Himanta Biswa Sarma: రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయండి.. పోలీసులకు అసోం సీఎం హిమంత ఆదేశం
ABN , Publish Date - Jan 23 , 2024 | 02:22 PM
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని పోలీసులను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదేశించారు. అస్సాంలో రాహుల్ గాంధీ అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
గువహతి: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) కేసు నమోదు చేయాలని అసోం పోలీసులను ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదేశించారు. అస్సాంలో రాహుల్ గాంధీ అశాంతి సృష్టించారని సీఎం మండిపడ్డారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు అసోంలో అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సోమవారం నాడు బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లగా అధికారులు అనుమతి ఇవ్వలేదు. తర్వాత మోరిగావ్ జిల్లాలో పాదయాత్ర చేసేందుకు రాహుల్ గాంధీ బయల్దేరారు. అక్కడ అధికారులు ఆయనను నిలిపివేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని అడ్డుకున్నారు. మంగళవారం నాడు యాత్ర ప్రారంభించేందుకు రాహుల్ గాంధీ బయల్దేరారు. రాహుల్ గాంధీని అడ్డుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అక్కడ ఉన్న బ్యారికేడ్లను తొలగించారు. కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని పోలీసులకు హిమంత శర్మ ఆదేశాలు జారీచేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.