Share News

Tamilisai: డీఎంకేకు వంతపాడుతుంటే కాంగ్రెస్‌ అభివృద్ధి ఎలా సాధ్యం?

ABN , Publish Date - May 18 , 2024 | 12:30 PM

రాష్ట్రంలో దశాబ్దాలుటా డీఎంకేకు వంతపాడుతుంటే కాంగ్రెస్‌ ఎలా అభివృద్ధి చెందగలదని, తెలంగాణా మాజీ గవర్నర్‌, సౌత్‌ చెన్నై లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Dr. Tamilisai Soundararajan) ప్రశ్నించారు.

Tamilisai: డీఎంకేకు వంతపాడుతుంటే కాంగ్రెస్‌ అభివృద్ధి ఎలా సాధ్యం?

- తమిళిసై విమర్శ

చెన్నై: రాష్ట్రంలో దశాబ్దాలుటా డీఎంకేకు వంతపాడుతుంటే కాంగ్రెస్‌ ఎలా అభివృద్ధి చెందగలదని, తెలంగాణా మాజీ గవర్నర్‌, సౌత్‌ చెన్నై లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Dr. Tamilisai Soundararajan) ప్రశ్నించారు. ఏ పార్టీ అయినా స్వశక్తితో ఎదగాలని, ఇతర పార్టీల దయాదాక్షిణ్యాలపై ఎదగకూడదని హితవు పలికారు. శనివారం ఆమె వేలూరు జిల్లా స్వర్ణాలయ సందర్శనకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.


ఇదికూడా చదవండి: Serial Actor Chandu Wife: పవిత్రతో రిలేషన్‌లో ఉంటూ మమ్మల్ని వదిలేశాడు

కావేరి డెల్టా జిల్లాలకు 2.5 టీఎంసీల కావేరి జలాలు విడుదల చేయాలని కావేరి నిర్వాహక మండలి కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలిచ్చినా ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇండియా కూటమిలోనే డీఎంకే, కాంగ్రెస్‌(DMK, Congress) పార్టీలున్నాయని, అలాంటప్పుడు కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ కావేరి జలాల కోసం ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారో తనకు అర్థం కావడం లేదని తమిళిసై అన్నారు. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల వ్యాపారాలు జోరుగా జరుగుతున్నా డీఎంకే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆమె ఆరోపించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 18 , 2024 | 12:30 PM