Share News

Doctor: ఐదేళ్లుగా సహజీవనం.. పెళ్లికి నో.. ఏం జరిగిందంటే..!!

ABN , Publish Date - Jul 02 , 2024 | 04:34 PM

కొందరిలో నేర ప్రవృత్తి పెరుగుతోంది. ఏదైనా తమకు దక్కలేదంటే చాలు ఉగ్రరూపం చూపిస్తున్నారు. ఆ కోవలో చదువుకున్న వారు, ప్రొఫెషన్స్, వైద్యులు కూడా ఉంటున్నారు. బీహార్‌లో ఓ వైద్యురాలు ఇలానే చేశారు. పెళ్లి చేసుకోవడానికి బాయ్ ఫ్రెండ్ నో అనడంతో తన విశ్వరూపాన్ని చూపించారు.

Doctor: ఐదేళ్లుగా సహజీవనం.. పెళ్లికి నో.. ఏం జరిగిందంటే..!!
Doctor

పాట్నా: కొందరిలో నేర ప్రవృత్తి పెరుగుతోంది. ఏదైనా తమకు దక్కలేదంటే చాలు ఉగ్రరూపం చూపిస్తున్నారు. ఆ కోవలో చదువుకున్న వారు, ప్రొఫెషన్స్, వైద్యులు కూడా ఉంటున్నారు. బీహార్‌లో ఓ వైద్యురాలు ఇలానే చేశారు. పెళ్లి చేసుకోవడానికి బాయ్ ఫ్రెండ్ నో అనడంతో తన విశ్వరూపాన్ని చూపించారు.


ఏం జరిగిందంటే..?

హజిపూర్‌కు చెందిన యువతి మెడిసిన్ పూర్తి చేశారు. మధురలో ప్రాక్టీస్ చేస్తున్నారు. గత ఐదేళ్ల నుంచి ఓ యువకుడితో ప్రేమాయణం సాగిస్తున్నారు. అతను మధుర బ్లాక్ 12వ వార్డ్ కౌన్సిలర్. సహ జీవనానికి ఓకే అన్న కౌన్సిలర్, పెళ్లి మాత్రం నో అంటున్నాడు. ఇలా కాదు అని రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని అతనితో చెప్పింది. ఆ సమయానికి సరేనని వెళ్లి పోయాడు. తీరా రిజిస్ట్రేషన్ మ్యారేజ్‌ కోసం మాత్రం రాలేదు. దీంతో ఆ వైద్యురాలు కోపం నషాళానికి ఎక్కింది.


Lok Sabha Updates: రాహుల్ ప్రసంగంపై వివాదం.. ఆ వ్యాఖ్యలు తొలగింపు..

ఫోన్ చేసి పిలిచి

ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్‌కు డాక్టర్ ఫోన్ చేసింది. ఇంటికి రావాలని ఆహ్వానించింది. ఎప్పటిలాగే ఏదో విషయం మాట్లాడుతుందని అనుకున్నాడు. పెళ్లి విషయం మరచిపోయి ఇంటికెళ్లాడు. అలా వెళ్లాడో అంతే సంగతులు. బెడ్ రూమ్‌కు తీసుకెళ్లి మరి చుక్కలు చూపించింది. ప్రేమగా మాట్లాడుతూనే అతని జననాంగాలు కోసేసింది. దీంతో అతను గట్టిగా అరిచాడు. చుట్టుపక్కల వారికి ఆ అరుపులు వినిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి చూసేసరికి బెడ్ రూమ్‌లో యువకుడి పడి ఉన్నాడు. ఆ ప్రాంతం అంతా రక్తంతో నిండి ఉంది. వెంటనే అతనిని పాట్నా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కౌన్సిలర్‌పై దాడి చేసిన నిందితురాలిని అరెస్ట్ చేశారు.


For More National News and Telugu News..

Updated Date - Jul 02 , 2024 | 04:34 PM