ప్రజాస్వామ్య అంతమే మోదీ లక్ష్యం: కేజ్రీవాల్
ABN , Publish Date - May 18 , 2024 | 04:27 AM
ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఆప్ అధినేత కేజ్రీవాల్ విమర్శించారు.
ముంబయి, మార్చి 17: ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఆప్ అధినేత కేజ్రీవాల్ విమర్శించారు. దేశాన్ని నియంతృత్వం వైపు ఆయన నడిపిస్తున్నారని అన్నారు. ముంబయిలోని బీకేసీ గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన ఇండియా కూటమి సభలో ఆయన ప్రసంగించారు. మోదీతో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని చెప్పారు.
ప్రత్యర్థులను ఓడించలేకపోతే వారిని అరెస్టు చేసి జైలులో వేయాలన్న విధానాన్ని పాటిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ మోదీకి వ్యతిరేకంగా ప్రజలంతా ఉన్నారని, అందుకే ఆయన భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఎన్‌సీసీ(ఎ్‌సపీ) చీఫ్ శరద్ పవార్ ప్రసంగిస్తూ మోదీ కష్టసమయంలో ఉన్నప్పుడు శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే ఆయనకు ఎంతగా సాయపడ్డారో మహారాష్ట్ర ప్రజలకు తెలుసని, కానీ మోదీ ఇప్పుడు వాటన్నింటినీ మరిచిపోయారని విమర్శించారు.