Salman Khan: సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో మరో కొత్త ట్విస్ట్.. బుధవారం రాత్రి హర్యానాలో..
ABN , Publish Date - Apr 18 , 2024 | 10:21 AM
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ అవ్వగా.. తాజాగా కేసులో మరో కొత్త మలుపు వెలుగు చూసింది. బుధవారం రాత్రి హర్యానాలో..
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ అవ్వగా.. తాజాగా కేసులో మరో కొత్త మలుపు వెలుగు చూసింది. బుధవారం రాత్రి హర్యానాలో ఈ కేసుతో ముడిపడి ఉన్న మరో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇదివరకే అరెస్ట్ చేసిన ఇద్దరు షూటర్స్ (విక్కీ గుప్లా (24), కుమార్ పాలక్(21)) ఇచ్చిన సమాచారం ఆధారంగా.. మూడో నిందితుడి వివరాలు తెలుసుకొని, చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి లారెన్స్ బిష్ణో్య్ (Lawrence Bishnoi) గ్యాంగ్ & షూటర్స్ మధ్య మధ్యవర్తిగా పని చేసినట్లు విచారణలో తేలింది.
తల్లి చేసిన తప్పుకి బాబుకి శాపం.. ప్రెగ్నెన్సీ టైంలో పిల్లి మాంసం తినడంతో..
అంతేకాదు.. షూటర్స్ అయిన విక్కీ, పాలక్‌లకు కాల్పులు జరిపేందుకు గాను రూ.4 లక్షలు సుపారీ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అడ్వాన్స్‌గా వాళ్లకు రూ.1 లక్ష ముట్టినట్లు వెల్లడైంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు చెప్పినట్లు.. ఈ కాల్పుల వెనుక ఉద్దేశం కేవలం సల్మాన్ ఖాన్‌ని భయపెట్టడం మాత్రమేనని, అతడ్ని చంపడం కాదని తెలిసింది. ‘‘సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరపడానికి ముందు.. నిందితులు పన్వేల్‌లోని సల్మాన్ ఫామ్‌హౌస్ వద్ద రెక్కీ నిర్వహించారు. సల్మాన్‌ని భయపెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ కాల్పులు జరిపారే తప్ప, ఆయనను హత్య చేయాలని కాదు. నిందితుల ఇరు కుటుంబాల వాంగ్మూలాలు బిహార్‌లో నమోదు చేయబడ్డాయి. ఈ కేసు విచారణలో భాగంగా.. హర్యానా, ఇతర రాష్ట్రాల నుంచి ఏడు మందిని పిలిపించాం. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది’’ అని ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు వివరించారు.
జపాన్ బుల్లెట్ ట్రైన్‌లో అరుదైన ఘటన.. పాము చేసిన రచ్చ కారణంగా..
ఇదిలావుండగా.. ఆదివారం తెల్లవారుజామున 4:55 గంటలకు బాంద్రాలోని సల్మాన్ నివాసం ఉంటున్న గేలక్సీ అపార్ట్‌మెంట్ వద్దకు బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు, ఐదు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనకి కొన్ని గంటల ముందే కుమార్‌కి తుపాకీ అందినట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. ఈ ఆయుధాన్ని సరఫరా చేసిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులు బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌కు చెందినవారు. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల్ని గుర్తించి.. సోమవారం అర్థరాత్రి గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఆలయ ప్రాంగణంలో అరెస్టు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి