-
-
Home » Mukhyaamshalu » Today Latest Breaking News and Live updates Live in Telugu 26th December 2024
-
Today Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Dec 26 , 2024 | 10:49 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2024-12-26T16:45:46+05:30
బీసీ కులగణనపై బీజేపీ వైఖరి చెప్పాలి: కవిత
బీసీల హామీలు, కామారెడ్డి డిక్లరేషన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదు?
బీసీలంటే బీజేపీకి లెక్క లేదా?
బీసీల సంక్షేమాన్ని గాలికొదిలేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసిన శాలివాహన, అరెకటిక సంఘం నేతలు.
-
2024-12-26T16:40:39+05:30
ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు బెయిల్..
బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నాంపల్లి 3వ అడిషనల్ మేజిస్ట్రేట్ శ్రీనివాస్‌కు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది.
రూ. 5 వేల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు.
విచారణకు సహకరించాలని కోరిన న్యాయస్థానం.
షరతులతో కూడిన బెయిల్ మంజూరు.
-
2024-12-26T12:38:09+05:30
వైఎస్ జగన్ ఆఫీస్ వద్ద ఉద్రిక్త.. అద్దాలు ధ్వంసం..
కడప: పులివెందులలో మాజీ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొందది.
జగన్ నిర్వహించిన ప్రజా దర్భార్‌కు ప్రజలు పోటెత్తారు.
భారీగా జనం రావడంతో ఉద్రిక్తత నెలకొంది.
తోపులాట జరగడంతో కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.
ప్రజలను కంట్రోల్ చేయలేక రోప్ తెచ్చి అదుపు చేశారు పోలీసులు.
-
2024-12-26T12:20:41+05:30
యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలి - నాగార్జున
ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే..
సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది - నాగార్జున
హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక - నాగార్జున
చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు- శ్యాంప్రసాద్ రెడ్డి
-
2024-12-26T12:16:49+05:30
అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు - రాఘవేంద్రరావు
ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది..
దిల్ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నా..
తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయి -రాఘవేంద్రరావు
గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో చేశారు.. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను..హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నాం - రాఘవేంద్రరావు
-
2024-12-26T11:47:49+05:30
సినిమా ప్రమోషన్స్ సమయంలో పోలీసులు అనుమతి నిరాకరిస్తే , దాని పాటించాలి - పోలీసులు
పోలీసులు అన్ని రకాలుగా ఆలోచించే అనుమతి ఇవ్వలా..? వద్దా..? అనేది నిర్ణయం తీసుకుంటారు - పోలీసులు
పోలీసులు నిర్ణయాన్ని గౌరవించాలని కోరిన డీజీపీ
బౌన్సర్లు నియమించుకున్నప్పుడు న్యాయ సమ్మతం ఉండాలి..
ఇటివల వారి వారి ప్రవర్తన బాగులేదన్న పోలీసులు
ఏ ఈవెంట్ కైనా ముందోస్తు అనుమతులు తీసుకోవాలి, అన్ని పరిశీలించిన తరువాతే పోలీసులు నిర్ణయం తీసుకుంటారు..
-
2024-12-26T11:26:35+05:30
ఇండస్ట్రీకి సపోర్ట్‌గా ప్రభుత్వం ఉంటుంది.
శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి
బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటాం.
అభిమానులను కంట్రోల్ చేసుకునే బాధ్యత సెలబ్రిటీలదే: సీఎం రేవంత్ రెడ్డి
డ్రగ్స్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలి.
బెనిఫిట్ షోలు ఉండవు.. అసెంబ్లీలో చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నా: సీఎం రేవంత్ రెడ్డి
-
2024-12-26T11:23:09+05:30
టాలీవుడ్‌తో చర్చల్లో ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవే..
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారంలో సినీ పరిశ్రమ సహకరించాలి
సినిమా టికెట్లపై విధించే సెస్సును..
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వెచ్చించనున్న ప్రభుత్వం
కులగణన సర్వేలో సినీ హీరోలు పాల్గొనాలి
సినిమా టికెట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చు
బెనిఫిట్ షోలు, స్పెషల్ టికెట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చు
-
2024-12-26T11:21:15+05:30
సిఎం రేవంత్ రెడ్డితో కొనసాగుతున్న సినిమా పెద్దల సమావేశం
సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ దృశ్యాలు సినిమా పెద్దలకు స్క్రీన్ పై వేసి చూపించిన పోలీస్ లు
ఘటన పై సిఎం వద్ద విచారం వ్యక్తం చేసిన సినిమా పెద్దలు
-
2024-12-26T10:57:27+05:30
టాలీవుడ్ ప్రముఖుల ముందు ప్రభుత్వ ప్రతిపాదనలివేనా?
యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌కు సహకరించాలి.
ప్రచార కార్యక్రమాలలో సినిమా హీరోలే ఉండాలి.
టికెట్ల ధరలపై విధించే సెస్‌ను..ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు వినియోగించాలి
కులగణన సర్వేపై ప్రచారానికి రావాలి
ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఇండస్ట్రీ సహకారం కావాలి.
ఇకపై ర్యాలీలు నిషేధించాలి..
వంటి ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు వివరించనున్నారు.
-
2024-12-26T10:55:07+05:30
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్..
శాంతియుతంగా.. ఆమోదయోగ్యంగా..ఘర్షణలు లేకుండా నిజాయితీగా మహా రాష్ట్ర ఎన్నికలు జరగాలని గతం శ్రీవారిని కోరుకున్నా.. -గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో స్వామి వారిని దర్శించుకున్నా..-గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
ఆ దేవ దేవుడిని ప్రజలు ఎలా అయినా ప్రార్థించవచ్చు..ఆ స్వేచ్ఛను భగవంతుడు మనకు ఇచ్చాడు.. -గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
మహిళల పై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి..
కఠినమైన శిక్షల అమలు చేస్తే నేరాలు చేయాలని అనుకునే వారి వెన్నులో వణుకు పుడుతుంది.. -గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
తప్పు ఎవరు చేసిన కఠిన శిక్షలు విధిస్తేనే..మహిళలకు నిజమైన రక్షణ కల్పించిన వారు అవుతాం..రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్..-గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
-
2024-12-26T10:49:37+05:30
సినీ ప్రముఖులతో సీఎం సమావేశం
కమాండ్ కంట్రోల్ కు చేరుకున్న సినీ ప్రముఖులు
కమాండో కంట్రోల్ కు చేరుకున్న నాగార్జున, వెంకటేశ్ , నితిన్ , కిరణ్ అబ్బవరం,సిద్ధూ జొన్నలగడ్డ
కమాండ్ కంట్రోల్ కు చేరుకున్న దర్శకులు త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీపైడిపల్లి,అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్ , హరీశ్ శంకర్ , ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట
కమాండ్ కంట్రోల్ కు చేరుకున్న నిర్మాతలు అల్లు అరవింద్ , సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, సి.కళ్యాణ్ , గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్ , కె.ఎల్ నారాయణ, మైత్రీ రవి, నవీన్