Share News

Bangalore: బెంగళూరు నగరం.. జలదిగ్బంధం..!

ABN , Publish Date - Oct 16 , 2024 | 12:33 PM

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రాన్ని మంగళవారం వర్షం కుదిపేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వాన హోరెత్తించింది. తీరప్రాంత జిల్లాలు దక్షిణకన్నడ, ఉత్తరకన్నడ, ఉడుపి పరిధిలో వర్షంతోపాటు ఈదురుగాలులు ఇబ్బంది పెట్టాయి.

Bangalore: బెంగళూరు నగరం.. జలదిగ్బంధం..!

- రాజధానిని కుదిపేసిన వర్షాలు

- రాష్ట్రవ్యాప్తంగా అదేజోరు

- స్తంభించిన ట్రాఫిక్‌

బెంగళూరు: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రాన్ని మంగళవారం వర్షం కుదిపేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వాన హోరెత్తించింది. తీరప్రాంత జిల్లాలు దక్షిణకన్నడ, ఉత్తరకన్నడ, ఉడుపి పరిధిలో వర్షంతోపాటు ఈదురుగాలులు ఇబ్బంది పెట్టాయి. మలెనాడు జిల్లాలతోపాటు ఉత్తర కర్ణాటక(Karnataka) జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి. మలెనాడు, తీరప్రాంతం, ఉత్తర కర్ణాటకలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాయుగుండం తోడైంది. బెంగళూరు నగర పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం రోజంతా కురిసింది.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: చెన్నైలో కుండపోత.. నదుల్లా వీధులు.. చెరువుల్లా వాడలు


నగర పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగవార లుంబిని గార్డెన్‌ పరిధిలో రోడ్డుపై భారీగా నీరు చేరడంతో గంటలతరబడి వాహనాలు నిలిచిపోయాయి. ప్రముఖ ఐటీ కంపెనీలకు నెలవైన మాన్యతాటెక్‌ పార్క్‌ ప్రాంతంలో ప్రజలు సంచరించేందుకు ఇబ్బంది పడ్డారు. మారతహళ్ళి, కేఆర్‌పురం, వైట్‌ఫీల్డ్‌ ప్రాంతాలలో రోడ్డెక్కినవారు గంటలతరబడి కదలలేకపోయారు. ఇక ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు జనం వెనుకడుగు వేశారు. సిల్క్‌బోర్డ్‌, బన్నేరుఘట్టరోడ్డు, జయనగర్‌, మైసూరు రోడ్డు, హెబ్బాళ ప్రాంతాలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం వరకు వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.


మరో మూడు రోజులు భారీగా వర్షాలు ఉంటాయని వాతావరణ పరిశోధనశాఖ ప్రకటించడంతో బుధవారం నగరంలోని అన్ని పాఠశాలలు, హైస్కూళ్లకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలకు ఈనెల 20వరకు దసరా సెలవులు ఉన్నాయి. కానీ ప్రైవేట్‌ విద్యాసంస్థలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఐటీఐ, డిప్లమా కళాశాలలు యథావిధిగా పనిచేయనున్నాయి. కానీ విద్యార్థులు కళాశాలలకు వచ్చివెళ్లే సమయంలో ప్రమాదాలు జరగకుండా సురక్షితమైన విధానాలు పాటించాలని, శిథిలావస్థకు చేరిన భవనాల్లో తరగతులు నిర్వహించరాదని,


ప్రస్తుతం వర్షాల కారణంగా అత్యవసరంగా సెలవు మంజూరు చేసిన మేరకు శనివారం మధ్యాహ్నం లేదా ఆదివారంలో ఒకరోజు అదనపు తరగతులు కొనసాగించాలని సూచించారు. కళాశాల విద్యార్థులకు ప్రకృతి వైపరీత్యాలు ఎలా నిభాయించాలనేది సమాచారం ఇవ్వాలని కళాశాలల వాహనాలను పర్యవేక్షించాలని విద్యార్థులు నీరు నిల్వ ఉండే తగ్గు ప్రదేశాలకు వెళ్లరాదని సూచించారు. నగర వ్యాప్తంగా వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.


ఇదికూడా చదవండి: CM Revanth Reddy: సీఎం సంతకం చేసినా బదిలీల్లేవ్‌!

ఇదికూడా చదవండి: KTR: విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న సర్కార్‌

ఇదికూడా చదవండి: తాళం వేస్తే కేసులు.. ఎవరి మాటల్తోనో కవ్వింపు చర్యలొద్దు

ఇదికూడా చదవండి: Gurukulas: గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 16 , 2024 | 12:33 PM