Maharashtra Elections: బీజేపీ ఒంటిరిగా గెలువలేదు కానీ... దేవేంద్ర ఫడ్నవిస్ జోస్యం
ABN , Publish Date - Oct 27 , 2024 | 09:34 PM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల పంపిణీ విషయంలో కొందరు ఆగ్రహంతో ఉన్న విషయంపై దేవేంద్ర ఫడ్నవిస్‌ను అడిగినప్పుడు, టిక్కెట్లు ఆశించిన కొందరు పార్టీ నేతలకు ఛాన్స్ ఇవ్వలేకపోవడం బాధాకరమేనని అన్నారు.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections)లో బీజేపీ ఒంటరిగా గెలవలేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎకైక పెద్ద పార్టీగా బీజేపీ నిలుస్తుందని అన్నారు. ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్‌సీపీతో కలిసి తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
MahaRastra: మిగిలింది 48 గంటలే.. కొలిక్కి రాని పంచాయతీ
''రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా నెగ్గలేదనేది నిజం. అయితే ఎక్కువ సీట్లు, ఎక్కువ ఓటింగ్ శాతం సాధిస్తామన్నది కూడా నిజం. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలుస్తుంది. మూడు పార్టీల ఓట్లు గంపగుత్తగా మాకు విజయాన్ని అందిస్తాయి'' అని ఫడ్నవిస్ తెలిపారు. సీట్ల పంపిణీ విషయంలో కొందరు ఆగ్రహంతో ఉన్న విషయంపై అడిగినప్పుడు, టిక్కెట్లు ఆశించిన కొందరు పార్టీ నేతలకు ఛాన్స్ ఇవ్వలేకపోవడం బాధాకరమేనని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో 48 సీట్లకు బీజేపీ కూటమి 17 సీట్లకే పరిమితం కావడంపై అడిగిన ప్రశ్నకు అదంతా "ఓట్ జీహాద్" ఫలితమేనని ఫడ్నవిస్ సమాధానమిచ్చారు. ధులే లోక్‌సభ నియోజకవర్గంలో తమ అభ్యర్థి 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో లీడింగ్‌లో ఉండగా, మలెగావ్-సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్ తమ ఓటమికి కారణమైందన్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఇది సాధ్యం కాదని, అక్కడి ఐదు సీట్లలోనూ బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. కాగా, 288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి...