Arvind Kejriwal: కేజ్రీవాల్ కస్టడీ మళ్లీ పొడిగింపు.. ఇప్పట్లో బయటకు కష్టమేనా?
ABN , Publish Date - Apr 01 , 2024 | 12:15 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు మరో షాక్ తగిలింది. ఈ కేసు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా రోస్ అవెన్యూ కోర్టు(rouse avenue court) అతడి జ్యుడీషియల్ కస్టడీ( judicial custody)ని ఏప్రిల్ 15 వరకు పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు మరో షాక్ తగిలింది. ఈ కేసు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా రోస్ అవెన్యూ కోర్టు(rouse avenue court) అతడి జ్యుడీషియల్ కస్టడీ( judicial custody)ని ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. దీంతో కేజ్రీవాల్‌ను కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు తరలించారు.
ఈడీ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్(Arvind Kejriwal)ను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఈడీ కోర్టును కోరింది. అంతేకాదు లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసు దర్యాప్తుకు కేజ్రీవాల్ సహకరించడం లేదని చెప్పింది. తప్పించుకునే సమాధానలు ఇస్తున్నారని వెల్లడించింది. కేజ్రీవాల్ డిజిటల్ పరికరాల పాస్ వర్డ్స్ ఇవ్వలేదని, తెలీదు అన్న సమాధానాలు మాత్రమే ఇచ్చారని ఈడీ చెప్పింది. ఈడీ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Gas Cylinder: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు బ్రేక్.. ఈసారి ఎంత తగ్గిందంటే
ఈ క్రమంలో కేజ్రీవాల్‌కు తీహార్ జైలులో కొన్ని మందులు అందుబాటులో ఉంచాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది కోరారు. అలాగే, జర్నలిస్ట్ నీరజ్ చౌదరి రాసిన రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్స్, మహాభారత అనే మూడు పుస్తకాలను ఇవ్వాలని అన్నారు. కేజ్రీవాల్ తరపు న్యాయవాది ప్రత్యేక ఆహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తన లాకెట్, టేబుల్ కుర్చీని కూడా అడిగారు.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసి మార్చి 28 వరకు తొలిసారిగా ఈడీ కస్టడీకి పంపింది. తరువాత కేంద్ర ఏజెన్సీ మళ్లీ కస్టడీని కోరినప్పుడు, కోర్టు అతని కస్టడీని ఏప్రిల్ 1 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ కోర్టు గడువు తేదీని ఏప్రిల్ 15 వరకు పెంచింది. విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని కేంద్ర ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. అతను అస్పష్టమైన సమాధానాలు ఇస్తున్నాడని, అతని ఐఫోన్ పాస్‌వర్డ్‌ను కూడా ఇవ్వడం లేదని చెప్పింది. దీంతో ఈ కేసు దర్యాప్తు మరింత ముందుకు సాగనుంది.
అయితే కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలిస్తున్న నేపథ్యంలో ఏ జైలులో ఉంచుతారనే చర్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్‌ను జైలు నంబర్ 2 నుంచి జైలు నంబర్ 5కి మార్చారు. మనీష్ సిసోడియాను జైలు నంబర్ 1లో ఉంచారు. సత్యేంద్ర జైన్‌ను జైలు నంబర్ 7లో ఉంచారు. తీహార్ జైలులో మొత్తం 9 జైళ్లు ఉండగా దాదాపు 12 వేల మంది ఖైదీలు ఉన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Jai Shankar: కచ్చతీవు రగడ.. జై శంకర్ స్పందన ఇదే..