CEC: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు.. సీఈసీ వార్నింగ్
ABN , Publish Date - Nov 08 , 2024 | 09:01 PM
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారంలో మహిళలను కించపరచేలా వ్యవహరించకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఈసీ సూచించారు. వ్యక్తిగత జీవితాలపై విమర్శలు కూడదని, రాజకీయ ప్రత్యర్థులపై దిగజారుడు వ్యాఖ్యలు చేయరాదని అన్నారు.
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో మహిళా నేతలను కించపరచేలా ప్రవర్తించే వారిపై సకాలంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ ఆదేశించారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు కమిషనర్లు, ఎస్‌పీలు, మున్సిపల్ కమిషనర్లు, రిటర్నింగ్ అధికారులతో జరిపిన సమావేశంలో సీఈసీ ఈ ఆదేశాలిచ్చారు.
Omar Abdullah: ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి... రాష్ట్ర హోదా ఇవ్వండి
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారంలో మహిళలను కించపరచేలా వ్యవహరించకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఈసీ సూచించారు. వ్యక్తిగత జీవితాలపై విమర్శలు కూడదని, రాజకీయ ప్రత్యర్థులపై దిగజారుడు వ్యాఖ్యలు చేయరాదని అన్నారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినా, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా సకాలంలో కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నాయకులు సైతం తమ ప్రసంగాలు, ప్రజలతో నేరుగా సంభాషించేటప్పుడు మహిళలను గౌరవించేలా వ్యవహరిస్తారనే ఆశాభావాన్ని సీఈసీ వ్యక్తం చేశారు. ఇటీవల ఏక్‌నాథ్ షిండే వర్గం నేత షైనా ఎన్‌సీపై శివసేన ఎంపీ అరవింద్ సావంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించిన నేపథ్యంలో సీఈసీ తాజా ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వివాదం ఏమిటి?
ఏక్‌నాథ్ షిండే శివసేన అభ్యర్థిగా ముంబాదేవి నియోజకవర్గం నుంచి షైనా ఎన్‌సీ పోటీ చేస్తుండగా, ఆమెను 'ఔట్ సైడ్ మాల్' అంటూ ఉద్ధవ్ శివసేన ఎంపీ అరవిద్ సావంత్ సంబోధించడం వివాదానికి దారితీసింది. తాను మహిళనని, ఎవరి 'మాల్'ను కాందంటూ షైనా ఎన్‌సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలపై శివసేన యూబీటీకి ఉన్న గౌరవం ఇదేనా అంటూ ఆమె నిలదీశారు. అయితే తన వ్యాఖ్యలు ఎవరినీ కించపరచే ఉద్దేశంతో చేసినవి కావని, తనకు, తన పార్టీకి మొదట్నించీ మహిళలపై ఎంతో గౌరవం ఉందని అరవింద్ సావంత్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, అయినప్పటికీ తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి...
Rahul Gandhi: డొనాల్డ్ ట్రంప్‌కు రాహుల్ గాంధీ లేఖ
CM Sukhu: సీఎం తినాల్సిన సమోసాలు ఎవరు తిన్నారు.. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు
For More National and telugu News