Share News

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

ABN , Publish Date - Nov 18 , 2024 | 04:24 AM

దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. ఆదివారం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయిలో 428గా నమోదైంది.

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

  • 107 విమానాలు ఆలస్యం

న్యూఢిల్లీ, నవంబరు 17: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. ఆదివారం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయిలో 428గా నమోదైంది. ఏక్యూఐ 400 పైబడి నమోదు కావడం ఇది వరుసగా ఐదో రోజు. రాజధాని ప్రాంతంలోని బవానాలో అత్యధికంగా 471, అశోక్‌ విహార్‌, జహంగీర్‌పురిలో 466, ముండ్కా, వజీర్‌పుర్‌లో 463గా నమోదయ్యింది. ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో 107 విమానాలు ఆలస్యమయ్యాయి. 3 విమానాలు రద్దయ్యాయి. పొగమంచుతో ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ‘విజిబులిటీ’ 800 మీటర్లకు పడిపోయింది. కాగా, కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీలో ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం కొనసాగుతోంది.

Updated Date - Nov 18 , 2024 | 04:24 AM