Arvind Kejriwal : తీహాడ్ జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ ఏం చేశారంటే..
ABN , Publish Date - Jun 02 , 2024 | 02:27 PM
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు తీహాడ్ జైలుకు తిరిగి వెళ్లనున్నారు. అయితే జైలులోకి వెళ్లే ముందు రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి.. బాపూజీకి ఘనంగా నివాళులర్పిస్తానని చెప్పారు.
న్యూఢిల్లీ, జూన్ 02: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు తీహాడ్ జైలుకు తిరిగి వెళ్లనున్నారు. అయితే జైలులోకి వెళ్లే ముందు రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి.. బాపూజీకి ఘనంగా నివాళులర్పిస్తానని చెప్పారు. అలాగే కన్నాట్ ప్లేస్‌లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి.. ఆ స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకుంటానని తెలిపారు. అనంతరం ఆప్ కార్యాలయంలోని పార్టీ శ్రేణులను కలిసి.. ఆ తర్వాత తీహాడ్ జైలుకు వెళ్తానని ఎక్స్ వేదికగా కేజ్రీవాల్ ఆదివారం ట్విట్ చేశారు.
మరోవైపు శనివారం ప్రతిపక్షం ఇండియా కూటమి సమావేశానికి వెళ్లే ముందు తన నివాసంలో ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీతో కేజ్రీవాల్ బేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై ఆయన చర్చించారు. అందులోభాగంగా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఫలితాల సరళీపై ఈ సందర్బంగా ఆయన చర్చించారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోదీ ప్రభుత్వ ఏర్పాటు కానుంది, అలాగే ఢిల్లీలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలవనుందని, ఇక డిల్లీ లోక్‌సభ స్థానాల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీ కూటమి ఒక స్థానాన్ని కూడా గెలుచుకోలేని పరిస్థితులున్నాయంటూ వెల్లడించాయి. ఈ అంశాలపై పార్టీ శ్రేణులతో కేజ్రీవాల్ చర్చించినట్లు సమాచారం.
Amaravati Farmers: సీఎం జగన్ పాపం పండనుంది
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ని తీహాడ్ జైలుకు తరలించింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలంటూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్రమంలో మే 10వ తేదీన ఆయనకు సుప్రీంకోర్టు కండిషన్లతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక మే 2వ తేదీ మళ్లీ తీహాడ్ జైలులో లొంగిపోవాలంటూ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అయితే కండిషన్ బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ.. తనదైన శైలిలో దూసుకుపోయారు. మరోవైపు తాను అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నానని.. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం తనకు బెయిల్ మరో వారం రోజులు పొడిగించాలంటూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. కానీ కేజ్రీవాల్ పిటిషన్‌ని సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తొసిపుచ్చింది. ఆ వెంటనే రౌస్ అవెన్యూ కోర్టులో మధ్యంతర, సాధారణ బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వాటిని సీబీఐ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. ఇక ట్రయల్ కోర్టు తన ఉత్తర్వులను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ .. ఆదివారం తీహాడ్ జైలుకు వెళ్లడం అనివార్యమైంది.
For Latest News and National News click here..