Mallikarjun Kharge: 400 సీట్ల మాట మీరు మరిచిపోండి.. 200 కూడా దాటవు
ABN , Publish Date - May 28 , 2024 | 06:30 PM
భారతీయ జనతా పార్టీ ''అబ్ కీ బార్ 400 పార్'' నినాదంతో ఈసారి ఎన్నికల్లో దిగడం, ఇంతవరకూ జరిగిన ఆరు విడతల ఎన్నికలో దాదాపు లక్ష్యానికి చేరుకున్నామని క్లెయిమ్ చేసుకోవడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం స్పందించారు. 400 సీట్ల క్లెయిమ్ ''బక్వాస్'' (నాన్సెన్స్) అని కొట్టిపారేశారు.
అమృత్‌సర్: భారతీయ జనతా పార్టీ ''అబ్ కీ బార్ 400 పార్'' నినాదంతో ఈసారి ఎన్నికల్లో దిగడం, ఇంతవరకూ జరిగిన ఆరు విడతల ఎన్నికలో దాదాపు లక్ష్యానికి చేరుకున్నామని క్లెయిమ్ చేసుకోవడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మంగళవారంనాడు స్పందించారు. 400 సీట్ల క్లెయిమ్ ''బక్వాస్'' (నాన్సెన్స్) అని కొట్టిపారేశారు. ఆ పార్టీకి 200 సీట్లు కూడా దాటవని చెప్పారు.
Lok Sabha Elections: అవును...పారిశ్రామిక వేత్తలను కాపాడేందుకే భగవంతుడు మోదీని పంపాడు..!
అమృత్‌సర్‌లో మంగళవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ, గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గుతాయని, కాంగ్రెస్, 'ఇండియా' కూటమి లబ్ది పొందుతుందని చెప్పారు. అలాంటప్పుడు 400 సీట్లకు పైగా గెలుచుకుంటామని ఏ ఆధారంతో వాళ్లు (బీజేపీ) చెబుతున్నారని ప్రశ్నించారు. ''మీరు (సీట్లు) తగ్గుతూ మేము పెరుగుతున్నాం. 400 సీట్లు మాట మరిచిపోండి. అదంతా నాన్సెన్స్. మీరు కనీసం ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయలేరు. మీకు 200 సీట్లకు మించి రావు'' అని ఖర్గే స్పష్టం చేశారు.