Kedarnath Temple: నది ఒడ్డున బిస్కెట్లతో శివాలయం.. వీడియో వైరల్
ABN , Publish Date - Mar 08 , 2024 | 07:38 AM
మహాశివరాత్రి సందర్భంగా సంగం నగరంలోని ప్రయాగ్‌రాజ్‌లో బాబా కేదార్‌నాథ్ ఆలయ రూపాన్ని బిస్కెట్‌లతో తయారు చేశారు. ఈ క్రమంలో సంగం ఒడ్డున బిస్కెట్లతో తయారు చేసిన కేదార్‌నాథ్ ఆలయ నమూనా ప్రత్యేక ఆకర్షణ ఎలా ఉందో వీడియోలో చుద్దాం.
మహాశివరాత్రి సందర్భంగా సంగం నగరంలోని ప్రయాగ్‌రాజ్(prayagraj)లో బాబా కేదార్‌నాథ్ ఆలయ(Baba Kedarnath Temple) రూపాన్ని బిస్కెట్‌లతో(Biscuits) తయారు చేశారు. ఈ క్రమంలో సంగం ఒడ్డున బిస్కెట్లతో తయారు చేసిన కేదార్‌నాథ్ ఆలయ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఆలయ నమూనాను ఐదు వేల బిస్కెట్లతో తయారు చేశారు. అలహాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని ఫైన్ ఆర్ట్స్ విభాగానికి చెందిన అజయ్ గుప్తా, అతని విద్యార్థుల బృందం నాలుగు రోజుల పాటు కష్టపడి దీనిని రూపొందించారు.
ఇది చూసిన పలువురు చాలా బాగుందని అంటున్నారు. మరికొంత మంది సెల్ఫీలు కూడా దిగుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. అయితే మహాశివరాత్రి(mahashivratri 2024) సందర్భంగా ఈ కేదార్‌నాథ్ ఆలయ రూపాన్ని బిస్కెట్‌లతో చేసి ప్రదర్శించారు.
ఈ కేదార్‌నాథ్ ఆలయ నమూనాను చూసేందుకు సంగం(sangam) ఒడ్డున పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కుల, మతాలకు అతీతంగా పలువురు దీనిని చూసి విద్యార్థుల సేవలను కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఆలయ విగ్రహం ముందు శంఖం ఊది భక్తిని చాటుకున్నారు. ఈరోజు మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భక్తులు(devotees) శివాలయాలకు పెద్ద ఎత్తున తరలివెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Mahashivratri 2024: కాశీ, నాసిక్ ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. వీడియో