Share News

Aadhaar-PAN Linking: రెండు రోజులే ఛాన్స్.. ఆ పని చేయలేదో ఇబ్బందులు తప్పవు..!

ABN , Publish Date - May 29 , 2024 | 12:35 PM

Aadhaar-PAN Linking Last Date: పన్ను చెల్లింపుదారులు, పాన్(PAN Card) కలిగిన వ్యక్తులు మే 31వ తేదీ లోపు తమ పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్(Aadhaar-PAN Linking) చేయాలని ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) అలర్ట్ చేసింది. ఆధార్-పాన్ లింక్ ఎలా చేయాలి? దీనిని లింక్ చేయడం వలన కలిగే ప్రయోజనాలేంటో పేర్కొంటూ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియాలో..

Aadhaar-PAN Linking: రెండు రోజులే ఛాన్స్.. ఆ పని చేయలేదో ఇబ్బందులు తప్పవు..!
Aadhaar-PAN Linking

Aadhaar-PAN Linking Last Date: పన్ను చెల్లింపుదారులు, పాన్(PAN Card) కలిగిన వ్యక్తులు మే 31వ తేదీ లోపు తమ పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్(Aadhaar-PAN Linking) చేయాలని ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) అలర్ట్ చేసింది. ఆధార్-పాన్ లింక్ ఎలా చేయాలి? దీనిని లింక్ చేయడం వలన కలిగే ప్రయోజనాలేంటో పేర్కొంటూ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. గడువు లోగా పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే టీడీఎస్ రేటు పెరుగుతుందని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.


‘పన్ను చెల్లింపుదారులకు గమనిక, మే 31వ తేదీలోగా పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్ చేయండి. తద్వారా అధిక ఆదాయ పన్ను రేట్స్ నుంచి ఉపశమనం పొందండి. గడువులోగా పాన్-ఆధార్ లింక్ చేయకపోతే అధిక ఇన్‌కమ్ ట్యాక్స్ రేట్‌తో పాటు ఇతర మినహాయింపులను పొందలేరు.’ అని ఆదాయపు పన్ను శాఖ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన జారీ చేసింది.


పాన్‌ను ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి?

👉 ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ incometaxindiaefiling.gov.in ను సందర్శించండి.

👉 ‘Quick Links’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

👉 ఆ తరువాత ‘Link Aadhaar’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

👉 ఇప్పుడు మీ పాన్, ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఆపై '‘Validate' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

👉 మీ ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్‌పై కనిపించే విధంగా మీ పేరును నమోదు చేయండి. ఆ తరువాత 'Link Aadhaar' బటన్‌పై క్లిక్ చేయండి.

👉 ఆ తరువాత మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ OTPని నమోదు చేసి, ప్రక్రియను పూర్తి చేయడానికి 'Validate' బటన్‌ను క్లిక్ చేయండి.


పాన్-ఆధార్ లింకింగ్ స్టేటస్‌ను ఇలా చెక్ చేయండి..

👉 ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ https://www.incometax.gov.in/iec/foportal/ కి వెళ్లాలి.

👉 ఆ తరువాత మరియు 'Link Aadhaar' ఆప్షన కింద 'Link Aadhaar Update Status' ఆప్షన్‌ ఉంటుంది. దానిని సెలక్ట్ చేసుకోవాలి.

👉 మీ పాన్, ఆధార్ నెంబర్లను ఎంటర్ చేసి.. ఆపై ‘View Link Aadhaar Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

👉 ఇప్పుడు స్క్రీన్‌పై మీ పాన్, ఆధార్ అనుసంధానం స్టేటస్ కనిపిస్తుంది.

👉 UIDAI ఇప్పటికీ ప్రాసెస్‌లో ఉంటే.. మరుసటి రోజు మళ్లీ స్టేటస్ చెక్ చేసుకోవాలి.

For More National News and Telugu News..

Updated Date - May 29 , 2024 | 02:05 PM