Delhi Polls: 'ఓటుకు నోటు' ఆరోపణ చేసిన ఆప్, తోసిపుచ్చిన బీజేపీ
ABN , Publish Date - Dec 25 , 2024 | 06:23 PM
న్యూఢిల్లీ విధాన్ సభ నియోజకవర్గంలో ఇప్పుడే పర్యటించి తాను వచ్చానని, బీజేపీ నేతలు బహిరంగంగానే ఓట్లు కొంటున్నారని కేజ్రీవాల్ తెలిపారు.
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ నేత పర్వేష్ వర్మ (Parvesh Verma) మహిళా ఓటర్లకు రూ.1,100 చొప్పున పంచినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆరోపించింది. బుధవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి (Atishi) ఈ సంచలన ఆరోపణ చేశారు. ఈ ఆరోపణలను ఆప్ జాతీయ కన్వీనర్ అరవింజ్ కేజ్రీవాల్ బలపరిచారు.
Arvind Kejriwal: త్వరలోనే అతిషిని అరెస్టు చేస్తారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
"కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజక వర్గంలోని ఓటర్లకు ఓటర్ ఐడీలు చెక్ చేసి బీజేపీ డబ్బులు పంచింది. ఈరోజు పర్వేష్ వర్మ తన అధికారిక నివాసంలో డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలోని స్లమ్ ఏరియాల్లో నివసించే మహిళలను పిలిచి రూ.1,1000 చొప్పున కవర్‌లో పెట్టి అందించారు" అని అతిషి తెలిపారు.
ఓట్లు కొంటున్నారు..
కాగా, తన నియోజకవర్గంలో ఓటర్లకు బీజేపీ రూ.1,100 చొప్పున డబ్బులు పంచినట్టు కేజ్రీవాల్ తెలిపారు. న్యూఢిల్లీ విధాన్ సభ నియోజకవర్గంలో ఇప్పుడే పర్యటించి తాను వచ్చినట్టు చెప్పారు. బీజేపీ నేతలు బహిరంగంగానే ఓట్లు కొంటున్నట్టు అక్కడి ప్రజలు చెప్పారు. వాళ్లు ఒక్కో ఓటుకు రూ.1,100 ఇస్తున్నారు. డబ్బులు తీసుకున్నప్పటికీ వాళ్లకు ఓటు వేసేది లేదని జనం నాతో చెప్పారు'' అని కేజ్రీవాల్ ఒక ట్వీట్‌లో తెలిపారు. పర్వేష్ వర్మను తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నట్టు కొందరు తనతో చెప్పారని, అలాంటి వ్యక్తిని సీఎంగా ఢిల్లీ ప్రజలు అంగీకరిస్తారా అని కేజ్రీవాల్ ఆ ట్వీట్‌లో ప్రశ్నించారు.
అబద్ధం: పర్వేష్ వర్మ
కాగా, ఆప్ ఆరోపణలను పర్వేష్ వర్మ తోసిపుచ్చారు. తన తండ్రి దివంగత సాహిబ్ సింగ్ వర్మ (ఢిల్లీ మాజీ సీఎం) ఏర్పాటు చేసిన ఎన్‌జీవో "రాష్ట్రీయ స్వాభిమాన్'' తరఫున డబ్బులు అందజేసినట్టు చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ 11 ఏళ్ల పాలనలో మహిళల ఆవేదనను తాను చూశానని, వారికి నెలవారీ రూ.1,100 చొప్పున ఇవ్వాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. ''అరవింద్ కేజ్రీవాల్ తరహాలో నేను మద్యం పంచడం లేదు. ప్రజలకు సాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది'' అని వెస్ట్ ఢిల్లీ మాజీ ఎంపీ పర్వేష్ వర్మ తెలిపారు. రాష్ట్రీయ స్వాభిమాన్ ప్రజలను ఆదుకోవడంలో ముందుంటుందని, గుజరాత్ భూకంపంలో అతలాకుతలమైన రెండు గ్రామాలు, తుపానులో దెబ్బతిన ఒడిశాలోని నాలుగు గ్రామాలను తిరిగి అభివృద్ధి చేశామని చెప్పారు.
ఇది కూడా చదవండి..
Karnataka: రోడ్డుకు సీఎం పేరు.. మండిపడిన విపక్షాలు
Bengaluru: రేణుకాస్వామి హత్య కేసులో మరో ఐదుగురికి బెయిల్
For National News And Telugu News