Shocking: కూల్ డ్రింక్ తాగి చనిపోయిన ఖైదీ.. కేసులో ట్విస్ట్ నెక్ట్స్ లెవెల్..!
ABN , Publish Date - Jul 26 , 2024 | 05:51 PM
అండర్ ట్రయల్ ఖైదీ.. మరికాసేపట్లో కోర్టులో హాజరుకావాల్సిన వ్యక్తి.. కూల్ డ్రింక్ తాగి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలే కోల్పోయాడు. ఇప్పుడిదే సంచలనంగా మారింది. నిమిషాల ముందు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి.. కాసేపటికే ప్రాణాలు కోల్పోవడం హాట్ టాపిక్‌గా మారింది.
పాట్నా, జులై 26: అండర్ ట్రయల్ ఖైదీ.. మరికాసేపట్లో కోర్టులో హాజరుకావాల్సిన వ్యక్తి.. కూల్ డ్రింక్ తాగి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలే కోల్పోయాడు. ఇప్పుడిదే సంచలనంగా మారింది. నిమిషాల ముందు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి.. కాసేపటికే ప్రాణాలు కోల్పోవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ వ్యక్తి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బీహార్‌లోని పూర్నియాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బీహార్‌లోని పూర్నియాలో అండర్ ట్రయల్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు వివేక్ కుమార్ అలియాస్ లాల్ యాదవ్ (23).. ఓ హత్య కేసులో గత 5 ఏళ్లుగా అరారియా జైల్లో ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో జైలు నుంచి విడుదల కానున్నాడు. ఈ క్రమంలోనే నిందితుడిని సుపాల్ సివిల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అనంతరం అతన్ని తిరిగి మండల్ జైలుకు తీసుకువెళుతున్నారు పోలీసులు. ఇంతలో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు కోర్టు ఆవరణలోకి రాగా.. పోలీసుల అనుమతితో వారందరినీ కలిసి, మాట్లాడాడు వివేక్. ఆ స్నేహితులు వివేక్‌కి ఒక కూల్ డ్రింక్ ఇవ్వగా అది తీసుకున్నాడు. పోలీస్ వాహనం ఎక్కి ఆ కూల్ డ్రింక్ తాగాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఇంతలోనే ఘోరం జరిగింది. కూల్ డ్రింక్ తాగిన కాసేపటి తరువాత వివేక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే పోలీసుల కస్టడీలో ఖైదీ చనిపోవడంతో ఇప్పుడు పెద్ద ఇష్యూ అయ్యింది. వివేక్‌ను హత్య చేశారంటూ మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
మరణానికి ముందు వీడియో..
కోర్టులో హాజరుపరిచేందుకు వెళుతున్న సమయంలో వివేక్‌ను అతని కుటుంబ సభ్యులు కూడా కలిశారు. వారంతా వివేక్‌తో ఫోటోలు దిగారు. వీడియోలు తీసుకున్నారు. అప్పుడు వివేక్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే, వివేక్‌ను కోర్టు నుంచి పోలీస్ వ్యాన్‌లో ఎక్కించిన తరువాత తనకు స్నేహితులు ఇచ్చిన కూల్ డ్రింక్ తాగాడు. అది తాగిన కాసేపటికి అతని ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు పోలీసులు. కానీ, అప్పటికే వివేక్ చనిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఇది ముమ్మాటికీ హత్యే అని ఆరోపించారు. స్నేహితులు ఇచ్చిన కూల్ డ్రింక్‌లో విషం కలిపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న అతను.. కూల్ డ్రింక్ తాగిన తరువాత ప్రాణాలు కోల్పోయాడని అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: