Ayodhya: అన్ని దారులు అయోధ్య వైపే.. గోవా నుంచి పరుగులు తీసిన ప్రత్యేక ఆస్తా రైలు..
ABN , Publish Date - Feb 13 , 2024 | 05:57 PM
అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ఆస్తా రైలు.. రెండు వేల మంది పర్యాటకులతో గోవా నుంచి అయోధ్యకు పరుగులు తీసింది. ఈ మేరకు సోమవారం ప్రయాణం ప్రారంభమైంది.
అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ఆస్తా రైలు.. రెండు వేల మంది పర్యాటకులతో గోవా నుంచి అయోధ్యకు పరుగులు తీసింది. ఈ మేరకు సోమవారం ప్రయాణం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, పార్టీ నేతలు హాజరయ్యారు. ఫిబ్రవరి 15న గోవా మంత్రివర్గం మొత్తం రామ మందిరాన్ని సందర్శిస్తుందని సీఎం ప్రమోద్ తెలిపారు. గోవా ప్రజలందరితో కలిసి రామ్ లల్లాను దర్శించుకోవడం తన అదృష్టం అని అన్నారు. అంతకుముందు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్.. అయోధ్య ధామ్--సూరత్ రైలును సూరత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే.
మరోవైపు.. జలంధర్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు పయనమయ్యారు. దేశంలో మరో ఆస్తా ప్రత్యేక రైలు శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరువనంతపురంలోని కొచ్చువేలి రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం కానుంది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలోని రామ్ లల్లా దర్శనం కోసం వివిధ నగరాల నుంచి భారతీయ రైల్వే 200కు పైగా ఆస్తా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
ఒక్కో ఆస్తా రైలులో 20 స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. ఒక రైలులో దాదాపు 1,400 మంది ప్రయాణించవచ్చు. జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా 'ప్రాణప్రతిష్ఠ' కార్యక్రమం జరగినప్పటి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. ఆధ్యాత్మికంగా సంపన్నమైన భారతదేశంలో తీర్థయాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాంటి ప్రాంతాల్లో అయోధ్య ఒకటి. ఇది హిందూ పురాణమైన రామాయణంలోని శ్రీ రాముని జన్మస్థలం.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.