Haryana: హర్యానాలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి..?
ABN , Publish Date - May 18 , 2024 | 10:10 AM
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. హర్యానాలో గల నుహ్ వద్ద కుంద్లీ మనేసర్ పల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే పై ఓ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదం సమయంలో బస్సులో 64 మంది ఉన్నారు. వారంతా బృందావనంలో శ్రీకృష్ణుడిని దర్శించుకొని తిరిగి వస్తున్నారు.
చండీఘడ్: హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. హర్యానాలో గల నుహ్ వద్ద కుంద్లీ మనేసర్ పల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే పై ఓ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదం సమయంలో బస్సులో 64 మంది ఉన్నారు. వారంతా బృందావనంలో శ్రీకృష్ణుడిని దర్శించుకొని తిరిగి వస్తున్నారు. ఇంతలో ప్రమాదం జరిగి 8 నుంచి 10 మంది వరకు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను నుహ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
‘బృందావనం నుంచి వస్తోన్న యాత్రికుల బస్సు ప్రమాదానికి గురయ్యింది. బస్సులో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిలో వృద్దులు, మహిళలు, పిల్లలు ఉన్నారు. ప్రమాద స్థలం బీతావాహంగా మారింది అని’ నుహ్ ఎమ్మెల్యే అఫ్తాబ్ అహ్మద్ తెలిపారు.
‘బస్సుకు మంటలు ఎలా అంటుకున్నాయో తెలియదు. బస్సులో మొత్తం 64 మంది ఉన్నాం. 10 మంది వరకు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు అని’ క్షతగాత్రురాలు ఒకరు మీడియాకు వివరించారు.
Read Latest National News and Telugu News