Share News

Delhi Assembly Elections 2025: హనుమాన్ టెంపుల్ నుంచి కొత్త స్కీమ్ రిజిస్ట్రేషన్ షురూ

ABN , Publish Date - Dec 31 , 2024 | 03:39 PM

'పూజారి-గ్రంథి సమ్మాన్ యోజన' స్కీమ్ కింద హనుమాన్ ఆలయ మహంత్ పేరును స్వయంగా కేజ్రీవాల్ రిజిస్టర్ చేశారు.

Delhi Assembly Elections 2025: హనుమాన్ టెంపుల్ నుంచి కొత్త స్కీమ్ రిజిస్ట్రేషన్ షురూ

న్యూఢిల్లీ: వరుసగా నాలుగోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పట్టుదలగా 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) దూసుకెళ్తోంది. మళ్లీ తాము అధికారంలోకి వస్తే ఆలయాల్లోని పూజారులు, గురుద్వారాలోని గ్రంథిలకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మంగళవారంనాడు లాంఛనంగా ఈ స్కీమ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. దీనికి ముందు 'మరగత్ వాలే బాబా టెంపుల్' (ISBT)ను కేజ్రీవాల్, ఆయన భార్య సునిత కేజ్రీవాల్ దర్శించారు. ప్రత్యేక పూజలు జరిపారు. 'పూజారి-గ్రంథి సమ్మాన్ యోజన' (Pujari Samman Yojana) స్కీమ్ కింద ఆలయ మహంత్ పేరును స్వయంగా కేజ్రీవాల్ రిజిస్టర్ చేశారు.

Supreme Court: దల్లేవాల్‌కు వైద్య సహాయం.. పంజాబ్ సర్కార్‌కు మరింత గడువు ఇచ్చిన సుప్రీం


స్కీమ్ ఏమిటి?

పూజారి-గ్రంథి సమ్మాన్ యోజన స్కీమ్‌ను కేజ్రీవాల్ సోమవారంనాడు ప్రారంభించారు. ఈ పథకం కింద ఆలయాల్లో పనిచేసే పూజారులు, గురుద్వారాల్లోని గ్రంథిలకు గౌరవ వేతనంగా నెలకు రూ.18,000 ఇస్తారు. దీనిపై కేజీవాల్ మాట్లాడుతూ, సమాజంలో పూజారులు, గ్రంథీలు కీలక పాత్ర పోషిస్తున్నారని, అయితే తరచు వారు నిర్లక్ష్యానికి గురవుతున్నారని అన్నారు. వారికి సహాయంగా నిలబడేందుకు దేశంలోనే తొలిసారి ఈ పథకాన్ని తాము ప్రవేశపెడుతున్నామని చెప్పారు.


రాజకీయ స్టంట్‌: బీజేపీ

కాగా, కేజ్రీవాల్ కొత్త స్కీమ్‌ను రాజకీయ స్టంట్‌గా బీజేపీ పేర్కొంది. 17 నెలలుగా బకాయిపడిన వేతనాలు చెల్లించాలంటూ కేజ్రీవాల్ నివాసం వెలుపల ఇమామ్‌లు నిరసనలు తెలుపుతున్నారని, కేజ్రీవాల్ మాత్రం కొత్త స్కీమ్ అంటూ రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించింది.


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025

ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2025 ఫిబ్రవరిలోగా ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్' మరోసారి అధికారంలోకి రావడంతో కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2025 ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది.


ఇవి కూడా చదవండి..

CM MK Stalin : కన్యాకుమారిలో అద్దాల వంతెన

‘మహా’ కుంభమేళా!

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 31 , 2024 | 03:39 PM