Share News

Lok Sabha Polls: బహుబలిని మించి.. ఒక కుటుంబం కోసం ఏకంగా పోలింగ్ బూత్.. ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:03 PM

దేశం మొత్తం ఓట్ల పండుగ జరుగుతోంది. రాజకీయ నాయకులంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎక్కడ ఓటరుంటే అక్కడ నాయకులు వాలిపోతున్నారు. ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనే లెక్కలు తీస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది.

Lok Sabha Polls: బహుబలిని మించి.. ఒక కుటుంబం కోసం ఏకంగా పోలింగ్ బూత్.. ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..
Assam Family

దేశం మొత్తం ఓట్ల పండుగ జరుగుతోంది. రాజకీయ నాయకులంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎక్కడ ఓటరుంటే అక్కడ నాయకులు వాలిపోతున్నారు. ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనే లెక్కలు తీస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబంలో ఏకంగా 1200 మంది జనభా ఉండగా.. ఆ కుటుంబంలో 350 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి కుటుంబాల్లోనూ మహా అయితే ఓ 30 నుంచి 40 మంది కలిసి ఉంటుంటారు. ఇది ఉమ్మడి కుటుంబం కూడా కాదు. ఒకే వ్యక్తికి చెందిన కుటుంబం.. ఆయన కుమారుులు, కుమార్తెలు, వారి పిల్లలు వీళ్లంతా కలిపి 350 మంది ఓటర్లు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది.

PM Modi: అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించింది.. కాంగ్రెస్‌పై మోదీ విసుర్లు

ఎక్కడంటే..

350 మంది ఓటర్లు ఉన్న ఆ కుటుంబం ఎక్కడ ఉందనుకుంటున్నారా.. అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలోని ఫులోగురి నేపాలీ పామ్‌ గ్రామంలో ఈ కుటుంబం ఉంది. ఇదే ప్రాంతానికి చెందిన దివంగత రాన్ బహదూర్ థాపా కుటుంబం దేశంలో అత్యధిక ఓటర్లను కలిగి ఉన్న కుటుంబంగా రికార్డు నెలకొల్పింది. ఈ కుటుంబంలో మొత్తం 350 మంది ఓటర్లు ఉన్నారు. రాన్ బహదూర్ థాపాకు ఐదుగురు భార్యలు. వీరికి 12 మంది కుమారులు, 9 మంది కుమార్తెలు ఉన్నారు. మొత్తంమీద 1200 మంది సభ్యులున్న ఈ కుటుంబంలో దాదాపు 350 మంది ఓట్లు వేయనున్నారు.

తొలివిడతలోనే..

అస్సాంలోని సోనిత్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి తొలి విడతలో పోలింగ్ జరగనుంది. దీంతో ఈనెల 19వ తేదీన రాన్ బహదూర్ థాపా కుటుంబంలోని 350 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. సాధారణంగా 300 నుంచి 700 మంది ఓటర్లుకు ఓ పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తుంటారు. అదే నగరాల్లో అయితే వెయ్యి మందికి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తారు. ఈ బహుబలి కుటుంబం కోసంమే ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనున్నారు. 350 మంది ఓటర్లు 1200 మంది జనాభా ఉన్న ఈ కుటుంబాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

Delhi: భారతీయుల రక్షణ మా మొదటి ప్రాధాన్యత.. ఇరాన్ - ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ మోదీ స్పష్టీకరణ

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2024 | 12:13 PM