Chennai: చెన్నై సమీపంలో వెయ్యి కిలోల బంగారం స్వాధీనం
ABN , Publish Date - Apr 15 , 2024 | 02:37 AM
చెన్నై సమీప కుండ్రత్తూర్ వద్ద మినీ లారీలో తరలించిన 1,000 కిలోల బంగారు కడ్డీలను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 425 కిలోల
చెన్నై, ఏప్రిల్14 (ఆంధ్రజ్యోతి): చెన్నై సమీప కుండ్రత్తూర్(Kundrathur) వద్ద మినీ లారీలో తరలించిన 1,000 కిలోల బంగారు(Gold) కడ్డీలను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 425 కిలోల బంగారు కడ్డీలకు సంబంధించి రసీదులు, ఆధారపత్రాలు ఉండడంతో తిరిగి ఇచ్చేశారు. శ్రీ పెరుంబుదూర్ లోక్‌సభ నియోకవర్గ పరిధిలో కుండ్రత్తూర్ జంక్షన్‌లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కుండ్రత్తూర్ నుంచి శ్రీ పెరుంబుదూర్‌కు వెళ్తున్న మినీ లారీని ఆపి తనిఖీ చేసి బంగారు కడ్డీలు గుర్తించారు. లారీలో ప్రయాణిస్తున్న వారిని విచారించగా, చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీ పెరుంబుదూర్ సమీపం మాండూరు పంచాయతీలో ఉన్న ఓ గోడౌన్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు.