Share News

Bhubaneswar: రత్నభాండాగారంలో పురాతన విగ్రహాలు

ABN , Publish Date - Jul 18 , 2024 | 05:24 AM

పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారం లోపలి గదిలో విలువైన లోహాలతో రూపొందించిన పురాతన విగ్రహాలను అధికారుల బృందం గుర్తించింది.

Bhubaneswar: రత్నభాండాగారంలో పురాతన విగ్రహాలు

భువనేశ్వర్‌, జూలై 17: పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారం లోపలి గదిలో విలువైన లోహాలతో రూపొందించిన పురాతన విగ్రహాలను అధికారుల బృందం గుర్తించింది. వీటి గురించిన వివరాలు పాత జాబితాల్లో ఎక్కడా లేకపోవడం గమనార్హం. ‘పురాతనమైన చిన్న విగ్రహాలు... బహుశా 5 నుంచి 7 వరకూ ఉండొచ్చు. గత నాలుగు దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో దాదాపు నల్లగా మారిపోయాయుు.


మేం ఎవ్వరమూ వాటిని తాకలేదు. వెంటనే ఒక దీపం వెలిగించి వాటికి పూజలు చేశాం. గురువారం వాటిని కూడా తాత్కాలిక స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలిస్తాం’ అని రత్నభాండాగారంలోని ఖజానాను పర్యవేక్షించడానికి ఒడిశా ప్రభుత్వం నియమించిన 11 మంది సభ్యుల కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ చెప్పారు.

Updated Date - Jul 18 , 2024 | 05:24 AM