Share News

AAP Politics: మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందా..

ABN , Publish Date - Oct 17 , 2024 | 03:48 PM

దేశ రాజధాని ఢిల్లీతోపాటు, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

AAP Politics: మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందా..

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతోపాటు, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇటీవల జమ్మూ కశ్మీర్‌, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్, హరియాణాలో ఖాతా తెరవలేకపోయింది. జమ్మూ కశ్మీర్‌లో ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే రానున్న కొద్ది రోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆప్ ఈ రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తుందా?

'ఇండియా'కే మద్దతు..

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జార్ఖండ్, మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేసే అవకాశం లేదు. రాజకీయ శూన్యత లేని రాష్ట్రాల్లో రెండు, మూడు సీట్ల కోసం ఇతర పార్టీలతో చర్చలు జరపడం వ్యర్థమని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. మహారాష్ట్రలో ఆప్ క్యాడర్ విస్తరించాలని అనుకుంటోంది. అయితే ఇందుకు కేజ్రీవాల్ సహా పార్టీ అధిష్టానం ఆసక్తి చూపట్లేదు. బదులుగా మహారాష్ట్రలో ఇండియా కూటమి పార్టీలకు మద్దతు తెలపాలని భావిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖిగా సాగే ఎన్నికల్లో ఆప్ బరిలో నిలిస్తే.. కాంగ్రెస్సే ఎక్కువగా నష్టపోతోంది. పలు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే విషయం స్పష్టమైంది.


దీంతో మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో నేరుగా పోటీ చేసే బదులు ఇండియా కూటమికి మద్దతు పలకాలని ఆప్ భావిస్తోంది. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం ఉన్నందున ఓటర్లలో గందరగోళం సృష్టించకూడదనే ఉద్దేశంతో మహారాష్ట్రలో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించింది. రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని అంచనా వేశాకే తాము ఈ నిర్ణయానికి వచ్చామని సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈ ఏడాది మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో, జార్ఖండ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. జార్ఖండ్‌లో మొదటి దశ పోలింగ్ నవంబర్ 13న, రెండో దశ నవంబర్ 20న జరగనుంది. రెండు రాష్ట్రాల ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి.


2019లో...

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 2019లో కూడా మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో పోటీ చేసింది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లో 24 స్థానాల్లో బరిలో నిలవగా 23 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. జార్ఖండ్‌లోని 81 స్థానాలకు గానూ ఆ పార్టీ 26 స్థానాల్లో పోటీ చేయగా అభ్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయారు.

ఇటీవల జరిగిన హరియాణా ఎన్నికల్లో 90 స్థానాలకుగానూ 89 చోట్ల పోటీ చేసిన ఆప్ కేవలం 1.53 ఓట్ల శాతం మాత్రమే సాధించి డిపాజిట్లు పోగొట్టుకుంది. ఇక్కడ బీజేపీ 48 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 35 స్థానాల్లో విజయం సాధించింది.

BJP: హరియాణా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం


Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 17 , 2024 | 03:48 PM