Share News

Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

ABN , Publish Date - Sep 28 , 2024 | 10:15 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల బాండ్ల నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్ నగర్ పీఎస్‌ ‌పోలీసులను ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.

Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

బెంగళూరు, సెప్టెంబర్ 28: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల బాండ్ల నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్ నగర్ పీఎస్‌ ‌పోలీసులను ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.

Also Read: Mumbai: నగరానికి పొంచి ఉన్న ముప్పు.. అప్రమత్తమైన పోలీసులు


ఈ ఆరోపణల కారణంగా జ్జానదికార్ సంఘర్ష పరిషత్ సంస్థ సహా అధ్యక్షుడు అదర్ష్ అయ్యార్ తిలక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు స్వీకరించేందుకు తిలక్ నగర్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌లో చట్టసభ ప్రతినిధుల కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

Also Read: PM Modi: నేడు జమ్మూకు ప్రధాని మోదీ


దాంతో ఈ పిటిషన్‌పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది. అందులోభాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను అక్టోబర్ 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, ఈడీ ఉన్నతాధికారులు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజేపీ అగ్రనేతలు నళిని కుమార్ కతీల్, విజయేంద్రలకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? కేంద్రమంత్రి కీలక ప్రకటన

For National News And Telugu News..

Updated Date - Sep 28 , 2024 | 11:31 AM