Kuwait Fire: కువైట్ నుంచి 45 మంది మృతదేహాలతో కేరళ చేరుకున్న IAF విమానం..రూ.7 లక్షల సాయం
ABN , Publish Date - Jun 14 , 2024 | 11:20 AM
కువైట్‌లోని ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం(Kuwait building fire accident)లో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలతో భారత వైమానిక దళానికి(IAF) చెందిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం కేరళ(kerala) చేరుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. విమానంలో కీర్తి వర్ధన్ సింగ్ బయలుదేరి వచ్చారు.
కువైట్(Kuwait )లోని ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం(Kuwait building fire accident)లో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలతో భారత వైమానిక దళానికి(IAF) చెందిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం కేరళ(kerala) చేరుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. విమానంలో కీర్తి వర్ధన్ సింగ్ బయలుదేరి వచ్చారు. మృతుల్లో 23 మంది కేరళ రాష్ట్రానికి చెందిన వారు కావడంతో మృతదేహాలతో కూడిన విమానం ముందుగా కేరళ(kerala) చేరుకుంది. విమానం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న క్రమంలో అంబులెన్స్‌లు, పోలీసు బలగాలు మోహరించాయి. ఈ విమానం మళ్లీ కేరళ నుంచి ఢిల్లీకి వెళ్లనుంది.
మృతుల్లో తమిళనాడు నుంచి ఏడుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, బీహార్, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఒక్కొక్కరు చొప్పున కలరు. కువైట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చనిపోయిన 49 మందిలో 45 మంది భారతీయులు, ముగ్గురు ఫిలిప్పీన్స్ వారు ఉన్నారు. కువైట్ సిటీకి దక్షిణాన ఉన్న మంగాఫ్‌లో బుధవారం రాత్రి భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలో 196 మంది వలస కార్మికులు నివసిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారితో పాటు మరో 50 మందికిపైగా గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని కువైట్ ఫైర్ ఫోర్స్ తెలిపింది.
ఈ నేపథ్యంలో స్పందించిన భారత రాయబార కార్యాలయం అధికారులు గురువారం కువైట్ అగ్నిప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారిని కలిశారు. కీర్తి వర్ధన్ సింగ్ గల్ఫ్ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్ యాహ్యా, అల్ సబా, ఆరోగ్య మంత్రి అహ్మద్ అబ్దేల్‌వహాబ్, అహ్మద్ అల్ అవాదీలను విడివిడిగా కలిశారు. దీంతోపాటు కీర్తి వర్ధన్ సింగ్ ముబారక్ అల్ కబీర్ హాస్పిటల్, జాబర్ హాస్పిటల్‌లను కూడా సందర్శించారు. అక్కడ అనేక మంది గాయపడిన భారతీయులు ఉన్నారు.
లులూ గ్రూప్, మోదీ సాయం ప్రకటన
ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త, యూఏఈకి చెందిన లులూ గ్రూప్ ఛైర్మన్ ఎంఎ యూసుఫ్ అలీ కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి రూ. 5 లక్షల మొత్తాన్ని ప్రకటించారు. ఈ రిలీఫ్ ఫండ్‌లో భాగంగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లిస్తామని అబుదాబిలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
మరోవైపు ప్రధాని మోదీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఎ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా, ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పికె మిశ్రాతో కలిసి సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. సమావేశం తరువాత మరణించిన భారతీయ పౌరుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా సహాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు.
ఇది కూడా చదవండి:
Rain Alert: బాబోయ్.. ఇటు ఎండలు.. అటు నాలుగు రోజులపాటు వర్షాలు!
Sudhir Srivatsava Innovations: ఎస్‌ఎ్‌సఐ మంత్ర-3 ఆవిష్కరణ
Read Latest National News and Telugu News