Tomato Rate: మళ్లీ పెరిగిన టమాట ధర.. రంగంలోకి దిగిన కేంద్రం
ABN , Publish Date - Oct 07 , 2024 | 08:52 PM
దేశ రాజధాని న్యూఢిల్లీలో కూరగాయల మార్కెట్‌లో కిలో టమాట ధర రూ. 100కు చేరింది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వినియోగదారులకు సబ్సిడీ మీద కేజీ టమాట రూ. 65లకే అందజేయాలని నిర్ణయించింది. నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా టమాట విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 07: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు జరుగుతున్నాయి. మరో వైపు నిత్యవసర ధరలు ఆకాశానంటుతున్నాయి. ఇప్పటికే పప్పులు, ఉప్పులు ధరలు భారీగా పెరిగాయి. ఇక వంట నూనెల ధరలు అయితే సలసలా కాగుతున్నాయి. అలాగే కూరగాయలు ధరలు సైతం పప్పులు, ఉప్పులు, వంట నూనెల ధరలతో పోటి పడుతున్నాయి. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో కూరగాయల మార్కెట్‌లో కిలో టమాట ధర రూ. 100కు చేరింది.
Also Read: Assembly Election Results: రేపు వెలువడనున్న రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వినియోగదారులకు సబ్సిడీ మీద కేజీ టమాట రూ. 65లకే అందజేయాలని నిర్ణయించింది. నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌సీసీఎఫ్) ద్వారా టమాట విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. దీని ద్వారా ఢిల్లీ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేసి... వినియోగదారులకు టమాట విక్రయించనుంది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిథి ఖేరే సోమవారం న్యూఢిల్లీలో వెల్లడించారు.
Also Read: Dasara 2024: దసరా వేళ.. సామాన్యుడు ఉక్కిరి బిక్కిరి
మరో మూడు నాలుగు రోజుల్లో టమాట ధరలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని దాదాపు 50 కాలనీల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా టమాటలను విక్రయిస్తామని చెప్పారు. గతంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి టమాట దిగుబడి బాగానే ఉండేదన్నారు. కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా టమాట పంట దిగుబడి బాగా తగ్గిందని వివరించారు.
Also Read: Dasara Navaratri 2024: ఆరో రోజు.. ఈ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మ వారు
Also Read: మోకాళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఇవి తీసుకోకండి..
ఈ నేపథ్యంలో టమాట ధర అమాంతంగా పెరిగిందని చెప్పారు. పండగ సమయం కావడంతో టమాట వినియోగం సైతం అధికంగా ఉంటుందన్నారు. ఇక న్యూఢిల్లీలో బంగాళదుంప కేజీ రూ. 40 ఉందన్నారు. అలాగే ఉల్లిపాయ కేజీ రూ. 58 రూపాయిలుగా ఉందని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిథి ఖేరే వివరించారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సైతం టమాట ధర రూ. 100 ఉంది. దాంతో వాటిని సబ్సీడి మీద వినియోగదారులకు అందజేసేందుకు ఆయా ప్రభుత్వాలు సైతం రైతులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.
Also Read: Batti Vikramarka: ప్రజా అజెండా తప్పా.. వ్యక్తిగత అజెండా లేదు
Also Read: Amith Shah: ముగిసిన భేటీ.. మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు
ఏదీఏమైనా.. కూరగాయాలన్నింటిలోకి టమాటాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏడాదిలో ఒకొక్కసారి కేజీ టమాటా ధర రాకేట్ స్పీడ్‌తో ఆకాశాన్ని చేరుతుంది. దీంతో కేజీ టమాట ధర రూ. 150 నుంచి రూ. 200 వరకు ఉంటుంది. మరికొన్ని సమయాాల్లో మాత్రం.. అదే కేజీ టమాట ధర రూ. 5 లేదా రూ. 10గా ఉంటుంది. అయితే ఆకాశంలో లేకుంటే నేల మీద ఉండే ఒకే ఒక్క కూరగాయి టమాట. ఇక మరి కొన్ని సందర్బాల్లో ఇదే టమాటకు మద్దతు ధర లేక రోడ్లపై రైతులు పారబోసిన సందర్బాలు సైతం తెలుగు రాష్ట్రాల్లో కొకొల్లలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే.
For National News And Telugu News...