుక ఎంతో కృషి చేశారు
బుడమేరుపై అక్రమ కట్టడాలు కట్టి రిజిస్ట్రేషన్లు..
చేసుకోవడంతో నీరు దిగువకు పారని పరిస్థితి తలెత్తింది
ఓ దుర్మార్గుడు పాలనలో చేసిన తప్పుడు పనులు వల్ల ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు
గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికే 2-3 రోజుల సమయం పట్టింది
ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చి గండ్లు పూడ్చారు
అయినా కొన్ని లీకేజీలు ఉండటం వల్ల ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం
బుద్ధి లేకుండా బోట్లు వదిలి బ్యారేజీకి ముప్పు తెచ్చే కుట్రలు పన్నారు
10 రోజులు విశ్రాంతి తీసుకోకుండా రాత్రిపగలు పని చేసిన..
అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వారికి కృతజ్ఞతలు కూడా చెప్తున్నా : చంద్రబాబు
-
2024-09-10T18:00:00+05:30
స్కిల్ కేసులో కీలక పరిణామం
స్కిల్ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం
స్కిల్ కేసులో సీమెన్స్ మాజీ ఎండీ బెయిల్‌ను సమర్ధించిన సుప్రీంకోర్టు
స్కిల్ కేసులో సీమెన్స్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్‌తో పాటు..
మరో ఇద్దరికి గతంలో బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన ఈడీ
ఈడీ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన..
జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం
సీమెన్స్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్,..
సురేశ్ గోయల్‌కు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సమర్ధించిన సుప్రీం ధర్మాసనం
-
2024-09-10T17:50:46+05:30
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి..
మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి సతీమణి..
శ్వేత రెడ్డి అకాల మరణం బాధాకరం
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని..
ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి : రేవంత్ రెడ్డి
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ..
చెన్నైలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి శ్వేత కన్నుమూత
-
2024-09-10T17:45:41+05:30
వరద కంటిన్యూ..
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 26 గేట్లు ఎత్తివేత
ఇన్ ఫ్లో 2,50,629 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 2,50,629 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం 589.4 అడుగులు
పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ 310.25 టీఎంసీలు
-
2024-09-10T17:40:09+05:30
ఖమ్మం కోసం మేము సైతం..
ఖమ్మం వరద బాధితులను ఆదుకోవడానికి..
ముందుకొస్తున్న సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు
ఇప్పటికే పెద్ద ఎత్తున విరాళాలు అందజేసిన ప్రముఖులు
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ
సీఎం సహాయనిధికి కోటి రూపాయిలు విరాళం..
అందజేసిన లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్
కోటి రూపాయిలు విరాళం అందజేసిన..
మైత్రా ఎనర్జీ గ్రూప్, అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు
-
2024-09-10T17:32:39+05:30
అల్లర్లు కంటిన్యూ.. ఇంటర్నెట్ బంద్
మణిపూర్ రాజధాని ఇంపాల్‌లో కొనసాగుతున్న అల్లర్లు
మైతి, కుకీల రిజర్వేషన్లు అంశం కొనసాగుతున్న ఆందోళన
ఏడాది క్రితం రెండు వర్గాల మధ్య మొదలైన వివాదం
అప్రమత్తమమైన మణిపూర్ సర్కార్
రోడ్లపై వచ్చిన ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి..
సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఇంటర్నెట్ సేవల నిలిపివేత
-
2024-09-10T17:25:32+05:30
ఓకే.. బాగుంది..
బుడమేరు గండి కూర్చిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు..
అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు
బాగుందని అధికారులు, మంత్రికి బాబు ప్రశంసలు
ఐదు రోజుల పాటు శ్రమించి గండ్లు పూడ్చిన ఆర్మీ, అధికారులు
నిద్రాహారాలు మాని బుడమేర దగ్గరే ఉన్న నిమ్మల
చంద్రబాబు డైరెక్షన్‌లో మొత్తం పనులు జరిగిన వైనం
శభాష్ నిమ్మల అంటూ ఇప్పటికే మంత్రి పనితీరుపై సీఎం ప్రశంసలు
-
2024-09-10T17:10:40+05:30
రండి.. బ్రాండ్ నిలబెట్టుకోండి
వరద బాధితుల కోసం మరో అడుగు ముందుకేసిన ముఖ్యమంత్రి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో వివిధ రకాల ఎలక్ట్రానిక్ కంపెనీల..
ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమావేశం
వరదల్లో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులకు..
రిపేర్లు చేసే అంశంపై కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశం
వరదలతో ప్రజల ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు తడిచి పాడైపోయాయి
కంపెనీలు సామాజిక బాధ్యతతో బాధిత..
ఎలక్ట్రానిక్ వస్తువులు బాగు చేసేందుకు ముందుకు రావాలి
స్పేర్ పార్ట్స్ డిస్కౌంట్‌లో అందించాలి
ఎలక్ట్రానిక్ కంపెనీల సేవల బృందాలు ఒకే వేదికపైకి వచ్చి..
సర్వీస్ అందిస్తే మంచి ఫలితాలు వస్తాయి
ఇప్పుడు మీరు స్పందించే తీరే కస్టమర్లలో మీ బ్రాండ్ నిలబడుతుంది..
కంపెనీల వారిగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి అదనంగా టెక్నీషియన్లను ఏర్పాటు చేయండి
వారం రోజులు టార్గెట్ పెట్టుకుని పని చేయాలని కంపెనీల యాజమాన్యాలను కోరుతున్న
చంద్రబాబు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కంపెనీల ప్రతినిధులు
వరద ప్రాంతాల్లో ప్రత్యేక సర్వీస్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సేవలందిస్తామన్న కంపెనీల ప్రతినిధులు
-
2024-09-10T16:52:20+05:30
వరద బాధితులకు నేను సైతం..
వరద బాధితులకు అండగా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ
బండారు నారాయణ స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా..
అంభాపురం వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
వరద బాధితులు అందరికీ సీఎం చంద్రబాబు అండగా ఉన్నారు
పెద్దకొడుకులాగా మీకు అందుబాటులో ఉండి సేవలు చేస్తున్న సీఎం చంద్రబాబు
మా ప్రాంతంలో పనులు చూసుకొని వరద ప్రాంతంలో సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాం
సీఎం చంద్రబాబు స్ఫూర్తి, ఆయన ఇస్తున్న ఆదేశాలతో ఒక సైన్యం లాగా పనిచేస్తున్నాం
సహాయ చర్యలు చేసేందుకు ముఖ్యమంత్రి..
కలెక్టర్ కార్యాలయంలోని మీకు అందుబాటులో ఉన్నారు
వరద బాధితులతో ఎమ్మెల్యే బండారు శ్రావణి
-
2024-09-10T16:45:31+05:30
గణేష్ నిమజ్జనాలపై హైకోర్టు కీలక తీర్పు
హుస్సేన్‌సాగర్‌లో యధావిధిగా గణేష్ నిమజ్జనాలు
హుస్సేన్ సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆదేశాలను..
అమలు చేయట్లేదన్న పిటిషన్ తోసిపుచ్చిన హైకోర్టు
కంటెమ్ట్ పిటిషన్ మెయింటనెబుల్ కాదన్న హైకోర్టు
కోర్టు ధిక్కరణపై ఆధారాలు చూపలేక పోయిన పిటీషనర్
గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలన్న హైకోర్టు
గణేష్ నిమ్మజ్జనం చివరి సమయంలో దిక్కరణ పిటీషన్ సరికాదన్న హైకోర్టు
2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలన్న కోర్టు
గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదు..
అలాంటప్పుడు ఇప్పుడెలా హైడ్రాను పార్టీగా చేస్తాం..?
అధికారుల చర్యలను సమర్ధించిన హైకోర్టు
2022లో అధికారుల చర్యలపై తృప్తి చెంది రికార్డ్ చేశామన్న హైకోర్టు
పీవోపీతో విగ్రహాలు తయారు చేయడంపై నిషేదం ఇవ్వలేం
కానీ పీవోపీ విగ్రహాలు తాత్కాలిక పాండ్స్‌లో నిమజ్జనం చేసుకోవచ్చన్న హైకోర్టు
పిటీషనర్ ప్రత్యేక ఆదేశాలకోసం రిట్ పిటిషన్ వేయవచ్చు: హైకోర్టు
-
2024-09-10T16:40:31+05:30
బుడమేరు ప్రాంతానికి చంద్రబాబు
విజయవాడ కలెక్టరేట్ నుంచి బుడమేరు గండి పూడ్చిన..
ప్రాంతానికి బయలుదేరిన ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు
అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించనున్న సీఎం
అనంతరం మీడియాతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి
-
2024-09-10T16:30:24+05:30
సాయం తీసుకురండి.. లేదంటే బయటికి రండి!
వరద బాధితుల కోసం ఢిల్లీ వెళ్లి సాయం తీసుకురండి
కేంద్రం కాదంటే బీజేపీ నుంచి బయటకి రండి
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్
వరద బాధితులను పరామర్శించి, వస్త్రాలు పంపిణీ చేసిన షర్మిల
విజయవాడ లో వరద బీభత్సం అందరం చూశాం
బుడమేరు ముంపు వల్ల ఏడు లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు
యాభై మంది వరదల వల్ల ప్రాణాలు కోల్పోయారు
అపారమైన ఆస్తి నష్టంతో ప్రజలు దెబ్బ తిన్నారు
విజయవాడకు సమీపంలో అమరావతి ఉంది
ఒక్క విజయవాడలో ఇంత నష్టం జరిగితే ప్రభుత్వం ఏం చేస్తోంది..?
రూ. 6888 కోట్లు నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు
కేంద్ర బృందాలు వచ్చారు.. చూశారు వెళ్లారు..
ఆంధ్రప్రదేశ్‌పై చిన్న చూపు ఎందుకు..?
ఏపీ నుంచి ఎంపీలను ఇస్తేనే బీజేపీ అధికారంలో ఉంది
మోదీ ఎక్కడెక్కడో తిరుగుతారు..? ఏపీకి ఎందుకు రావడం లేదు..?
ఏపీకి అన్ని విధాలా ప్రధాని మోదీ మోసం చేశారు
అధికారం ఇచ్చిన ఏపీపై మోదీకి ఇంత చిన్నచూపు ఎందుకు..?
బీజేపీతో ఉండటం వల్ల మనకి ఒరిగిందేమీ లేదు..?
చంద్రబాబు దీనిపై వెంటనే సమాధానం చెప్పాలి
మేము కేంద్రానికి ఇక్కడ సమస్యలపై లేఖ రాశాం
ఇక్కడ గుక్కెడు మంచి నీళ్లు కూడా అందడం లేదు
ప్రజలు బాధలు వింటే ఆవేదన కలుగుతోంది
ఇంట్లో సామాన్లు కూడా ఒక్కటీ మిగలలేదు
పేద, మధ్య తరగతి ప్రజలు జీవితాలు తారుమారు అయ్యాయి
రేషన్ బియ్యం ఇచ్చారంట.. అవి ఎలా తింటారు..?
ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు..?
రైల్వే శాఖ మంత్రికి లేఖ రాసినా స్పందన లేదు
రైల్ నీరు విజయవాడలోనే తయారు చేస్తారు
ఆరువేల కోట్లు ఆదాయం ఇచ్చే రైల్వేకు ప్రజల పట్ల బాధ్యత లేదా..?
ఏపీ ప్రజల సమస్యలు పట్టించుకోని బీజేపీతో
ఉండటం అవసరమా..? అనేది చంద్రబాబు ఆలోచన చేయాలి
బుడమేరు ముంపు తప్పు మీదంటే మీదని వైసీపీ, టీడీపీ విమర్శలు చేసుకుంటున్నాయి
గతంలో వైఎస్ ఆపరేషన్ కొల్లేరు చేపట్టి కొంత వరకు పనులు చేశారు
ఆ తరువాత వచ్చిన వారు ఆక్రమణలు ప్రోత్సహించారు
కనీసం కాలువలు మరమ్మత్తులు కూడా చేయలేదు
ఈ బుడమేరు ముంపుకు అందరూ కారకులే
ప్రజల గురించి ఆలోచన చేసే కాంగ్రెస్ రావాలి
ఆక్రమణలు పూర్తిగా తొలగించి చర్యలు తీసుకోవాలి
వరద బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలి
ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాలకు ఓటమి తప్పదు
ఇది గుర్తిస్తూ చంద్రబాబు లక్ష సాయం చేయాలి
కనీసం పదిహేను వేలు ఇప్పుడు ముందస్తుగా సాయం ఇవ్వాలి
పంట నష్టం కూడా అంచనా వేసి రైతులను ఆదుకోవాలి
మారమూల ప్రాంతాలకు సాయం అందేలా చూడాలి
చిన్న పిల్లల దగ్గర నుంచి చంద్రబాబు డబ్బు తీసుకోవడం కాదు
బీజేపీ నుంచి చంద్రబాబు డబ్బులు తీసుకు రావాలి
ఏపీ ఎంపీల ద్వారా ప్రధాని అయిన మోదీని నిలదీయాలి
చిన్న పిల్లల నుంచి డబ్బు అనేది చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్
పిల్లల దగ్గర ఎందుకు.. మోదీ నుంచి పది వేల కోట్లు తేవాలి
వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం షర్మిల కామెంట్స్
-
2024-09-10T16:15:45+05:30
ఏలేరు వరద బీభత్సం
కాకినాడ జిల్లా 216వ జాతీయ రహదారిపై ఏలేరు వరద బీభత్సం
పిఠాపురం బైపాస్ రోడ్డు, ఇల్లింద్రాడ, టోల్గేట్, గొల్లప్రోలు..
బైపాస్ రోడ్డులో రెండు వైపులా భారీగా ప్రవహిస్తున్న ఏలేరు వరద నీరు
రెండు కిలోమీటర్ల మేర ఇదే పరిస్థితి
ఇప్పటికే ఒకవైపు రాకపోకలు నిలిపివేత
సాయంత్రానికి పూర్తిగా రాకపోకలు నిలిపివేసే అవకాశం
గొల్లప్రోలు-పిఠాపురం పట్టణాల్లోకి వెళ్లే..
రహదారుల పైకి భారీగా ఏలేరు వరద నీరు
-
2024-09-10T16:10:52+05:30
విజయవాడ వరద బాధితులకు మంత్రి తీపి కబురు!
బుడమేరు ఆక్రమణలు తొలగింపుపై ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చారు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కామెంట్స్
ఎన్నో ఏళ్లుగా ఆక్రమించుకుని ఉన్నవారికి తగు ప్రత్యామ్నాయం చూపించే తొలగిస్తాం
ఇందుకు మనకున్న చట్ట నిబంధనలు సరిపోకపోతే, అవసరమైతే కొత్త చట్టం తెస్తాం
రేపు ఉదయానికల్లా విజయవాడ నగరంలో ఎలాంటి వరద నీరు లేకుండా చేస్తాం
ఇంటింటి నష్టం అంచనా ప్రక్రియ అవసరమైతే ఇంకో రోజూ పొడిగిస్తాం
ఎవరైనా ఇంట్లో లేకపోయినా, వేరే ప్రాంతానికి వెళ్లినా..
వారు వచ్చాక కూడా నష్టం అంచనా నమోదు చేస్తాం
10వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నారు
బుడమేరకు గండిపడి వచ్చిన నీటికి పోయే దారి లేక ఇబ్బందులు తలెత్తాయి
రేపు, ఎల్లుండి కూడా అవసరమైన చోట ఆహారం అందిస్తాం : మంత్రి నారాయణ
-
2024-09-10T16:00:22+05:30
రేపు కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్
ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ
బుధవారం సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సమావేశం
పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం
-
2024-09-10T15:50:29+05:30
వరద బాధితులకు 10 లక్షలు సాయం
విజయవాడ వరద బాధితులకు..
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రూ.10లక్షల సాయం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్ అందజేసిన దగ్గుపాటి ప్రసాద్
దగ్గుపాటిని అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
తమ నియోజకవర్గం నుంచి మరింత సాయం అందిస్తామన్న దగ్గుపాటి
-
2024-09-10T15:40:46+05:30
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై..
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కామెంట్స్
సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవం అధికారికంగా జరపాలి
మజ్లిస్ పార్టీకి భయపడి గత ప్రభుత్వం విలీన దినోత్సవం జరపలేదు
ఈ పరంపరను బ్రేక్ చేసి.. సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలి
సీఎం రేవంత్ రెడ్డి విలీన దినోత్సవం అధికారికంగా జరపాలి
తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదల వల్ల ఆస్తి నష్టం జరిగింది
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు ఎలాగో ఉంది..
వారికి కేంద్రం జాతీయ విపత్తుగా పేర్కొని నిధులు విడుదల చేయాలి
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలి
సత్యవేడు ఎమ్మెల్యే వ్యవహారంపై న్యాయవ్యవస్థ సుమోటోగా కేసు విచారణ జరపాలి
వారి వెనుక ఎవరున్నారని దానిపై విచారణ చేపట్టాలి : నారాయణ
-
2024-09-10T15:35:19+05:30
పాల్ పిటిషన్.. మళ్లీ వాయిదా
అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా..
విషయంపై కేఏ పాల్ ఏపీ హైకోర్టులో పిటిషన్
ఈ అంశంపై ఈ రోజు వాదనలు
ఈ కేసుకు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచన
కేంద్ర ప్రభుత్వము కౌంటర్ దాఖలు చేయమని ఆదేశాలు జారీ
సెప్టెంబర్- 23కు తదుపరి విచారణ వాయిదా
పార్టీలకు అతీతంగా అందరూ ప్రత్యేక హోదా..
విషయంలో ప్రతి ఒక్కరు కలిసి రావాలని కేఏ పాల్ పిలుపు
-
2024-09-10T15:30:03+05:30
కేసీఆర్, కేటీఆర్‌లకు వీహెచ్ సూటి ప్రశ్న
సకలజనుల సర్వేపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లకు వీహెచ్ సూటి ప్రశ్న
మంగళవారం నాడు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత
గత ప్రభుత్వం సకలజనుల సర్వే చేసింది.. కానీ ఇప్పటివరకు ఆ రిపోర్ట్ బయటపెట్టలేదు
సకలజనుల రిపోర్ట్ ఎక్కడకి పోయింది కేసీఆర్, కేటీఆర్..?
బీసీ కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి
మూడు నెలల లోపల కులగణన రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు చెప్పింది
రేవంత్ రెడ్డి కులగణన బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు..
రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేసి..
బీసీ కులగణన చేయాలని చెప్పారని గుర్తు చేసిన వీహెచ్
సకలజనుల రిపోర్ట్‌ను చీప్ సెక్రటరీకి ఇవ్వాలి
సకలజనుల రిపోర్ట్ ఇస్తే బీసీ కులగణనకి ఊయోగపడుతుంది
బీసీ కమిషన్ కూడా వచ్చింది..
90% ఉన్న ప్రజలకి అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ చెప్పారు
సీఎం 150 కోట్లు రిలీజ్ చేస్తే రెండు నెలలోనే బీసీ కులగణన రిపోర్ట్ వస్తుంది
ప్రభుత్వం వెంటనే కులగణన ప్రారంభించాలి
కేసీఆర్, కేటిఆర్‌కు చిత్త శుద్ది ఉంటే సకలజనుల రిపోర్ట్ బయట పెట్టాలి
బీసీ కులగణన కంప్లీట్ అయ్యాక సర్పంచ్ ఎన్నికలు వస్తే..
బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది.. : వీహెచ్
-
2024-09-10T15:10:56+05:30
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తకు దేహశుద్ధి
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ పరిధిలో వైసీపీ కార్యకర్త మురళీకృష్ణ అరెస్ట్
మహిళకు మాయ మాటలు చెప్పి విజయవాడకు పరారి
వైసీపీ కౌన్సిలర్ మాచిరెడ్డి బుల్లి దొర అనుచరుడిగా మురళీకృష్ణ
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు
మురళీకృష్ణకు దేహశుద్ధి చేసిన బాధితురాలి బంధువులు
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మురళీకృష్ణ
హాస్పిటల్ తరలింపు, నిలకడగా ఉన్న ఆరోగ్యం
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
-
2024-09-10T15:00:35+05:30
విషమంగానే సీతారాం ఏచూరి ఆరోగ్యం
సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం
ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సీపీఎం ప్రధాన కార్యదర్శి
కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పైనే ఏచూరికి చికిత్స
గత నెల 19న ఎయిమ్స్‌లో చేరిన సీతారాం ఏచూరి
ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీకి వెళ్లి ఆరా తీసిన..
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ
వామపక్ష ఉద్యమాలకు ఏచూరి ఒక ఐకాన్
ఎన్నో సమస్యలపై పోరాడిన ఏచూరి..
ఇప్పుడు తన శరీరంతోనే పోరాడుతున్నారు
ఏచూరి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా : నారాయణ
-
2024-09-10T14:30:20+05:30
పీఏసీ ఛైర్మన్ పదవిపై బీజేఎల్పీ నేత కీలక వ్యాఖ్యలు
వివాదమైన పీఎసీ పదవిపై ఏబీఎన్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన ఏలేటి మహేశ్వరరెడ్డి
అరికెపూడి గాంధీకి పీఏసీ ఛైర్మన్ పదవి ఎలా ఇస్తారని సూటి ప్రశ్న
పీఏసీ ఛైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కే ఇవ్వాలి
సీఎం రేవంత్ రెడ్డి సంప్రదాయాలను తంగులో తొక్కారు
పార్టీ ఫిరాయించిన గాంధీకి పీఏసీ చైర్మన్ ఇవ్వటం ఘోరమైన తప్పిదం
బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల పేర్లను పంపింతే..
గాంధీకి పీఏసీ చైర్మన్ ఇవ్వటం హాస్యాస్పదం
కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని అరికపూడి గాంధీ అబద్దాలు చెబుతున్నారు
బీఆర్ఎస్ చేసిన తప్పులనే రేవంత్ ప్రభుత్వం చేస్తోంది
తెలంగాణలో ఆర్ఆర్(రేవంత్ రెడ్డి) కాంగ్రెస్ పాలన నడుస్తుంది
ఏఐసీసీకి.. ఆర్ఆర్ కాంగ్రెస్‌కు మధ్య గ్యాప్ వచ్చింది
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవటం..
ఉత్తమ్, భట్టి లాంటి సీనియర్లకు ఇష్టం లేదు
స్పీకర్ కాపాడినా.. ప్రజాక్షేత్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శిక్ష తప్పదు
ముగ్గురు కాదు.. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి : మహేశ్వరరెడ్డి
-
2024-09-10T13:58:32+05:30
నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు: అరికేపూడి గాంధీ
నేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు.
దేవుడి శాలువా మాత్రమే కప్పుకున్నాను.
సీఎం రేవంత్ రెడ్డి నాకు పాత మిత్రుడు.
అభివృద్ది కోసం కలిసి పనిచేద్దామని రేవంత్ రెడ్డి చెప్పారు.
పార్టీలో చేరమని రేవంత్ రెడ్డి నన్ను ఎప్పుడూ కోరలేదు.
ప్రతిపక్షానికి పిఎసి ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా?
నాకు పిఏసి ఇస్తే ఓర్వలేని తనం ఎందుకు?
మనం ఏం చేశామో కూడా గుర్తుంచుకోవాలి.
ప్రజాస్వామ్యాన్ని చంపుకుంటూ వచ్చారు.
వారికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు.
మీ వాదన చెప్పండి చర్చకు సిద్ధం.
మీకు సమాధానం చెప్పేందుకు నేను రెడీ.
పిఏసి చైర్మన్ కోసం ఎమ్మెల్యేల సంతకాలతో నేను రూల్స్ ప్రకారం నామినేషన్ వేశాను.
తప్పులుంటే వెళ్లి స్పీకర్‌ను అడగండి.
ఉప ఎన్నిక వస్తే ఎదుర్కోవడానికి నేను సిద్దం.
-
2024-09-10T13:43:20+05:30
బీఆర్ఎస్ పార్టీపై దానం నాగేందర్ షాకింగ్ కామెంట్స్..
బీఆర్ఎస్ చేస్తే సంసారం మేం చేస్తే వ్యభిచారమా?
నేను రూల్ ప్రకారమే ఎంపీగా పోటీ చేసాను.
బీఆర్ఎస్ వాళ్ళు మాకు రూల్స్ చెప్తారా?
అనర్హత గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కి లేదు.
ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కేసీఆర్.
కేసీఆర్ హాయంలో పీఏసీ చైర్మన్ అక్బర్‌కి ఎందుకు ఇచ్చారు?
కేసీఆర్ హాయంలో ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ ఎందుకు ఇవ్వలేదు?
స్పీకర్ నిర్ణయం తర్వాత మా నిర్ణయం మేం చెప్తాం.
బీఆర్ఎస్ నాయకులు శునాకానందం పొందుతున్నారు.
సరైన సమయంలో ఏం చేయాలో మాకు తెలుసు.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్న వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారా?
రాష్ట్ర ఖజానా దోచుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నారు?
వాళ్లపై వస్తున్న ఆరోపణలు తప్పించుకునేందుకు మాపై ఆరోపణలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది.
అనర్హతకి సంబంధించి ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతా.
దోచుకున్న డబ్బు దాచుకోవడానికి కేటీఆర్ విదేశాలకు వెళ్లారు.
బీఆర్ఎస్ పార్టీలో ఓడిన వాళ్ళకి విశ్వాసం లేదు.
గెలిచిన వాళ్ళకి విశ్వాసం లేదు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేయాలో అర్థం కాక భయపడుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగలరు.
-
2024-09-10T13:40:17+05:30
పోటెత్తిన ఏలేరు వదర
కాకినాడ: 216వ జాతీయ రహదారిపైకి పోటెత్తిన ఏలేరు వరద.
పిఠాపురం బైపాస్ రోడ్డు, గొల్లప్రోలు టోల్గేట్, గొల్లప్రోలు బైపాస్ రోడ్డులో 1.5కిలోమీటర్ల మేర ఐదు చోట్ల ప్రవహిస్తున్న వరద నీరు.
జాతీయ రహదారిపై పిఠాపురం బైపాస్ రోడ్డు నుంచి గొల్లప్రోలు బైపాస్ రోడ్డు వరకు ఒకవైపు రాకపోకలు నిలిపివేత.
పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసుల పహారా.
-
2024-09-10T10:58:31+05:30
జనసేన పార్టీ జెండాపై మూత్రం పోసిన వైసీపీ నాయకుడు..
ఏలూరు జిల్లా : నూజివీడు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాను వైసీపీ నాయకుడు అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఆగిరిపల్లి సెంటర్‌లో అర్ధరాత్రి మద్యం సేవించి ఫార్చునర్ కారులో వెళుతూ రివర్స్ వచ్చి రోడ్డు ప్రక్కన పార్కింగ్ చేసిన స్థానిక జనసేన నాయకుని కారుపై వున్న పార్టీ జెండాపై మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందిన వైసీపీ యూత్ లీడర్ బెజవాడ హార్ష.
వైసీపీ నాయకులు పలు రకాలుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఆగ్రహావేశాలకు గురికాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన పార్టీ కార్యకర్తలు.
పార్టీ జెండాను ఘోరంగా అవమానించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలం.
దీంతో జిల్లాల వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ముకుమ్మడి ఫిర్యాదుల కార్యక్రమాన్ని చేపట్టెందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న జన సైనికులు.
డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ ఫోటోతో కూడిన పార్టీ జెండా అవమానానికి గురైనా, నిందుతుడిని కాపాడేందుకు కొందరు కూటమి నాయకులు రాజీ చర్చలకు దిగడాన్ని తట్టుకోలేకపోతున్న పవన్ అభిమానులు.
-
2024-09-10T10:21:16+05:30
తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్..
హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి పరుగులు పెట్టనున్న మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్.
సికింద్రాబాద్ - నాగ్ పూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.
ఈ నెల 15వ తేదీన వర్చువల్‌గా సికింద్రాబాద్ - నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపనున్న మోదీ.
తెలుగు రాష్ట్రాల నుంచి నడుస్తున్న నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.
సికింద్రాబాద్ - విశాఖ పట్నం మధ్య రెండు, సికింద్రాబాద్ - తిరుపతి, కాచి గూడ - యశ్వంత్ పూర్ మధ్య నడుస్తున్న ఒక్కో రైలు.
సికింద్రాబాద్ - నాగ్ పూర్ వందే భారత్‌తో 578 కిలోమీటర్ల దూరాన్ని 7:15 గంటల్లో చేరిక.
ప్రతి రోజూ ఉదయం 5గం.లకు - మధ్యాహ్నం 12:15 లకు నాగ్ పూర్ - సికింద్రాబాద్.
మధ్యాహ్నం 1 గం నుంచి రాత్రి 8:20 కి నాగ్‌పూర్ చేరుకోనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్.
కాజీపేట, రామగుండం, బలహర్షా, చంద్రాపూర్, సేవ గ్రామ్ స్టేషన్ మీదుగా నాగ్‌పూర్ చేరుకోనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్.
మరో వందే భారత్‌తో తెలంగాణ - మహారాష్ట్ర మధ్య మెరుగుపడనున్న రవాణా.
-
2024-09-10T09:18:26+05:30
హుసేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ
TS High Court: హుసేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ.
హుసేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దనే గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరిన పిటిషనర్.
హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్.
హుసేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని కోరిన పిటిషనర్.
హుసేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గత ఏడాది హైకోర్టు ఆదేశాలు.
కోర్ట్ ఆదేశాలు అమలు చేయడం లేదని మరోసారి కోర్టును ఆశ్రయించిన పిటిషనర్.
నేడు విచారణ చేసి ఆదేశాలు ఇవ్వనున్న న్యాయస్థానం.
-
2024-09-10T08:56:16+05:30
రెండో రోజు రాష్ట్రంలో పర్యటించనున్న 16వ ఆర్థిక సంఘం.
మంగళవారం 12 గంటలకు ప్రజా భవన్‌లో సంఘం చైర్మన్ అర్వింద్ పణగారియా, సభ్యులతో భేటీ కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు.
అనంతరం ప్రజాభవన్‌లో ఆర్థిక సంఘం మీడియా సమావేశం.
కేంద్రం నుండి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల పెంపు విషయంలో ఆర్దిక సంఘాన్ని కోరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించాలని కోరనున్న ప్రభుత్వం.
వర్షాలు, కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుల నిధులను పెంచాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయం.
అదేవిధంగా రాష్ట్రాలకు పన్నుల ఆదాయం విషయంలో కూడా మార్పులు చేయాలని తెలియజేయనున్న సీఎం.
-
2024-09-10T08:54:06+05:30
కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చేనా?
ఢిల్లీ లిక్కర్ సిబిఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ నేడు సుప్రింకోర్టు తీర్పు.
తీర్పు వెల్లడించనున్న జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం.
ఢిల్లీ లిక్కర్ సిబిఐ కేసులో కేజ్రివాల్ బెయిల్‌పై నెలకొన్న ఉత్కంఠ?
ఇటీవల ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో కేజ్రివాల్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు .
సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో తీహార్ జైల్లోనే ఉన్న సిఎం కేజ్రీవాల్.
జూన్ 26 వ తేదీన కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సిబిఐ.