Kejriwal Bail: కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ షరతులివే..
ABN , Publish Date - May 10 , 2024 | 06:02 PM
లోక్‌సభ ఎన్నికలు మధ్యలో ఉండగా లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు శుక్రవారంనాడు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. పలు షరతుల మీద కేజ్రీవాల్‌కు జూన్ 1వ తేదీ వరకూ అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు మధ్యలో ఉండగా లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టు (Supreme court) శుక్రవారంనాడు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. 'సత్యమేయ జయతే' అంటూ తీర్పును అభివర్ణించింది. పలు షరతుల మీద కేజ్రీవాల్‌కు జూన్ 1వ తేదీ వరకూ అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
షరతులివే..
1. జైలు నుంచి విడుదలకు ముందు రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాలి.
2. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్ వెళ్లవచ్చు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ, సెక్రటేరియట్‌కు కానీ వెళ్లరాదు.
3. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి లేకుండా ఏ అధికారిక ఫైల్ మీద కేజ్రీవాల్ సంతకం చేయరాదు.
4 .ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి కానీ, తనపై ఉన్న అభియోగాలపై కానీ కేజ్రీవాల్ మాట్లాడరాదు.
5. మధ్యం పాలసీ కేసులో సాక్షులతో మాట్లాడకూడదు.
6. జూన్ 2వ తేదీన తిరిగి కోర్టుకు లొంగిపోవాలి.