దేశంలో పెనుమార్పు: రాహుల్
ABN , Publish Date - May 21 , 2024 | 05:30 AM
దేశంలో పెనుమార్పు సంభవిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు అండగా ఉన్నారన్నారు. అయిదో దశలో భాగంగా సోమవారం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు......
న్యూఢిల్లీ, రాయబరేలీ(యూపీ), మే 20: దేశంలో పెనుమార్పు సంభవిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు అండగా ఉన్నారన్నారు. అయిదో దశలో భాగంగా సోమవారం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా రాహుల్ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. మొదటి నాలుగు దశల్లో ప్రజలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అండగా నిలిచారని స్పష్టమయిందని ఆయన తెలిపారు. దేశం విద్వేష రాజకీయాలు రాజకీయాలతో విసిగిపోయి ఉందని, ప్రస్తుతం ప్రజలు అసలైన సమస్యల గురించి ఆలోచించి ఓటు వేస్తున్నారని, బీజేపీతో పోరాడుతున్నారని అన్నారు. తాను పోటీ చేస్తున్న రాయబరేలీలోని పలు పోలింగ్ కేంద్రాలను రాహుల్ సందర్శించారు. రాయబరేలీలోని ఓ హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు.