Lok Sabha Members Oath:ఎంపీల ప్రమాణ స్వీకారం.. ఏపీ నుంచి ఆ ఎంపీ డుమ్మా..
ABN , First Publish Date - Jun 24 , 2024 | 09:51 AM
18వ లోక్‌సభ తొలిసమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రెండు రోజులు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు.
Live News & Update
-
2024-06-24T15:45:41+05:30
కొనసాగుతున్న ఎంపీల ప్రమాణం
పూర్తైన ఢిల్లీ ఎంపీల ప్రమాణ స్వీకారం
ఎంపీగా ప్రమాణం చేసిన దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్
సంస్కృతంలో ప్రమాణం చేసిన బన్సూరి స్వరాజ్
ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు
ఏడు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ
-
2024-06-24T15:36:18+05:30
కొనసాగుతున్న ఎంపీల ప్రమాణం
ఛత్తీస్‌ఘడ్ ఎంపీల ప్రమాణ స్వీకారం పూర్తైంది.
దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ ఎంపీలు ప్రమాణం పూర్తి చేశారు.
దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ తర్వాత ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా ఎంపీలు ప్రమాణం చేస్తారు.
-
2024-06-24T15:25:57+05:30
కొనసాగుతున్న ఎంపీల ప్రమాణం
బీహార్ ఎంపీల ప్రమాణం పూర్తైంది.
ఛండీఘడ్‌కు చెందిన ఏకైక ఎంపీ మనీష్‌తివారీ ప్రమాణ స్వీకారం చేశారు.
ఛత్తీస్‌గడ్ ఎంపీల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది.
-
2024-06-24T15:11:28+05:30
ప్రమాణ పత్రం చూడకుండా..
బీహార్‌లొని సమస్తిపూర్ ఎంపీ లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్)కు చెందిన శాంభవి ప్రమాణ పత్రం చూడకుండానే ప్రమాణం చేశారు.
శాంభవి కాంగ్రెస్ అభ్యర్థి సన్ని హజరీపై సమస్తిపూర్ నుంచి విజయం సాధించారు.
-
2024-06-24T14:49:07+05:30
కొనసాగుతున్న ఎంపీల ప్రమాణం..
బీహార్ ఎంపీల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది.
బీహార్ తర్వాత ఛండీఘడ్, ఛత్తీస్‌ఘడ్ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఇప్పటివరకు బీహార్ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ప్రమాణం చేశారు. ఇంకా 32 మంది ప్రమాణం చేయాల్సి ఉంది.
-
2024-06-24T14:41:34+05:30
కొనసాగుతున్న ఎంపీల ప్రమాణం..
అస్సాం ఎంపీల ప్రమాణం పూర్తికావడంతో బీహార్ రాష్ట్రానికి చెందిన లోక్‌సభ సభ్యుల ప్రమాణం జరుగుతోంది.
బీహార్‌కు చెందిన ఎంపీలతో ప్యానల్ స్పీకర్ రాధా మోహన్ సింగ్ ప్రమాణం చేయిస్తున్నారు.
బీహార్ నుంచి మొదటిగా వాల్మికీనగర్ ఎంపీ సునీల్ కుమార్ ప్రమాణం చేశారు.
-
2024-06-24T14:33:22+05:30
కొనసాగుతున్న ఎంపీల ప్రమాణం..
అస్సాం ఎంపీల ప్రమాణ స్వీకారం పూర్తైంది.
రాష్ట్రాలవారీ అక్షర క్రమంలో ఎంపీ ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది.
ప్యానల్ స్పీకర్ రాధామోహన్ సింగ్ సభ్యులతో ప్రమాణం చేయిస్తున్నారు.
విపక్షాల నుంచి ప్యానల్ స్పీకర్లుగా నియమించిన సభ్యులు ప్రమాణం చేయకపోవడంతో బీజేపీ సభ్యుడు రాధామోహన్ సింగ్ ఒకరే ప్యానల్ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు.
-
2024-06-24T14:23:34+05:30
కొనసాగుతున్న ఎంపీల ప్రమాణం..
అరుణాచల్ ప్రదేశ్ ఎంపీల ప్రమాణ స్వీకారం పూర్తైంది.
కొనసాగుతున్న అస్సాం ఎంపీల ప్రమాణం
-
2024-06-24T14:22:12+05:30
ఎంపీగా ప్రమాణం చేయని అవినాష్ రెడ్డి..
కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయలేదు.
అవినాష్ రెడ్డి సభకు హాజరుకాకపోవడంతో ప్రమాణం చేయలేకపోయారు.
వైసీపీ నుంచి నలుగురు ఎంపీలు ఎన్నిక కగా.. ముగ్గురు మాత్రమే ప్రమాణం చేశారు.
ఏపీ నుంచి మొత్తం 25 మంది ఎంపీలు ఉండగా.. తొలిరోజు 24మంది ఎంపీలు ప్రమాణం చేశారు.
-
2024-06-24T14:20:17+05:30
ఆంధ్రప్రదేశ్ ఎంపీల ప్రమాణం
తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి తెలుగులో ప్రమాణం చేశారు.
రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు.
చిత్తూరు టీడీపీ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలుగులో ప్రమాణం చేశారు.
-
2024-06-24T14:15:03+05:30
ఆంధ్రప్రదేశ్ ఎంపీల ప్రమాణ స్వీకారం
బాపట్ల టీడీపీ ఎంపీ కృష్ణప్రసాద్ సంస్కృతంలో ప్రమాణం చేశారు.
ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇంగ్లీషులో ప్రమాణం చేశారు.
నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి తెలుగులో ప్రమాణం చేశారు.
కర్నూలు టీడీపీ ఎంపీ బి నాగరాజు తెలుగులో ప్రమాణం చేశారు.
అనంతపురం టీడీపీ ఎంపీ లక్ష్మినారాయణ వాల్మికి తెలుగులో ప్రమాణం చేశారు.
హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పార్థసారధి తెలుగులో ప్రమాణం చేశారు.
నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు.
-
2024-06-24T14:08:38+05:30
వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌సభ
వాయిదా అనంతరం లోక్‌సభ ప్రారంభమైంది.
18వ లోక్‌సభకు ఎన్నికైన కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది.
-
2024-06-24T13:07:50+05:30
లోక్‌సభ వాయిదా..
18వ లోక్‌సభ తొలిరోజు ఎంపీల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ప్రమాణం తర్వాత ప్రొటెం స్పీకర్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.
-
2024-06-24T13:05:41+05:30
ఆంధ్రప్రదేశ్ ఎంపీల ప్రమాణం..
మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలుగులో ప్రమాణం చేశారు.
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) తెలుగులో ప్రమాణం చేశారు.
నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తెలుగులో ప్రమాణం చేశారు.
-
2024-06-24T12:58:26+05:30
ఆంధ్రప్రదేశ్ ఎంపీల ప్రమాణం..
అమలాపురం టీడీపీ ఎంపీ గంటి హరీష్ బాలయోగి ఇంగ్లీషులో ప్రమాణం చేశారు.
రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలుగులో ప్రమాణం చేశారు.
ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఇంగ్లీషులో ప్రమాణం చేశారు.
-
2024-06-24T12:54:01+05:30
ఆంధ్రప్రదేశ్ ఎంపీల ప్రమాణం..
విశాఖపట్టణం టీడీపీ ఎంపీ శ్రీభరత్ ఎంపీగా తెలుగులో ప్రమాణం చేశారు.
అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇంగ్లీషులో ప్రమాణం చేశారు.
కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్(టీ టైమ్ ఉదయ్) ఆంగ్లంలో ప్రమాణం చేశారు.
-
2024-06-24T12:51:10+05:30
ఆంధ్రప్రదేశ్ ఎంపీల ప్రమాణం..
ఏపీ ఎంపీల ప్రమాణ స్వీకారం మొదలైంది
మొదటగా అరకు వైసీపీ ఎంపీ తనూజరాణి హిందీలో ప్రమాణం చేశారు.
విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలుగులో ప్రమాణం చేశారు.
-
2024-06-24T12:47:00+05:30
అండమాన్ ఎంపీ ప్రమాణం
అండమాన్ ఎంపీ బిష్ణుపదరాయ్ ఎంపీగా ప్రమాణం చేశారు.
-
2024-06-24T12:46:40+05:30
ఎంపీలుగా కేంద్రమంత్రుల ప్రమాణం పూర్తి..
ఎంపీగా కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మహోల్ రాజీనామాతో కేంద్రమంత్రుల ప్రమాణం పూర్తైంది. అక్షర క్రమంలో రాష్ట్రాల వారీ ఎంపీల ప్రమాణం ప్రారంభమైంది.
-
2024-06-24T12:41:14+05:30
ఎంపీలుగా కేంద్ర సహాయ మంత్రుల ప్రమాణం
ఎంపీలుగా కేంద్ర సహాయ మంత్రులు రాజ్‌భూషణ్ చౌదరి, హర్ష మల్హోత్రా, నీమూబెన్ జయంతిబాయ్ ప్రమాణం
ఎంపీగా నరసాపురం ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రమాణం
తెలుగులో ప్రమాణం చేసిన శ్రీనివాస వర్మ
నరసాపురం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన శ్రీనివాసవర్మ
తొలిసారి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా అవకాశం
-
2024-06-24T12:36:06+05:30
ఎంపీలుగా కేంద్ర సహాయ మంత్రుల ప్రమాణం
ఎంపీలుగా కేంద్ర సహాయ మంత్రులు కమలేష్ పాశ్వాన్, భగీరథ్ చౌదరి, సంజయ్ షేఠ్, దుర్గాదాస్ ప్రమాణం
ఎంపీగా కేంద్ర సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే ప్రమాణం
ఎంపీలుగా కేంద్ర సహాయ మంత్రులు సుకాంత మజుందార్, సావిత్రి ఠాకూర్, తోకన్ సాహు ప్రమాణం
-
2024-06-24T12:26:16+05:30
ఎంపీ బండి సంజయ్ ప్రమాణం
ఎంపీగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రమాణం
కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నిక
తెలుగులో ప్రమాణం చేసిన బండి సంజయ్
కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్
-
2024-06-24T12:22:53+05:30
ఎంపీలుగా కేంద్ర సహాయ మంత్రుల ప్రమాణం
ఎంపీలుగా కేంద్ర సహాయ మంత్రులు ప్రొఫెసర్ ఎస్ పి సింగ్ భగేల్, శోభా కరంద్లాజే, కీర్తి వర్థన్ సింగ్ ప్రమాణం
ఎంపీలుగా కేంద్ర సహాయ మంత్రులు శాంతను ఠాకూర్, సురేష్ గోపి, అజయ్ టమ్టా ప్రమాణం
-
2024-06-24T12:15:38+05:30
గుంటూరు ఎంపీ పెమ్మసాని ప్రమాణం
ఎంపీగా కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణం
తెలుగులో ప్రమాణం చేసిన పెమ్మసాని చంద్రశేఖర్
తొలిసారిగా ఎంపీగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు నుంచి టీడీపీ తరపున గెలిచిన పెమ్మసాని
-
2024-06-24T12:09:04+05:30
ఎంపీలుగా కేంద్ర సహాయ మంత్రుల ప్రమాణం
ఎంపీలుగా కేంద్ర సహాయ మంత్రులు జితిన్ ప్రసాద్, శ్రీపాద యశో నాయక్, పంకజ్ చౌదరి ప్రమాణం
ఎంపీలుగా కేంద్ర సహాయ మంత్రులు కృష్ణపాల్, నిత్యానందరాయ్, అనుప్రియ పటేల్, వి.సోమన్న ప్రమాణం
-
2024-06-24T12:01:43+05:30
ఎంపీలుగా కేంద్రమంత్రుల ప్రమాణం
ఎంపీగా కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రమాణం
ఎంపీగా కేంద్రమంత్రి ప్రతాప్ రావ్ గణపతి రావు జాదవ్ ప్రమాణం
-
2024-06-24T11:57:07+05:30
ఎంపీలుగా కేంద్రమంత్రుల ప్రమాణం
ఎంపీలుగా కేంద్రమంత్రులు చిరాగ్ పాశ్వాన్, సీఆర్ పాటిల్ ప్రమాణం
ఎంపీలుగా కేంద్రమంత్రులు రావ్ ఇంద్రజిత్ సింగ్, డాక్టర్ జితేంద్రసింగ్
-
2024-06-24T11:51:11+05:30
ఎంపీలుగా కేంద్రమంత్రుల ప్రమాణం
ఎంపీగా కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవియా ప్రమాణం
కేంద్రమంత్రిగా గంగాపురం కిషన్ రెడ్డి ప్రమాణం
తెలుగులో ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి
రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి
-
2024-06-24T11:46:42+05:30
ఎంపీలుగా కేంద్రమంత్రుల ప్రమాణం
ఎంపీగా ప్రమాణం చేసిన గజేంద్రసింగ్ షెకావత్
ఎంపీగా ప్రమాణం చేసిన కేంద్రమంత్రి అన్నపూర్ణదేవి
ఎంపీగా ప్రమాణం చేసిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
-
2024-06-24T11:42:50+05:30
ఎంపీలుగా కేంద్రమంత్రుల ప్రమాణం
ఎంపీలుగా ప్రమాణం చేసిన కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, జువల్ ఓరం, గిరిరాజ్ సింగ్
ఎంపీగా ప్రమాణం చేసిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా
ఎంపీగా ప్రమాణం చేసిన కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్
-
2024-06-24T11:37:35+05:30
ఎంపీగా రామ్మోహన్ నాయుడు ప్రమాణం..
ఎంపీగా ప్రమాణం చేసిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
తెలుగులో ప్రమాణం చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు
మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు
-
2024-06-24T11:35:27+05:30
ఎంపీలుగా కేంద్రమంత్రుల ప్రమాణం
ఎంపీగా ప్రమాణం చేసిన కేంద్ర పోర్టులు, ఓడరేవుల శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్
ఎంపీగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రమాణం
-
2024-06-24T11:27:35+05:30
ఎంపీలుగా కేంద్రమంత్రుల ప్రమాణం
ఎంపీగా ప్రమాణం చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్
ఒడియాలో ప్రమాణం చేసిన ధర్మేంద్ర ప్రదాన్
ఎంపీగా ప్రమాణం చేసిన కేంద్రమంత్రి జితన్ రామ్
ఎంపీగా ప్రమాణం చేసిన రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్)
-
2024-06-24T11:24:08+05:30
ఎంపీలుగా కేంద్రమంత్రుల ప్రమాణం
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఎంపీగా ప్రమాణం చేశారు
కర్ణాటకకు చెందిన కుమారస్వామి తన మాతృభాష కన్నడలో ప్రమాణం చేశారు
కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఎంపీగా ప్రమాణం చేశారు.
-
2024-06-24T11:21:14+05:30
ఎంపీలుగా కేంద్రమంత్రుల ప్రమాణం..
ఎంపీగా మాజీ సీఎం, విదిశ ఎంపీ శివరాజ్‌సింగ్ చౌహన్ ప్రమాణం
ఎంపీగా ప్రమాణం చేసిన హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్
-
2024-06-24T11:17:23+05:30
ఎంపీలుగా కేంద్రమంత్రుల ప్రమాణం..
ప్రధాని మోదీ తర్వాత ప్యానల్ స్పీకర్లు ప్రమాణం చేశారు
ఆ తర్వాత కేంద్రమంత్రులు ప్రమాణం చేశారు
కేంద్రమంత్రుల్లో రాజ్‌నాధ్ సింగ్ మొదటిగా ప్రమాణం చేశారు
రాజ్‌నాధ్ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమాణం చేశారు.
అమిత్ షా తర్వాత నితిన్ గడ్కరీ ఎంపీగా ప్రమాణం చేశారు.
-
2024-06-24T11:13:04+05:30
ప్రమాణానికి దూరంగా..
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విపక్షాల నుంచి ప్యానల్ స్పీకర్లుగా నియమితులైన ఎంపీలు హాజరుకాలేదు
మోదీ తర్వాత విపక్షాలకు చెందిన ప్యానల్ స్పీకర్ పేర్లను పిలిచిన లోక్‌సభ సెక్రటరీ జనరల్
ప్రొటెం స్పీకర్ నియమాకం విషయంలో విపక్షాల అసంతృప్తి
-
2024-06-24T11:09:34+05:30
ఎంపీగా మోదీ ప్రమాణం..
లోక్‌సభలో ప్రారంభమైన ఎంపీల ప్రమాణ స్వీకారం
లోక్‌సభలో మొదట ప్రమాణం చేసిన ప్రధాని మోదీ
-
2024-06-24T11:05:22+05:30
సమావేశాలు ప్రారంభం
లోక్‌సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం ప్రారంభం
సమావేశాలు ప్రారంభించిన ప్రొటెం స్పీకర్
రాహుల్ రాజీనామా ఆమోదం పొందిందని ప్రకటించిన ప్రొటెం స్పీకర్
వయనాడ్ నుంచి ఎంపీగా రాజీనామా చేసిన రాహుల్
-
2024-06-24T11:02:04+05:30
లోక్‌సభ సమావేశాలు ప్రారంభం..
18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభం
సభకు హాజరైన ఎంపీలు
మొదటి వరుసలో మోదీ, రాజ్‌నాధ్, గడ్కరీ, అమిత్ షా
-
2024-06-24T10:58:06+05:30
పార్లమెంట్‌కు చేరుకున్న సోనియా..
కాంగ్రెస్ పార్లమెంటరీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ పార్లమెంట్‌కు చేరుకున్నారు.
సోనియా తర్వాత కాంగ్రెస్ సభ్యులు పార్లమెంట్‌కు చేరుకుంటున్నారు
-
2024-06-24T10:50:30+05:30
సైకిల్‌పై పార్లమెంట్‌కు..
విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లారు
సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అప్పలనాయుడు ఎంపీగా ఎదిగారు
పార్లమెంట్‌కు వెళ్లే ముందు అప్పలనాయుడు తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు
-
2024-06-24T10:45:00+05:30
లోక్‌సభ ప్రారంభానికి ముందు మోదీ..
18వ లోక్‌సభ తొలి సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ బయట మీడియాతో మోదీ
18వ లోక్‌సభ సమావేశాల్లో విపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి
వికసిత భారత్ లక్ష్యంతో ముందుకు సాగుదాం
ఎమర్జెన్సీ పేరుతో భారత ప్రజాస్వామ్యంపై పడిన మచ్చకు రేపటితో 50 ఏళ్లు
50 ఏళ్ల క్రితం జరిగిన తప్పు మళ్లీ జరగకూడదు.
ప్రజల కోసం సభ్యులు పనిచేయాలి
నినాదాలు ప్రజలకు అవసరం లేదు
ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి
-
2024-06-24T10:28:52+05:30
తొలిరోజే ఎపీ ఎంపీలు..
ఏపీకి చెందిన ఎంపీలు తొలి రోజే ప్రమాణ స్వీకారం చేస్తారు.
రెండో రోజు తెలంగాణకు చెందిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.
26వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది
-
2024-06-24T10:23:38+05:30
ఎంపీల ప్రమాణ స్వీకారం ఇలా..
మొదట అండమాన్ నికోబార్, తర్వాత ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.
మొదటి రోజు 279 మంది ఎంపీలు ప్రమాణం చేస్తారు
మిగిలిన 264 మంది లోక్‌సభ ఎంపీలు రెండో రోజు ప్రమాణస్వీకారం చేస్తారు.
ఒక ఎంపీ ప్రమాణ స్వీకారానికి దాదాపు ఒక నిమిషం సమయం పడుతుంది.
-
2024-06-24T10:21:13+05:30
ప్రమాణ స్వీకారం ఇలా..
ప్రధాని మోదీ తర్వాత కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
కేబినెట్ మంత్రుల తర్వాత.. ఇండిపెండెంట్ బాధ్యత కలిగిన సహాయ మంత్రులు ప్రమాణం చేస్తారు.
మంత్రుల ప్రమాణం పూర్తైన తర్వాత ఎంపీల ప్రమాణం రాష్ట్రాల వారీ అక్షర క్రమంలో ఉంటుంది.
-
2024-06-24T10:13:52+05:30
ప్రొటెం స్పీకర్ ప్రమాణం
ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన భర్తృహరి మహతాబ్
భర్తృహరి మహతాబ్‌తో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు
-
2024-06-24T10:02:58+05:30
ప్రొటెం స్పీకర్‌కు అభినందనలు..
ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్‌ను కలిసిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు
ప్రొటెం స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలిపిన కిరణ్ రిజిజు
-
2024-06-24T09:57:13+05:30
తొలి వ్యక్తి మోదీ..
18వ లోక్‌సభలో మొదట ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేస్తారు.
మోదీ తర్వాత కేంద్రమంత్రులు, కేంద్ర సహాయ మంత్రులు ప్రమాణం చేస్తారు.
కేంద్ర మంత్రుల ప్రమాణం తర్వాత ప్రతిపక్ష నేత ప్రమాణ స్వీకారం చేస్తారు.
-
2024-06-24T09:51:21+05:30
కాసేపట్లో లోక్‌సభ సమావేశాలు..
18వ లోక్‌సభ తొలి సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి
18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఎంపీలతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్