Share News

Amit Shah : ఉగ్రవాదంపై పోరు ఆగదు

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:43 AM

దేశంలో గత పదేళ్లుగా ప్రశాంత పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఉగ్రవాదంపై పోరును ఆపబోమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

Amit Shah : ఉగ్రవాదంపై పోరు ఆగదు

జవాన్ల త్యాగంతోనే దేశాభివృద్ధి: షా

న్యూఢిల్లీ, అక్టోబరు 21: దేశంలో గత పదేళ్లుగా ప్రశాంత పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఉగ్రవాదంపై పోరును ఆపబోమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. జమ్మూ-కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల్లో మునుపటితో పోల్చితే శాంతి నెలకొందని చెబుతూ ఉగ్రవాదం, అక్రమ చొరబాట్లు, మతపర సెంటిమెంట్లను రెచ్చగొట్టేందుకు జరుగుతున్న కుట్రలపై మాత్రం పోరాటాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

నేషనల్‌ పోలీసు మెమోరియల్‌ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భద్రతా దళాల త్యాగం కారణంగానే ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇంతవరకు విధి నిర్వహణలో 36,438 మంది పోలీసులు అమరులయ్యారని, ఒక్క గత ఏడాదే 216 మంది చనిపోయారని అమిత్‌ షా చెప్పారు..

Updated Date - Oct 22 , 2024 | 03:43 AM