Share News

Arvind Kejriwal Arrest: ఆ 'దుందుడుకు' అధికారిని తొలగించండి.. కోర్టును కోరిన కేజ్రీవాల్

ABN , Publish Date - Mar 23 , 2024 | 03:11 PM

కోర్టు వద్ద గత శుక్రవారంనాడు గుమిగూడిన ప్రజలపై దుందుడుకుగా వ్యవహరించిన ఒక పోలీసు అధికారిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫిర్యాదు చేశారు. ఆ అధికారిని తొలగించాలని ఢిల్లీ కోర్టును కోరారు.

Arvind Kejriwal Arrest: ఆ 'దుందుడుకు' అధికారిని తొలగించండి.. కోర్టును కోరిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: కోర్టు వద్ద గత శుక్రవారంనాడు గుమిగూడిన ప్రజలపై దుందుడుకుగా వ్యవహరించిన ఒక పోలీసు అధికారిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఫిర్యాదు చేశారు. ఆ అధికారిని తొలగించాలని ఢిల్లీ కోర్టు (Delhi Court)ను కోరారు. ఆయన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు సంబంధిత అధికారి అనుచిత ప్రవర్తనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను జాగ్రత్త చేయాలని అధికారులను అదేశించింది.


కోర్టు ముందు తనను హాజరు పరచే సమయంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ఏకే సింగ్ కోర్టు రూము చుట్టూ ఉన్న ప్రజలపై చాలా దురుసుగా వ్యహరించినట్టు నిందితుడి (కేజ్రీవాల్) తరఫున పిటిషన్ దాఖలైనట్టు విచారణ సందర్భంగా ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా అన్నారు. కేసులో సహనిందితుడు మనీష్ సిసోడియాను కోర్టు ముందు హాజరు పరచే సమయంలోనూ ఇదే అధికారిపై లిఖితపూర్వక ఫిర్యాదు నమోదైనట్టు కేజ్రీవాల్ తరఫున దాఖలైన ఫిర్యాదులో పేర్కొన్నట్టు న్యాయమూర్తి తెలిపారు. అనంతరం జస్టిస్ కావేరీ బవేజా సంబంధిత అధికారులకు ఆదేశాలిస్తూ, కోర్టు రూము వద్ద దురుసుగా ప్రవర్తించినట్టు చెబుతున్న సీసీటీవీ ఫుటేజ్‌ను జాగ్రత్త చేయాల్సిందిగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్స్ అండ్ సెషన్స్ జడ్జి-కమ్-స్పషల్ జడ్జి (సీబీఐ) రిక్వెస్ట్ లెటర్ రాయాలన్నారు. తదుపరి విచారణ సమయంలో ఫుటేజ్ కాపీని కోర్టు ముందు ఉంచాలని ఆమె ఆదేశాలిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 03:12 PM